Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దకము “రోలరు”. ఈ సూపకముమీద ఒక దట్టమైన ఉన్ని "ఫెల్టు" ఈ బట్ట, లేక మైనపుగుడ్డ కొలదిగా చుట్టబడును. ఇది అచ్చు వేయు సమయమున తగినంత స్థితిస్థాపకత్వమును (Elasticity) చేకూర్చును. అచ్చుయంత్రపు దుప్పటి బిగువుగా నేయబడును. గట్టిగా నేసి పెనవేయబడి అది డట్టమును స్వచ్ఛమును అగు ఉన్ని బట్ట (Lapping) యొక్క స్థితిస్థాపకతను (Elasti- city) వృద్ధిచేయును. ' లేపింగ్ ' నకును అచ్చు వేయబడు బట్ట కును నడుమ ఒత్తిడి—స్థూపక మును (Pressure cylinder) ఎడ తెగకుండా తిరుగునట్లు చేయును. ఆ దుప్పటి గట్టి పడి, బట్టగుండా చొచ్చుకొనివచ్చు తడిరంగుచే, మలి నము నొందును. ఇట్లు జరిగినప్పుడు సామాన్యముగా దుప్పటిని ఆవలిప్రక్కకు తిప్పుచుందురు. ఆ దుప్పటి స్వచ్ఛముగా నున్నచో ఇట్లు చేయవచ్చును. లేనిచో క్రొత్త దుప్పటిని ఉపయోగించవలసి యుండును. 'బ్రేక్ గ్రే'ల నుపయోగించుటవలన దుప్పట్లు ఎక్కువకాలము ఉప యోగపడును. ‘బేక్ గ్రే*లు (Back Greys) అనగా దుప్పటి కిని అచ్చువేయబడు బట్టకును మధ్య నుంచబడు తెలుపు ‘కేలికో' ముక్కలు, ఉన్ని దుప్పట్లకును, వాటర్ ప్రూఫ్ మైనము దుప్పట్లకును అవి తప్పనిసరిగా వాడబడును. ఉతుకుటకు వీలయిన దుప్పట్లు లభించినచో వీటిని వాడుట మానివేయవచ్చును. 'రోలర్లు' : అచ్చువేయుటకు ఉపయోగించు రోలర్లు రెండువిధములు : (1) ఘనపదార్థపు రోలర్లు (Solid Rollers): ఇవి రాగి లోహముతో మాత్రమే చేయబడును. (2) 'షెల్ రోలర్లు' (Shell Rollers): ఇవి రాగి ఖరీదును తగ్గించు నుద్దేశముతో ఇనుముతో చేయబడును. వాటిపై విద్యుత్తుచే రాగిపూత వేయుదురు. 'రోలరు'లోపల, పొడుగునను 'నాళము' లేక 'నాలుక' ఒకటి వ్యాపించియుండును. ఈ 'నాథము' (Tab) రోలరు లోనికి పోవునట్లు అమర్చబడిన "మేన్ డ్రిల్" లేక ఇనుప ఇరుసులో ననురూపముగానున్న కన్నములో అమర్ప బడుటకు వీలుగానుండును. దీనివలన ఇరుసే తిరుగుట జరుగకుండ చేయబడును. అచ్చువేయు రోలర్లు ఒకప్పుడు ఇత్తడితో చేయబడును. కాని దీనివలన ప్రత్యేక లాభము లేదు. రాగి రోలర్ల పై తలము యొక్క గట్టితనమును 144 వృద్ధిచేయుటకై "నికెల్ ప్లేటింగు" ఒకప్పుడు క్రోమియం ప్లేటింగు కూడ చేయబడుచుండును. ఇట్టి ప్లేటింగు చే పై తలము యొక్క గట్టితనము వృద్ధి అగును. రోలర్ల “రోలర్లు" క్షీణింపక ఎక్కువ కాలము మనును. “మేన్ డ్రిల్స్" : ఇవి పొడవైన ఉక్కు కడ్డీలు. అచ్ఛు యంత్రములో నుంచబడినప్పుడు ఇవి తాత్కాలికముగా అచ్చు వేయు 'రోలర్ల'కు ఇరుసులవలె ఉపకరించును. రాగి రోలర్లు చెక్కుట : అచ్చు రోలర్లను చెక్కుట 'కేలికో' ముద్రణమునందలి చాల ప్రత్యేక శిక్షణమును అ పేక్షించు శాఖయై యున్నది. ఇది యొక ప్రత్యేక పరిశ్రమయై యున్నది. చెక్కడపు పనిలో మూడు ముఖ్య పద్ధతు లున్నవి: (1) చేతి చెక్కడము, (2) యంత్రముచే చేయబడు చెక్కడము, (8) రసాయనికపు చెక్కడము. ఏ పద్ధతి ఉపయోగింపబడినము, రాగి రోలర్ల చెక్క డపు పని ఉత్కీర్ణపద్ధతిగా (Intaglio) గా నుండును. "ఉబికిన వ్రాత" (Relief) గా మాత్రము ఉండదు. చేతిచెక్కడమునకు చాలకాలము పట్టును, ఇది చిన్న వియు, పెద్ద వియునగు వాడి పనిముట్లతో చేయబడును. చెక్కడము యొక్క అన్ని పద్ధతులలోను, రూప రచన తగు విధముగా నేర్పాటు చేయబడవలెను. రూపరచన యొక్క లంబరూప దైర్ఘ్యము (Vertical length) 'రోలరు' పరిధికి ఒక పూర్ణాంక గుణిజముగా (integral multiple) నుండవలెను. అట్లే 'అడ్డముగా ఉండు పునశ్చ రణము' (Horizontal repeat) 'రోలరు' యొక్క వెడల్పు విషయములో ఒక పూర్ణాంకముగా ఉండవలెను. చుక్కలతో చెక్కుట (Stippling): ఇది రోలర్ల పై భాగమున గుంటలు చేసి, రూపరచనల లిఖించుటచే చేయనగు ఒక విధమగు చెక్కడపుపని. పూర్వము ఇది చేతితోనే చేయబడుచుండెడిది. సన్నని ఉక్కు సాధనముచే దీనిని చేయుచుండెడివారు, ఈ రోజులలో చుక్కల చెక్కడముకూడ యంత్రముతో చేయబడుచున్నది. యంత్రపు చెక్కడము : యంత్రపు చెక్కడములో వాడి పనిముట్లచే రూపరీతి చెక్కబడదు. దీనికి బదులుగా ముందుగా తయారుచేయబడి ఉబికిన రచనగల యంత్ర ముచే (Mill) రూపరీతి రోలరుమీద ముద్రింపబడును.