Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దకము పారపోయకూడదు. ఎందుకనగా వాటిలో రంగుఉండును, అది చెడిపోదు. మరల అద్దుకొను సమయాన వాటిలో కొద్దిరంగు కలిపిన పనికివచ్చును. నెప్తాల్ రంగుల అద్దకము: పదిపౌండ్ల నూలుకు లేక గుడ్డకు 8 తులములనుండి 12 తులముల నెఫ్తాల్ రంగు అవసరము. దీనికి సరియైన రంగు ఉప్పులు (1:3) అనగా 8 తులముల నెప్తాల్కు 24 తులముల రంగు ఉప్పు చొప్పున అందులో 24 తులములు తిను ఉప్పు వేసి సిద్ధము చేసికొనవచ్చును. ఈ రంగులు అద్దుటకు రెండు మట్టిపాత్రలు వెడల్పు మూతులు గలవిగాని, మట్టి తొట్లు గాని అవసరము. బేస్ తయారుచేయు విధము: నెఫ్తాలను మోనోపోల్ సోప్ తో మర్దించి, అందులో వేడినీళ్ళు కలిపి, కాస్టిక్ సోడాను కలుపవలెను. అట్లు కలిపినచో, నెప్తాల్ రంగు మారి నీళ్ళలో కరగును. రంగు ఉప్పు తయారుచేయువిధము : రంగు ఉప్పు తూకమునకు సమముగా తిను ఉప్పు కలిపి, నీళ్ళలో రెంటిని కరుగబెట్టినచో రంగు ఉప్పు సిద్ధమగును. శుభ్ర పరచిన నూలును లేక బట్టను నీటిలో తడిపి, పిండి నెప్తాల్ బేస్ లో తడియబెట్టవలెను. దానిని పైకి తీసి, గట్టిగా పిండి, తయారైన రంగు ఉప్పునీళ్ళతో రంగు వేయవచ్చును. ఇందాన్ త్రీని రంగులు వేయు పద్ధతి: ఈ రంగులు అన్ని రంగులకంటె గట్టిరంగులు. కాస్టిక్ సోడా నీళ్ళకు గాని, బ్లీచింగ్ పౌడరు నీళ్ళకుగాని, ఈ రంగులు దిగి పోవు. ఈ రంగుల అద్దకము 8 విధములు : IN, IW, IK. నూలును లేక గుడ్డను శుభ్రముగా నుతికి రెడ్ ఆయిల్తో నాన్పి మెత్తగా చేయవలెను. 1% నుంచి 4% వరకు అవసరానుసారముగా రంగు ఉప్పును తీసికొని ఒక చిన్న పాత్రలో నీళ్ళతో మర్దించి దానిలో మరుగుచుం డెడి నీళ్ళను పోసి, అందులో కాస్టిక్సోడాను కలువవలెను. అందులో సోడియం హైడ్రోసల్ఫైట్ను కొద్దికొద్దిగా కలుపుచు పోవలెను. మొదటిరంగు మారును. అట్లు రంగు మారినప్పుడే రంగు. ఉప్పు నీటిలో కరిగినదని తెలియును. ఇట్లు మారిన రంగునీటికి గాలి తగిలినచో మొదటిరంగు 148 వచ్చును. ఈవిధ ముగా రంగుతయారైనదనుకొనవచ్చును. ఇట్లు తయారైన రంగునీటిని నీరుగల పెద్దతొట్టిలోపోసి తగినంత కాస్టిక్ సోడాను, సోడియం హైడ్రోసల్ఫైటన్ను కలిపి నూలుకు లేక బట్టలకు అద్దకము చేయుటకు వాడ వచ్చును. అట్లు అంచిన నూలును లేక గుడ్డను పైకి తీసి గాలిలో కొంత సేపు ఉంచినచో మొదటి రంగు మరల వచ్చును. ఆ బట్టను లేక నూలును సబ్బు, సోడా నీళ్ళలో ఉడకబెట్టి తదుపరి మంచినీటిలో శుభ్రపరచవలెను. గుడ్డలపై రంగులను అచ్చువేయుట: ప్రస్తుతము మార్కెట్టులలో వాడబడుచున్న రంగులు : (1) రాపిడ్ (ఫాస్టు) రంగులు, (2) ఇండిగోసోల్ రంగులు. 1. రాపిడ్ (ఫాస్టు) రంగులు అచ్చువేయు పద్ధతి : రంగును సారాయితో మర్దించి కొద్దిగా చన్నీళ్ళు లేక గోరువెచ్చని నీళ్ళు కలిపి అందులో కాస్టిక్ సోడాను మరికొంత నీటిని కలిపినచో ఆ కాస్టిక్ నీళ్ళలో రంగు కరుగును. ఈ రంగు నీటిని తగినంత బంక లేక జిగు రులో కలిపి బట్టపై అచ్చువేయుటకు వాడవచ్చును. అచ్చు వేసిన తరువాత బట్టను ఎండబెట్టి ఆవిరిలో నుంచినచో రంగు బాగుగా అంటుకొనును. అటుపిమ్మట బట్టను ఆసిటిక్ ఆసిడ్ జలములో వేసిన అసలు రంగు బయటపడును. ఆబట్టను నీళ్ళలో ఉతికి పిదప సబ్బు, సోడా నీళ్ళలో ఉతికించి శుభ్రపరచవలెను. 2. ఇండిగోసోల్ రంగు అచ్చువేయు పద్దతి: ఇండిగో సోల్ రంగును కొద్దిగా గ్లిసరికాతో మర్దించి వేడినీళ్ళు కలిపి తగినంత సోడియం నైట్రైటు కలుపవలెను. ఈ ద్రావణమును జిగురులో లేక బంకలో కలిపి అచ్చువేయ వచ్చును. అచ్చువేసిన బట్టను ఎండ బెట్టి ఆసిటి కామ్లము లేక హైడ్రో క్లోరికామ్లపు నీటిలో నాన బెట్టవలెను. ఇట్లు చేసిన పుడు రంగు స్వభావసిద్ధముగ తయారగును. తర్వాత ఆ బట్టను నాల్గు అయిదుమార్లు మంచినీటిలో ఉతికి, తర్వాత పోడా సబ్బు నీళ్ళలో ఉడకబెట్టి, శుభ్రపరచ వలెను. అవిలీన్ హైడ్రో క్లోరైడు లేక అనిలీన్ లవణమును నీళ్ళలో కరిగించి ఇందులో తగినంత పొటాసియ హరిత మును, కొద్దిగ మైలుతు త్తమును కలిపి బంక లేక జిగు రులో కలిపి అచ్చు వేయవచ్చును.