Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అచ్చువేసిన బట్టలు తీవ్రమైన ఎండలో మూడు నాల్గు గంటలవరకు పెట్టినచో నల్లరంగు తేలును. పిమ్మట బట్టను చాల కొద్దిగ ఆమ్లము కలిసిన నీటిలో నానబెట్టినచో దాని పూర్తిరంగు తేలును. అట్లు అచ్చువేసిన బట్టను మామూలు పద్ధతిని 4, 5 సార్లు మంచినీటిలో కడిగి, సోడా సబ్బుతో మరల శుభ్రపరచవలెను. ఈ రంగు సాధారణముగా డిజైను యొక్క అంచుకు వాడవచ్చును. ఆర్. వెం. స్వా. అద్దె (Rent) :- చదువరి ముఖ్యముగా విద్యార్థి యగుచో సరకుల ఉత్పత్తి, వాటిని తయారుచేయుట కగు ఖర్చులు, బజారులో వాటి ఖరీదులు - ఈ అంశముల నడుమగల సంబంధములు స్పష్టీకరించు సిద్ధాంతమును తెలిసికొనుటకు కుతూహలమును ప్రదర్శించును. ఖర్చులు మొత్తమును నిశ్చయించు సిద్ధాంతము కొన్ని సూత్రముల ననుసరించి పనిచేయును. నిర్దిష్టమగు ఖర్చులు, మారు ఖర్చులు, అను ఖర్చుల మధ్యగల తారతమ్యమ అల్పకాల వ్యవధికిమాత్రమే వర్తించు అంశమనునది ఒక సూత్రము. మారుచున్న ఉత్పత్తితో కలిసి మారనిఖర్చులు నిర్దిష్టమగు ఖర్చులు. పారిశ్రామికవేత్త కల్గియుండిన ఉత్ప త్తిసాధనములు, వేరు అవకాశములు లభించునెడల సంపాదింపగల ధనరూపమైన సంపాదనలు, పారిశ్రామిక వేత్త ఇతరుల కొసంగవలసిన నిర్దిష్టమగు ఖర్చులుకూడ నిర్దిష్టమగు ఖర్చులుగనే ఎంచబడును. నిర్దిష్టమగు ఖర్చులు అమనది తప్పక రాబట్టవలసిన ఖర్చులు ఇవి యను అంశ మును తెలియజేయునదని అనుకొనవచ్చును. కాని అల్ప వ్యవధికి సంబంధించినంతవరకు ఇది నిజము కాదు. ఏల యన, ఒక పారిశ్రామిక వేత్త తన పెట్టుబడి పై గాని తన కృషిఫలితముగా కాని అల్ప వ్యవధియందు ఏమియు సంపాదింపకుండినను పరిశ్రమ సాగుచునే యుండ వచ్చును. ముఖ్యమగు ఖర్చులను రాబట్టగల్గిన పదమున, పరిశ్రమ కొంతశాలమువరకు సాగుటకు ఎట్టి అడ్డంకు లుసు ఉండవు. కొలదిగనైనను గొప్పగనైనను ఉత్పత్తి జరుగుటకు అల్పవ్యవధియందు సైతము రాబట్టబడవలసిన ముఖ్యమగు ఖర్చులు కొన్ని గలవు. అన్ని విధములైన మారుచుండు ఖర్చులు, కొన్ని నిర్దిష్టమగు ఖర్చులు, ముఖ్యమగు ఖర్చుల క్రిందకు వచ్చును. ముఖ్యమగు అద్దె ఖర్చుల జాబితాలోనికి వచ్చు నిర్దిష్టమగు ఖర్చులకు ఉదా హరణము.' కార్యాలయోద్యోగుల కొసంగు వేతనం లను పేర్కొన వచ్చును. తక్కిన నిర్దిష్టమగు ఖర్చులను ఉపఖర్చులు అందుము. మొత్తముమీద ఎప్పటికో అప్ప టికి నిర్దిష్టమగు ఖర్చులకు, మారు ఖర్చులనుకూడ ప్రతి పారిశ్రామిక వేత్త రాబట్టవలసినదే. కానిపక్షసున ఆ పారిశ్రామిక సంస్థ వ్యాపారరంగము నుండణాలను. బడునను 'ఒక సస్తువు తయారుచేయబడిన తరువాత, ఆవస్తువు నకుగల అపేక్షలో కల్గు మార్పులననుసరించి దాని మూల్యము మారుచుండు నప్పటికి సామాన్యముగా ప్రతి వస్తువు ఖరీదు దాని ఉత్ప త్తికను ఖర్చు నుబట్టి నిర్ణయింప ఉత్పత్తిక ఖర్చులో పారిశ్రామిక వేత్త యొక్క లాభముకూడ ఇమిడియున్నదని దీని భావము. కాని పారిశ్రామిక వేత్త యొక్కలంభము, వేరువేరు సమయములయందు వస్తువు యొక్క ఖరీదులో కలుగు మార్పుల ననుసరించి మార్పు చెందుచుండును. ఇంతేగాక ఉత్పత్తి పరిమితి, తయారు చేయబడుచున్న ఆ వస్తువు యొక్క అపేక్షపై ఆధారపడి యుండగా, ఉత్పత్తి పరిమితి ననుసరించియే ఉత్పత్తికగు ఖర్చు మారుచుండును. కావున తయారైన వస్తువుల ధరలు ఖర్చులవలనగాని, ఖర్చులు తయారైన వస్తువుల ధరలవలనగాని నిర్ణయింపబడజాలవు. ధరలన్నియు పర స్పరము ఒకదాని పై నొకటి ఆధారపడుచుండును. ఊహ సర్వసాధారణమైనది. 149 కొన్ని ఖర్చులయందు అర్థశాస్త్రమున 'అద్దె' అని వ్యవహరింపబడు దాని లక్షణములు కననగును. ఉత్పత్తి సాధనములు పరిశ్రమయందు నిలచియుండుటకుగాను వెచ్చింపనవసరములేని మొత్తములను 'అద్దె' అని అందుము. అర్థశాస్త్రమున మనము 'అద్దె' అని వ్యవహరించునది ఉత్పన్నమగుటకు కారణము. అద్దెను ఆర్థికఫలముగా సంపాదించు ఉత్పత్తి సాధనము యొక్క పరిమితి దానికి గల అపేక్షతో వచ్చు మార్పులకు అనుగుణముగా ఎట్టి మార్పును పొందలేకుండుటయే. ఏదేని ఒక ఉత్పత్తి సాధనము యొక్క యూనిట్ అది ప్రస్తుతము ఏ వృత్తి యందు గలదో ఆ వృత్తియందు; అనియుండుటకుగాను అవసరమైన కనీసపు మొత్తముకన్న ఎక్కువ ఆదాయ మును సంపాదించుచున్నచో, దాని సప్లయి వెలకన్న