Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చాకలివానిచే నుతికించి ఆరిన గుడ్డలకు లేక నూలుకు రంగులు అద్దవలసినచో 20 గ్యాలనుల నీళ్ళు అనగా 5 కిరసనాయిల్ డబ్బాల నీళ్ళలో మూడునాల్గు తుల ముల బట్టల సోడా (Soda ash), 2, 3 పౌనుల క్యాస్టిక్ సోడా కలిపి ఉడికించవలయును. మరొక విధముగా పొడిగుడ్డను 20 గ్యాలనుల నీళ్ళలో 2 పౌనుల టర్కి రెడ్ ఆయిల్ కలిపి రెండుగంటల వరకు తడిపియుంచిన తరు వాత, గట్టిగా పిండి సిద్ధముగా నుంచవలయును. సాధారణముగా వాడుకొను రంగులు (14) రకాలు : 1. బేసిక్ రంగులు, 2. డైరక్టు రంగులు, 3. (అ) సల్ఫర్ రంగులు. (ఆ) హైడ్రాక్షా రంగులు, 4, ఇండాన్ త్రీజా రంగులు, 5. ఆలిజరిన్ రంగులు, 6. నెఫ్రోల్ రంగులు, 7. ఇండిగో రంగులు, 8. ఆసిడ్ రంగులు, 9. ఆసిడ్ క్రోం రంగులు, 10. మార్డెంటు రంగులు. పైని చెప్పబడ్డ 10 రంగులలో కొన్ని మాత్రము ఈ దిగువను విపులముగా చెప్పబడినవి. పై నుదహరించిన రంగుల పేర్లు జర్మనీ దేశము వారివి. ఇంగ్లండు, స్విట్జర్లాండు మొదలగు దేశములలో తయారు అయిన రంగుల పేర్లు వేరుగా నుండును. 1. బేసిక్ రంగుల అద్దకము : పట్టుకు ఉన్ని వస్తువు లకు మాత్రము ఈ రంగులు వాడుదురు. 10 పౌనుల నూలుకు లేక గుడ్డకు 1 తులమునుండి 6 తులముల వరకు బేసిక్ రంగును మనకు అవసరమగు ఛాయా ప్రమాణమునుబట్టి వేసికొనవచ్చును. ఆసిటిక్ ఆసిడ్ తో రంగును మర్దించి అందులో బాగుగా మరుగుచుండెడి నీరుపోసి కలుపవలెను. శుభ్రపరచిన నూలును లేక గుడ్డను, పది పౌనులకు శ్రీ పౌ. చొ. పటికను 20 గ్యాల నుల నీళ్ళలో కరిగించి, గట్టిగా పిండిన తరువాత దానిని 1% సజల టానిక్ ఆసిడ్ లో తడియ పెట్ట వలెను. ఇట్లు తయారుచేసిన నూలుపై లేక గుడ్డపై, వడియగట్టిన రంగును నీటితో అద్దకము చేయవచ్చును. బేసిక్ రంగు వైవిధమున సిద్ధపరచి, జిగురులో కలిపి, గుడ్డలపై అచ్చులు వేసి, 14 లేక 2 గంటల వరకు ఆవిరి పట్టినచో ఉన్ని, పట్టు, గుడ్డలు చీటి

తయారగును. డైరెక్టు రంగుల అద్దకము 10 పౌనుల నూలుకు లేక గుడ్డకు 8 తులములు మొదలుకొని 18 తులముల 147 అద్దకము పరిమితిగల రంగును ఒక పాత్రలోనున్న చన్నీళ్ళలో బాగుగా కలిపిన తర్వాత బాగుగా మరుగుచుండెడి వేడి నీళ్ళను ఆ రంగులో పోయవలయును. లేదా అగ్నివై పెట్టి, కొంతకాలము ఉడికించవలయును. నూలు లేక గుడ్డను అద్దుకొను పాత్రలో నూలుకు 30 పాళ్ళు ఎక్కువ నీళ్ళుపోసి, అందులో 2 తులములు మొదలు 12 తుల ముల వరకు బట్టల సోడాను ఉడికించి వడియకట్టిన రంగును కలుపవలెను. ఆ రంగులో నూలు లేక గుడ్డను ఉడక పెట్టుచు ఒక గంటవరకు ఆ రంగుపాత్రలోనే యుంచి పిదప వెలుపలకు తీసి శుభ్రమైన నీటితో ఉతికి ఆరవేయ వలెను. రంగుపాత్రలో నుండు రంగును పూర్తిగా వాడు టకుగాను, 2% తినునట్టి ఉప్పుమ కలిపి అద్దకమును పూర్తి చేయవలెను. సల్ఫర్ రంగుల అద్దకము: పది పౌనుల నూలు లేక బట్టకు సల్ఫర్ రంగు 20 తులములనుండి 40 తులముల వరకు ఉపయోగింపవలెను. సల్ఫర్ నల్లరంగు మాత్రము 80 తులములవరకు గూడ వాడవచ్చును. లైట్ షేడ్ కావలయునన్న, రంగుతో సమమైన బరువుగల సోడియం సల్ఫైడ్ ను రంగుతో కలుపవలెను. గాఢచ్చాయ షేడ్ను కోరినచో సోడియం సల్ఫైడ్ రెట్టింపు తీసికొనవలెను. బట్టలసోడా. పది పౌండ్ల నూలుకు లేక గుడ్డకు డార్కు షేడ్ (Dark shade) కావలయునన్న 20 తులములు, లైట్ షేడ్ కావలయునన్న 8 తులములు, రంగుపాత్రలో వేయవలెను. ఆఖరు దళలో తిను ఉప్పు 2 పౌండ్లవరకు రంగుపాత్రలో వేసినచో, రంగును పూర్తిగా వాడుటకు వీలగును. కొంతవరకు టర్కీ రెడ్ ఆయిల్ కూడ వేయుట మంచిది. పైన చెప్పబడ్డ రంగును బాగుగా ఉడికించి అనగా 140° F. నుండి 180 F. వేడివరకు వేడి అయిన పిదప అద్దకము చేయవచ్చును. తదుపరి ఈవలకు తీసి గాలికి ఆరవేసి సోడా, సబ్బు వేసి నీళ్ళలో ఉడక బెట్టి, శుభ్రమైన నీళ్ళలో ఉతికి ఆర వేయవలయును. పైన చెప్పబడ్డ సల్ఫర్ రంగులు మొదట వేసిన తూకము మరల అద్దుకొను సమయమున శ్రీవంతు రంగు ఇతరములు తగ్గింపుచేసి అద్దుకొన వచ్చును. ఇదే విధముగా నాల్గవ సమయానికి ఏ రంగు వేయకుండగనే అద్దుకొనవచ్చును. రంగులు అద్దుకొన్న తదుపరి నీళ్ళు