Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

05 పొందుచు, సజీవమై పెరుగుచు, నిత్యప్రవర్థమాన చైతన్యవంతమై యుండును. ప్రతి విశ్వవిద్యాలయమును ప్రతి పరిశోధన సంస్థయు దీనికి బలసంధాయక మార్గముగ నుండవలెను. నూత్న ధీశాలులలో ప్రతియొక్కనికిని ఏతత్రోళ స్థాయి సంపాదకవర్గముతో సంబంధము కల్పింపబడవలెను, ఇట్టి విశ్వ విజ్ఞానకోశము ప్రపంచ సంస్కృతికి మూఢ దీక్షా ప్రతిబంధకములేని బైబిలు గ్రంథము కాగలదు. విద్యారంగమునందు దీని ప్రాముఖ్య మపారము. పాఠ శాలల యందును, కళాశాలల యందును విద్యాబోధనమున కిది సహాయకమై, ప్రామాణికమై ప్రాతిపదిక జ్ఞాన విషయముల నిధిగా నుండగలదు. వేద్యాంశముల పరామర్శమునకును, వక్కాణముల పరిశీలనమునకును ఇది మూలాధారము కాగలదు. వేయేల, ఈ నాటి మన బౌద్ధిక సంస్థలు - చెల్లాచెదరై పెడదారి త్రొక్కియున్న ఈ సంస్థలు సాధింపలేని మహత్తర ప్రయోజనమును ఈ ప్రపంచ విజ్ఞాన సర్వస్వము సాధింపగలదు. ప్రపంచము నంతను మానసిక బాంధవ్య సూత్రములచే సంహితపరచుటయే ఆ మహత్తర లక్ష్యము." - - ఇదిగో! ఒక దళము విరిసిన షట్చక్రకమలము. దీనిని సాదరముగ పరీక్షింపుడు. “అలినీగరుదనీక మలినీకృతము” చేయుడు, విలంబ అధిక శ్రావణ బహుళ 8 - గురువారం 7 ఆగస్టు 1958 విద్యానగరం, హైదరాబాదు. బుధనిధేయుడు ఖండవల్లి లక్ష్మీరంజనం కార్యదర్శి