Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 సంపుటములు మించిపోవునట్లే సూచనలు కాన్పించుచున్నవి. ఒక్కొక్క సంపుటము యొక్క నిర్మాణ వ్యయము రు. 40,000 చొప్పున పూర్తి గ్రంథమునకు దాదాపు రు. 2,50,000 వ్యయము కాగలదని అంచనా వేయబడినది. ప్రతి సంపుటము వెల రు. 20 ఏర్పాటు చేయ నై నది. కార్యక ర్తల ఉత్సాహము సంపాదకుల భాషానిరతి మాత్రమే ఈ యుద్యమమునకు మూలధనముగా నుండెను. ఉద్యమ స్థాపకులైన డాక్టరు బి. విశ్వనాథముగారి రు. 100 విరాళములో దీనికి శ్రీకారము చుట్ట బడెను. ఉద్యమరేఖ లింకను సుస్పష్టము కానిదినములలోనే, అప్పుడు ఆదిలాబాదు జిల్లా బోధ్ గ్రామములో తహసిల్దారుగా నుండిన మా మిత్రులు శ్రీ వి. బి. నరసారెడ్డిగారు విజ్ఞాన కోళమునకు రు. 100 మొట్టమొదటి మనియార్డరు పంపి చుక్క వ్రాయించుకొనిరి. వెనువెంటనే శ్రీ జి. వి. సుధాకరరావు గారును, శ్రీ ఇ. వి. రామి రెడ్డిగారును రోజు కొనుచు వచ్చి చిన్న దెబ్బలను అందుకొని మురిసిపోయిరి. శ్రీ రాజా వేంకట మురళీ మనోహర రావుగారిచ్చిన రు. 800 లతో సమితి కార్యాలయము ఒక టైపు లేఖినితో ఆరంభింపబడెను. ఇట్టిది చీమ గంగా యాత్రగా సాగజొచ్చెను. ప్రారంభ సంవత్సరము అందే మాకు ఆదిలాబాదు జిల్లానుండియు, వరంగలు జిల్లా నుండియు, సభ్యత్వ రుసుములు కొన్ని వచ్చి కాలు నిలువదొక్కుకొనుటకు తోడ్పడినవి. అప్పటి హైదరాబాదు ప్రభుత్వములో వ్యవసాయశాఖా మంత్రులును సమితికి ఇప్పుడును ఉపాధ్యములును అయిన మర్రి చెన్నా రెడ్డిగారు మాకు గొప్ప చేయూత నిచ్చిరి. అట్లే అప్పటి హైదరాబాదు శాసనసభా సభ్యులు కొందరు మా యుద్యమమును ఆదరించి తమ నైతిక సహాయము మా కొసంగి అండయై నిలిచిరి. శ్రీమతి ఆరుట్ల కమలాదేవిగారును శ్రీయుతులు కే. వి. నారాయణరెడ్డి, కె. పెద వెంక ట్రామారావుగార్లును శాసనసభా వర్గమునందు మా కొఱకు చేసిన సేవ ప్రశంసనీయము. ఈ తొలిదినములందే వనపర్తి రాజా రామదేవరావు బహద్దరుగారు రు.500 విరాళమునిచ్చి తోడ్ప డిరి, సికింద్రాబాదు పురపాలక సంఘమువారు 1955 లో రు 1000 ల విరాళమును మంజూరుచేసి స్థానిక పరిపాలనా సంస్థలకు మార్గదర్శకులైరి. ఈ సంవత్సరాంతమున అప్పటి హైద్రాబాదు ప్రభుత్వము వారు రు. 10,000 లు సహాయముగా ప్రసాదించి సమితికి వెన్నెముక ఏర్పడునట్లు చేసిరి. వెనువెంటనే హైదరా బాదు పురపాలక సంఘమువారు రు. 2000 లును, మరికొంత కాలమునకు నల్లగొండ జిల్లా బోర్డు వారును, మహబూబు నగర్ జిల్లాబోర్డువారును చెరియొక రు. 2500ల విరాళము లంపిరి. సామాన్య గృహస్థులు పలువురు సభ్యత్వ రుసుములు పంపుచునే యుండిరి. యాదగిరి నరసింహస్వామి దేవాలయమునుండి రు. 500 ల విరాళము లభించెను. మొదటి సంపుటము ముద్రణమునకై కావలసిన కాగితమునంతను సిర్పూరు కాగిత కర్మా లయాధిపతులు శ్రీ బిర్లా సోదరులు మాకు మూడవవంతు ధరకు మాత్రమే ఇచ్చి గొప్ప ఉపకారము చేసిరి. దీని వలన సమితికి దాదాపు రు. 8000 లు కిఫాయతు ఏర్పడెను. ఇంతలో ఆంధ్రప్రదేశపు శుభావతరణ మయ్యెను. గౌ. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు తమ అధ్యక్ష కవచమును ఆంధ్రప్రదేశ ముఖ్య మంత్రులు గౌ. డాక్టరు నీలం సంజీవరెడ్డిగారికి అర్పించి తాము కేరళ రాజ్య పాలకులుగా వెడలిరి. ఇట్టి ప్రజోపయోగమైన కార్యమునకు ప్రభుత్వమే చేయూత ఈయదగునని శ్రీ సంజీవ రెడ్డిగారు ఆరంభముననే సంకల్పించి మాకు ధైర్యోత్సాహములు కలిగించిరి. రాజ్య కార్య బాహుళ్యముచే తమకు సమితి కార్యజాతమును నడిపించుటకు సమయము చాలక అప్పుడు ఆర్థిక శాఖామాత్యులుగ నుండిన గౌ. డాక్టరు బెజవాడ గోపాల రెడ్డిగారిని అధ్యక్షులునుగ చేసికొండని ఆదేశించిరి. సాహిత్య పోషణమునందును కళాభిరుచి యందుమ శ్రీ గోపాల రెడ్డిగారు ఆంధ్రదేశమునందు ముఖ్యజ్యోతిగ ఉన్నారనుట అతిశయోక్తి కానేరదు. సమితి ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామాత్యులు గౌ. యస్. బి. పి. పట్టాభిరామారావుగారును, డాక్టరు గోపాలరెడ్డిగారును సంప్రదించుకొని సంగ్రహ విజ్ఞానకోశ సమితికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడు ప్రణాళికను రచించిరి. దీనికి ఆంధ్రప్రదేశ ప్రభుత్వామోదము లభించుట ముదావహము. ఈ పథకము ప్రకారము ఆంధ్ర ప్రభుత్వమువారు సమితికి సంవత్సరమునకు రు. 25,000 చొప్పున నాలుగు సంవత్సరములు ధనసహాయము