Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దె అదనముగా వచ్చు రాబడి అర్థశాస్త్రమున అద్దె అని పిలువబడును. మరియు ఒక ఉత్పత్తి సాధనము యొక్క సప్లయి సంపూర్ణస్థితిస్థాపకతకన్న తక్కువగా నున్నప్పుడే అదే ఏర్పడుటకు వీలగును. ఇట్టి తరగతికే చెందిన అదనపు రాబడి లేక అద్దె ఇతర ఉత్ప త్తిసాధనముల యొక్క కొన్ని యూనిట్లుకూడ పొందుచుండుట మనము చూడవచ్చును. ఏదేని ఒక ఉత్ప త్తిసాధనము యొక్క సప్లయి సంపూర్ణస్థితి స్థాపకత కన్న తక్కువగాకున్నప్పుడే అదై ఏర్పడుననుట దీని అర్ధము. ఒక ఉత్పత్తి సాధనము యొక్క సప్లయి సంపూర్ణ స్థితి స్థాపకతకన్న తక్కువగా నున్నపుడు, లేదా, కనీ సపు సప్లయి వెలకే పని చేయుటకు సిద్ధపడు ఒక ఉత్పత్తి సాధనము యొక్క యూనిట్లకు మించి ఎక్కువ యూని ట్లను ఉప యోగింపగలుగునంతటి అపేక్షు ఆ ఉత్పత్తి సాధనమునకు ఉన్నప్పుడు అదే ఏర్పడునని చెప్పవచ్చును. సాంఘికదృష్ట్యా 'అద్దె' అర్థము : 'భూమి' పై వచ్చు 'అద్దె' కు సంబంధించిన ఆర్థికాంశములను సరిగా వివ రించుటకు, భూమి యొక్క ఆర్థికోపయోగములు వాటికి గల అపేక్షకు సంబంధించినంతవరకు వాటి వినియో గమునకుగాను ప్రతిఫలము ముట్టచెప్పవలసినంత కొరతగా నున్నవని మనము చూపగలిగి యుండవలెను. భూమి అద్దె నొసంగునని చెప్పుటలోగల అర్థమిది : భూమియొక్క సప్లయి అనగా (1) ఒక ప్రత్యేక మైన ఉపయోగమునకుగాను కేటాయింపబడిన భూమినళ్లయి, (2) యావత్ప్రపంచమునందలి భూమి యొక్క విస్తీర్ణము, (8) ఒక దేశమునందలిగాని ఒక జిల్లాయందలి గాని భూమి యొక్క మొత్తము విస్తీర్ణము. మొదటి అంశము - భూమి యొక్క ఉపయోగమునకై గల అ పేడలోని పెరుగుదలను ఇంతవరకు ఇతర ఉప యోగములకుగాను వినియోగింపబడుచున్న కొంత భూమిని అపేక్ష పెరిగిన ఆ ప్రత్యేకోపయోగమునకు మార్చుటవలన పరిష్కరింపవచ్చును. ఇట్లే ఇతర ఉప యోగముల విషయమునందు సైతము అపేక్ష పెరుగు దల తగ్గుదలలు, వినియోగమును ప్రత్యేకోవ యోగములకు మార్చుటవలన సులభముగా ఎదుర్కొన వచ్చును. 150 రెండవ అంశము - ప్రపంచమునందలి భూమి యొక్క మొత్తము విస్తీర్ణము ఇంచుమించుగా మార్పజాలనిది. భూమి కై గల అ పేరులోని పెరుగుదల భూస్వాముల రాబడి అధికము చేయునని, తద్వ్యతిరేకముగా తగ్గుదల వారి రాబడిని తగ్గించునని దీని అర్థము. శ్రమవిషయమునందును ఇట్లే భూమి యొక్క గాని శ్రమ యొక్కగాని సప్లయి ప్రత్యేకోపయోగములకు మాత్రమే అధికము చేయబడ వచ్చును, తగ్గింపబడవచ్చును. మూడవ అంశము- ప్రతి ఒక్క ప్రత్యేక మైన ఎకరము యొక్క భౌగోళికస్థానము నిర్ణీతము అను విషయము చాల ముఖ్యమైనది. 'గోదుమలకు' అపేక్షలో కలిగిన పెరుగుదల వేరొక ప్రదేశమునందు భూమి గోదుమల సేద్యమునకు వినియోగింపబడుచున్నదని అర్థము. ఇతర ప్రదేశములయందును గోదుమలు పండింపగల్గి నందువల నను, వారి గోదుమలకు పోటీగా ఇతరులును గోదుమలు అమ్మక లిగినందువలనను ఆ జిల్లాయందలి భూస్వాములు మునుపటికంటె విశేషించి హెచ్చు రాబడిని పొందజాలక పోవచ్చును. కాని ఆ ప్రత్యేకము జిల్లాకు సంబంధించి నంతవరకు భూమి అపేక్షయందు కలిగిన పెరుగుదలను ఇతరప్రదేశముల యందలి భూమి తీర్పజాలదు. భూమి అంతయు ఒకే వస్తువును ఉత్పత్తిచేయుటకు వీలైనదిగా ఉండినను, మరియు పూర్తి పోటీ విధానము క్రింద నుండి, భూమి అంతయు ఒకే ఉత్పత్తి శక్తిని కలిగి యుండినను, ఆ వస్తువునకై హెచ్చగు చున్న అపేక్షను భూమి అంతయు వినియోగము క్రిందకు వచ్చునంత వరకు కనీసపు సరాసరి యూనిట్ ఖర్చుల మొత్తపు బిందువువద్ద ఉత్పత్తిచేయు హెచ్చయిన పారిశ్రామిక సంస్థలు తీర్పగలవు. . భూమి అంతయు వినియోగము క్రిందకు తేబడునంతవరకు భూమి కొరతగానున్న ఉత్పత్తి ఆ వస్తువుధర పరిశ్రమయందలి అన్ని పారిశ్రామిక సంస్థల కనీసపు సరాసరి యూనిట్ ఖర్చుల మొత్తమునకు సమానమై యుండి భూమి యజమానునకు అద్దె పేరున చెందు అదనపు రాబడి ఏమియునుండదు. భూమి అంతయు ఉపయోగము క్రిందనుండి, ఆ వస్తు వునకుగల అపేక్ష ఇంకను హెచ్చగుచో భూమిని ఎక్కువ చేయుటవలన ఉత్పత్తిని అధికము చేయజాలము. ఇతర సాధనముకాదు.