Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దకము ముద్దలను గట్టిపరచు సాధనములుగా జిగురులు, పిండి పదార్థములు మొదలగునవి ఉపయోగింపబడును. అచ్చువేయు జిగురు రంగును వ్యాపింపకుండునట్లు చేయునదిగను, రంగును సమానముగా పంచుటకు సహాయ పడునదిగను ఉండవలెను. మరియు జిగురు, బట్టపై రంగు ఫలితమును పూర్తిగా ప్రదర్శించుచు, కడిగివేయుటకు సాధ్యపడునదిగా నుండవలెను. రంగును సమకూర్చగలశక్తి, చిక్కవరచెడి సాధనము యొక్క మరియొక ముఖ్య లక్షణము. ఆశక్తి అవసరములను బట్టి మారుచుండును.. ఆశక్తిని అవసరమైన విధముగా సవరింపవచ్చును. తటస్థములును, ఆవిరి కానివియును అగు నూనె పదార్థములను స్వల్ప పరిమాణములలో కలిపి వివిధములయిన చిక్కదనములను పొందవచ్చును. ఈ నూనెలు వృక్షజన్యములుగ గాని, జంతుజన్యములుగ గాని, ఖనిజ సంబంధములుగగాని యుండవచ్చును. అచ్చు రంగులకు మిక్కిలి చౌకగా కావలసిన చిక్కదనమును కలిగించుట కై " మెర్ట్" (Mert) ను, ఇతర ఘనపదార్థము లను చేర్పవచ్చును. కొన్ని సందర్భములలో బాగుగా పొడిచేయబడిన చై నామట్టిని (Kaolin), జింక్ ఆక్స యిడ్ ను, లితోపోనును Lithopone), బ్లేన్ ఫై (Blank fie) మొదలగు వస్తువులను, ఉపయోగింతురు. ఇట్టి పదార్థములు ఎక్కువగా వాడినచో అచ్చుపడు ధర్మము లకు భంగము కలిగించును. కారణము అచ్చురంగులు, అచ్చు రోలర్ల యొక్క చెక్కడములపై మట్టిపొరలవలె కప్పుకొను గుణము దీనివలన ఎక్కువగుటయే. నిరోధక శైలికి విసర్జన శైలికి (Resist and Dis- oharge Styles) సంబంధించిన ముద్రణములలో అట్టి వస్తు వులు కలుపుట నిరోధక చర్యకు అనుకూల్యమును కల్గిం చును; మరియు తెలుపు రంగు ఫలితముల రూపమిచ్చు శక్తిగల లక్షణమును ఎక్కువ చేయుటలో సాయపడును. ఏమనగా, అవి శూక్ష్మరూపములో అంతటను విస్తరించి యుండుటచే నూలు పోగులు కొంతవరకు వాటిని నిలుపు కొన గల్గును. కడిగివేయుటకు సాధ్యముకాని కోడిగుడ్డు లోని తెల్లని భాగమును పాలవిరుగుడు లేక పరేసు (Glue) వంటి చిక్కపరచు వస్తువులను కలిపి ఈ తెల్లని అణువులను నూలు ప్రోగుల పై భాగమునకు అంటి పెట్టు 146 కొనునట్లు చేయుట తరచు వాంఛింపబడుచున్నది. జింక్ ఆక్సైడ్ విసర్జన శైలిలో వాడబడును. కొన్ని సందర్భ ములలో అది తెల్లని అణు వ్యాప్తికి తోడ్పడును. విసర్జన విధానక్రమమున రాసాయనిక చర్యలోకూడ అది సాయపడును. గోధుమపిండిని (Starch) తక్కిన చిక్కపరచు సాధ నములతో కలిపినచో అధికలిసి ఎక్కువ ఉపయోగ పడును. కాని అచ్చువేసిన పదార్థములకు కఠినస్పర్శను ఆపాదించుటయు, ముఖ్యముగా పెద్దదిమ్మలు అచ్చు వేయునపుడు అసమఫలితము నిచ్చుటయు, అను ఈ రెండులోపములును దీనియందు కలవు. ఈ లోపములు కొంతవరకు ‘బాదముబంకను' గాని బ్రిటిష్ జిగురును గాని ఉపయోగించి తొలగింపవచ్చును. తక్కువరకముల పిండి పదార్థములతో చేయబడిన జిగురులు ముద్దకట్టు స్వభావమును కలిగియుండును. పిండిపదార్థములతో చేయబడు జిగురులు కొలది ఉష్ణోగ్రతచే మార్పుచెందును. ఇవి కొంతకాలము నిలువయున్నచో పుల్ల బడుట, చిక్క పడుట, నురుగుపట్టుట, నీటివలె పలుచగా నేర్పడుట జరుగును. క్రిమిసంహారకములు, పెనోల్, నెఫ్ తాల్, సాలిసిలిక్ ఆమ్లము, బోరిక్ ఆమ్లము మొదలై నవి కొలదిగా కలిపి ఈ లోపములను తొలగింపవచ్చును. ఆర్. వెం. స్వా. అద్దకము (రంగువేత): గుడ్డలపై రంగులు అద్దుట, రంగులతో అచ్చులు వేయుట : రంగులు అద్దుటకు గుడ్డలను సిద్ధపరచు విధము:- రంగులు అద్దుటకు పూర్వము నూలును లేక గుడ్డను శుభ్రపరచుకొనవలెను. నూలునుగాని గుడ్డనుగాని ఉడికించుటకు పూర్వము 10 గ్యాలనుల నీళ్ళలో 10 తులముల క్యాస్టిక్ సోడా, 5 తు.ల ఐగోపన్ టి (Igapon T) కాని మరియే దైన సహాయ ద్రవ్యముకానీ కల్పి, రాత్రి అంతయు తడిపి ఉంచి, ఉదయమున కఱ్ఱలతో తిన్నగా నదుమవలయును. 10 పౌండ్ల నూలును లేక గుడ్డను, 20 గ్యాలనుల నీళ్ళలో, 20 తులముల బట్టల సోడా, 10 తులముల టర్కి రెడ్ ఆయిల్, 4 తులముల క్యాస్టిక్ సోడా కలిపి సుమారు రెండు గంటలవరకు బాగుగా ఉడికించిన పిదప, శుభ్ర మైన నీటిలో ఉతికి, సిద్ధపరచుకొనవలయును. లేనిచో