Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేయుదురు. దీనికొక షరతు కలదు. సమితివారు ప్రజలనుండియు ప్రజాహిత సంస్థలనుండియు సంవత్సరమునకు రు. 12,500 లు విరాళములు సంపాదించుకొని ప్రభుత్వమునకు చూపవలెను. ఈ ప్రణాళిక క్రింద ఆంధ్రప్రదేశ ప్రభుత్వమువారు తొలిసారిగా రు. 15,000 ధనసహాయము చేయించుటచే మొదటి సంపుటము ముద్రణము జయప్రదముగ సాగినది. ఈలోగడ వ్యాపార సంస్థలును మాకు చక్కగా తోడ్పడినవి. సింగ రేణి బొగ్గుగనుల నిర్వాహకులు రు. 1,500 లును, నిజాం చక్కెర కర్మాగారమువారు రు. 500 లును విరాళము లిచ్చిరి. ఇంతవరకును విజ్ఞానకోశ సమితికి లభించిన ఆర్థిక సహాయము తెలంగాణము నుండియే లభించెను. మొదటి సంపుటమైనను ముద్రణమయిన తరువాత ఆంధ్రప్రాంత సోదరులను సహాయ మభ్యర్థింప వచ్చుననియు అది మాకు కొంగు బంగార మనియు వేచియున్నాము. ఇట్లుండ మా కార్యవర్గ సభ్యులును సింహాచల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ధర్మకర్తలును అగు శ్రీ పి. వి. జి. రాజు గారి సంకల్పముచే స్వామి భాండారమునుండి సమితికి రు. 5,000 లు ధన సహాయము వాగ్దానము చేయబడి యున్నది. అది ఇంతలో రాగలదు. వడ్డికాసుల దై వమగుటచే కాబోలు శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి వెనుక ముం దాడుచున్నాడు. కాని ఆయన తలచు కొన్నచో కొదువ ఏమి? వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారు ఉపేక్ష వహింతురా ! భారత ప్రభుత్వము వారుకూడ మున్ముందు విజ్ఞానకోశ సమితి కార్యక్రమమును గుర్తించి సాదర సహాయము చేయగలరని విశ్వసించు చున్నాము, ఆంధ్ర భాషాభిమానులును, గ్రంథాలయములు, కళాశాలలు, పాఠశాలలు, మున్నగు సంస్థలును ధర్మనిధులు కల పారిశ్రామిక వ్యాపార సంస్థలును సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ సమితికి భూరి విరాళము లిచ్చి తోడ్పడగలరని విన్నవించుచున్నాము. సమితి సమకూర్ప గలిగిన సాధన సామగ్రియు, ఇతర సౌకర్యములును తక్కువయైనను, భాషాభిమాన ముతో కృషిచేసి యీ సంపుట ప్రకటనమునకు ముఖ్య కారకులైన మా సంపాదకులకును, వారికి చేదోడువాదో డుగానుండిన శాఖా సంపాదకీయ వర్గసభ్యులకును మా కృతజ్ఞతలు తెల్పుచున్నాము. అల్ప వేతనములపై పనిచేయు చుండియు కార్యసిద్ధినే ఆశించి ప్రశంసనీయమైన కృషి చేసిన కార్యాలయోద్యోగు లందరికిని, ముఖ్యముగ దీనికి మెదడుగా వ్యవహరించిన పెద్దలు శ్రీ ఆదిరాజు వీరభద్రరావు, ఆచార్య గరికపాటి లక్ష్మీ కాంతయ్య గార్లకును మేము కృతజ్ఞులము. ఆరంభము నుండియు నీ యుద్యమమునకు చేయూత నిచ్చియు, ఉచిత విరా ళముల నిచ్చియు, గ్రంథ ముద్రణ కార్యమును విజయవంతముగ సాగించిన ముద్రాపకులు శ్రీ అజంతా ప్రింటర్సు వారికి సమితీ ఋణపడి యున్నది. ఇంత పెద్ద యెత్తున ముద్రణకార్యము నిర్వహించుటకు శ క్తి యు, యుక్తియు, రక్తియు గల అచ్చు కార్యాలయములు తెలంగాణములో కలవని అజంతావారు నిరూపించి కీర్తి సంపాదించుకొన్నారు. సికింద్రాబాదు దుర్గా బ్లాక్ మేకింగు కంపెనీవారు బ్లాకులను సత్వరముగను, ముచ్చటగను సిద్ధముచేసి మాకు తోడ్పడి యున్నారు. ఎందరో మిత్రులు, హితైషులు వారందరకును మా కృతజ్ఞతా నమోవాకములు. - హెచ్. జి. వెల్సు మహాశయుని "ప్రపంచ విజ్ఞాన సర్వస్వ" భావనతో నీ పీఠికను సమాప్తి చేయు దుము. ఆదర్శప్రాయమైన ప్రపంచ విజ్ఞాన సర్వస్వ మిట్లుండవలెనని ఆతడు భావించెను. “ఈ గ్రంథ మెన్ని యో సంపుటముల వరుస నాక్రమించును. విషయములు ఎక్కువగ వెదకుకొన నక్కరలేక యే దీనియందు లభించును. భాష సులభమై, సుగ్రాహ్యమై యుండగలదు. ఆధునిక సాంఘిక వ్యవస్థ యొక్క మూల భావములును, విజ్ఞాన మును అన్ని రంగములకు సంబంధించిన ఆకార సూత్రములును ముఖ్యాంశములును, మనము నివసించు విశ్వ మునుగూర్చి నిర్దుష్టమయి సాధ్యమైనంతగా వివరణాత్మకమగు జ్ఞానమును, ప్రపంచ దేశముల సామాన్య చరిత్ర మును, విజ్ఞానము యొక్క మూలాధారములైన ప్రాతిపదిక సామగ్రియు, పరామర్శ గ్రంథ ముల విశ్వసనీయమైన క్రోడీకరణమును ప్రపంచ విజ్ఞాన సర్వస్వములో చూడగలము.” “మరియు ఈ విశ్వ విజ్ఞానకోశము భూమండలము నందలి ప్రతి వివేకశాలియైన వ్యక్తికిని మానసిక భూమికగా నుండదగును. ప్రపంచమునందలి విజ్ఞానవేత్తల చేతులలో ఇది తరచు పునర్నవికృత రూపమును