Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రసాయనికపు చెక్కడము, “వెంటగ్రాఫ్": రోలరుపై, 'వాటర్ ప్రూఫ్ ' ను, అమ్లనిరోధకమగు నొక 'వార్నిషు”ను పూతగా పూయుదురు. అట్టి రోలరుపై వజ్రపుగంటము (Diamond Pointer) పనిచేయునపుడు రూపరీతి నొక్కు లుగా నేర్పడును. ఇట్లు తయారుచేయబడిన 'రోలరు' నత్రికామ్లపు తొట్టిలో నుంచబడును; అప్పుడు 'వార్నిష్' మీద నొక్కు లుగా త్రవ్వబడిన భాగములు ఆమ్లము యొక్క చర్యకు పాల్పడును. ఇట్లు ఉత్కీర్ణముగా నమూనా (design) ఏర్పడును. "స్టెన్సిలింగ్" (Stencilling): బట్టలపై స్టెన్సిలింగ్ పురాతనపద్ధతి; దీనివలన అనేక ఉపయోగములు కలవు. అవి యెవ్వియన, దిమ్మ అచ్చులోకంటె, రూపరచనా నిర్మాతకు అల్లిబిల్లికతో గూడినరీతిని రచించుటలో స్టెన్సి లింగ్ ఎక్కువ స్వాతంత్ర్యము నిచ్చుచున్నది. సన్నని రేఖలతోగూడిన సున్నితపు రచన, గొప్ప ఫలితము,- ఈ రెండును దీనివలన చేకూరును. వేర్వేరు రంగు చాయలను కల్పించుట స్టెన్సిలింగులో సాధ్యపడును. రంగులు సులభముగా మేళవింప వీలగును. "స్టెన్సిల్” సాధారణముగా పలుచని రాగి రేకుతోగాని ఇత్తడి తయారుచేయబడును. అందుచేత ఇది తడుపు ఎక్కువగా నున్నపుడు కూడ చెడిపోదు. "స్టెన్సిల్" తయారు చేయుటలో పెక్కు “బలములు" (Stays) లేక ఆధారములు నేర్పుగా ప్ర వేశ పెట్ట బడును. ఇవి నమూ నాలో అంతర్భాగములుగా కలిసిపోవునట్లు చేయబడును. "స్టెన్సిల్” పలకకు ఇవి తగు బలమునిచ్చును. ఇట్టి బలము లేనిచో "స్టెన్సిల్ బలహీనమై అచ్చువేయబడు వస్తువుపై అంటుకొని యుండదు. అచ్చువేయబడు పదార్థముపై స్టెన్సిల్ ఉంచబడును. కుంచెతో చెక్కిన భాగములగుండా రంగు వేయబడును. కుంచెతో ('డబ్బింగ్') వలన రంగు అంటుకొనును. వ్రాయుట గాలికుంచె (Air Brush) ను రంగు వేయుటకు ఉపయో గించుట మరియొక పద్ధతి. దగ్గరకు ఒత్తబడిన గాలి యొక్క శక్తి రంగు బిందువులను తుంపురులుగా విడ గొట్టును. ఈ సన్నని జల్లులు స్టెన్సిల్ ద్వారమున బట్ట మీదపడును. దీనిని కుంచెవలెనే వాడవచ్చును. దీనిచే 19 145 అద్దకము తేలికయును, గాటమును అగు చాయలు రచించి, వివిధ ములగు ఛాయా ఫలితములను సాధింపవచ్చును. జపాను దేశీయులు స్టెన్సిల్ తయారు చేయుటకు ఒక సున్నితమగు రీతిని అవలంబింతురు. ఒకేమారు రెండు పలుచని కాగితములను కత్తిరించి వాటితో నొక కాగితముపై నిల్కు దారములను సమానముగా పరచి పిదప నీరెండు కాగితములను అంటించుదురు. దీనిచే స్టెన్సిల్ యొక్క బలము అధికమగును. తెర- అచ్చు తెర-అచ్చు కూడ స్టెన్సిలిం : విధాన తెర అద్దకము 1. తెర చట్రము 2. తీగె వల లేక సిల్కు గుడ్డ 3. అదుము రబ్బరు 4. రంగు పిండి 5. రంగు వేయవలసిన గుడ్డ 6, రంగు వేయబడిన గుడ్డ 7. చదునుబల్ల ములలో చేరినదే. ఒక సన్నని దోమతెర గుడ్డ లేక సిల్కు గుడ్డను ఒక చట్రముపై గ్రహింతురు. నమూనా పై రంగు పూయుదురు. అవుడు రంగు వేయబడని భాగము స్టెన్సిల్ పై చెక్కబడిన భాగములవలె సన్నని అల్లిక కలదగుటచే, వేసిన రంగును, తెరక్రింద నున్న బట్టమీదకు దిగునట్లుచేయును. తెరలు సన్నని “వై ర్ గాజ్" లేక స్వచ్ఛమగు సిల్కు బట్టతో చేయబడును. తెరలలో పునశ్చరణము చేయబడు రూపములు కలుపుటకు వీలగునట్లు కొన్ని “పట్టుకొను ప్రదేశములు" (Catch points) ఏర్పాటు చేయబడి యుండును. కఱ్ఱవార (Cellulose) రంగు, లేక లక్క రంగు తెరకు రంగువేయుట కుపయోగింపబడును. ఈ రంగులు తడుపును నిరోధించుచు, "గాజు గుడ్డు" లేక బట్టయందలి సూక్ష్మరంధ్రములను పూడ్చి వేయగలవు. రంగునీటివలన. చేయబడును. రంగు, బట్టపై అంతటను వ్యాపింపకుండుటకై నీరు మిక్కిలి తక్కువ పరిమాణ ములో అచ్చువేయునప్పుడు ఉపయోగింపబడును. రంగు