Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉత్ప త్తిసాధనముల వినియోగమును, అధికము చేయజాలని నిర్ణీతమైన భూమి వినియోగమునకు జోడించుటవలన నే ఉత్పత్తి ఎక్కువగును. విషమ నిష్పత్తుల ఉత్ప త్తిసూత్రము అమలు జరుగును. భూమి అంతయు ఉపయోగము క్రింద నున్న తరు వాత మిక్కిలి తక్కువ ఖర్చుల కలయికతో ఉత్పత్తి చేయగలిగిన దానికన్న విశేషముగా నొక వస్తువును ప్రజలు వాంఛించుచున్న యెడల వారు మార్జినలు ఖర్చుకు సమమైన ఖరీదు నొసంగవలసినవా రగుదురు. ప్రతి ఉత్పత్తిదారుడును వస్తువు ఖరీదు మార్జినల్ ఖర్చుతో సమమగు నంతవరకు ఉత్పత్తిని సాగించును. కాని ఈ ఉత్పత్తివద్ద సరాసరి యూనిట్టు ఖర్చుల మొత్తము వస్తువు ఖరీదుకన్న తక్కువగా నుండును. మరియు మొత్తమురాబడి, మొత్తము ఖర్చుకన్న ఎక్కువ. ఖర్చు లను మించిన అదనపు రాబడి ఇచ్చట కలుగుచున్నది. మార్జినలు రాబడి మార్జినలు ఖరీదులు సరిసమానముగా నుండి ప్రతి పారిశ్రామిక సంస్థయు నిశ్చలతను పొందును. ఉపయోగించుటకు వేరుగా భూమిలేనందున, ఈ అదనపు రాబడికి ఆశపడి క్రొత్త పారిశ్రామిక సంస్థలు పారిశ్రామిక రంగమును ప్రవేశింపజాలవు. పరిశ్రమయు నిశ్చలతను పొందును. ఈ అదనపు రాబడియే అర్థశాస్త్ర మున చెప్పబడు భూమియొక్క అద్దె. వ్యత్యాసమును సూచించు అద్దె : ఒకేవిధమైన ఉత్పత్తి, శక్తి, సారము భూమికంతకు గలదనుమన ఊహను తొల గించి వివిధములగు తరగతులకు చెందిన భూమిగలదను వాదమును అంగీకరించినను మన పరిశీలన తప్పు కానేరదు. స్వల్ప వివరణము మాత్రము అవసరమగును. ఒకే పరిశ్రమ యందు అద్దె : పరిశ్రమ వ్యాప్తి చెంది, ఎక్కువగా పెరిగిపోవుచున్న భూమి యొక్క ఇతర ఉప యోగముల నుండి దానిని విడుదల చేయవలసిన అవసర మేర్పడినప్పుడు భూమి వినియోగమునకుగాను ఆ పరిశ్రమ చెల్లించవలసిన మూల్యము పెరిగి పోవును. ఆ పరిశ్రమ చెల్లించవలసిన ప్రతి భూ విభాగము యొక్క కనీసపు సప్లయి ఖరీదు ఆ భూమి మిక్కిలి ఎక్కువ విలువైన తన ప్రత్యామ్నాయపు ఉపయోగమునకు సంపాదింపగల " ద్రవ్యమునకు సమానమగును. ఆ పరిశ్రమ యందలి ఉప 151 అద్దె యోగమునకై భూమి బదిలీచేయబడుటకు అవసరమైన ఖరీదును భూమి యొక్క పెట్టు ధర అని పిలువవచ్చును. భూమి హెచ్చుగా ఉపయోగింపబడుచున్న కొలది భూమి యొక్క బదిలీ చేయబడిన ఉపయోగపు వెల అధికమగుచు భూమియొక్క ఆ పెట్టు ధర పరిశ్రమకు ఉత్పత్తి ఖర్చుగా పరిగణింపబడి, ఆ పరిశ్రమ యందే అద్దె అని మనము వ్యవహరించు అదనపు రాబడి సంభవమగును. పారిశ్రామిక సంస్థ దృష్ట్యా అద్దె: పారిశ్రామిక సంస్థ దృష్ట్యా అన్ని ఉత్ప త్తిసాధనముల అద్దెలు ఉత్పత్తి ఖర్చులు గనే పరిగణింపబడవలయును. ఒక పారిశ్రామిక సంస్థ భూమిని ఇతరుల నుండి బాడుగకు తీసికొనినచో అది ధన రూపమున చెల్లింపవలసిన అద్దె ఖర్చుగా కనుపించుచునే యున్నది. భూమి యజమానుడే దానిని ఉత్పత్తి సాధన ముగా వినియోగించినచో దాని నతడు ఇతరులకు బాడు గకు ఒసంగిన యెడల సంపాదింపకలిగిన ద్రవ్యమంతయు అవకాశపు ఖర్చు అగును. అవకాశములలోని తేడాలు కారణముగా నేర్పడు అద్దెను "పారిశ్రామిక సంస్థ దృష్ట్యా అద్దె" అని చెప్పవచ్చును. స్థానపు విలువ: ఒకే ఉత్పత్తి శక్తిని కలిగియున్న రెండుభూముల విషయములో (ఉత్ప త్తిఖర్చులు రెండింటి యందును సమానమని అర్థము.) అంగడికి అతి సామీప్య మున గల భూమి ఎక్కువ సంపాదన కలిగినదగును. బజారుకు సరకును రవాణా చేయుట కగు ఖర్చులలో గల తారతమ్యమే దీనికి కారణము. భూమి యొక్క స్థాన లాభమువలన అదనముగా వచ్చు అద్దెను 'స్థానపు విలువ' అని పిలువవచ్చును. ఒక చిల్లర వ్యాపారస్థుని కిరాణా అంగడి యొక్క స్థానపు విలువను ఇట్లు పేర్కొననగును. ఆస్థలమునందు ఎక్కువ వ్యాపారము జరుగగలదు కావుననో, లేదా ఆ స్థలమునందు వ్యాపారస్థులనుండి ప్రజలు ఎక్కువ ఖరీదునకే సరకులు కొనుటకు ఇష్టపడుట వలననో చిల్లర వ్యాపారస్థులకు అద్దె ఏర్పడుచున్నది. పై అంశమునకే సంబంధించిన మరియొక స్థానపు విలువకు తార్కాణ ముగా ఇతర ప్రదేశముల యందు అంతే వ్యాపారము చేయుట కగు ఎక్కువ ఎడ్వర్టయిజుమెంటు ఖర్చులను ఉదాహరింపవచ్చును.