Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లను దాటి ప్రసరించి ప్రతికూల ఫలితమును కలిగించును. రూపరచన యొక్క రీతి పరిమాణములను అనుసరించి, పెరొటైన్ యంత్రములోని దిమ్మలు సాధారణముగా 30" పొడవు 3" - 54" వెడల్పును కలిగియుండును. యంత్రములో (మూడు రంగుల యంత్రము) మూడు దిమ్మకూర్పులుండును. ప్రతి దిమ్మయు రంగు నింపుట, రంగు వ్యాపింపజేయుట, ముద్రను అచ్చొ త్తుట, అనుప్రత్యేకములగు ఏర్పాటులను గలిగియుండును. అన్ని దిమ్మలును ఏక కాల మున పనిచేయునట్లు చేయబడును. అచ్చు వేయు సమయములో తరువా తిముద్రణము పూర్వపు ముద్రణముతో కలియుటకు సరిగా ఎంతచోటు అవసరమా, అంతవరకు మాత్ర మే బట్ట ముందునకు జరుగును. మూడు దిమ్మ లును రంగులన్నియు పొరపాటులేక సరిగా పడునట్లు సరిచేయబడును. పైభాగపు అచ్చులేక "పెగ్" (Peg) అచ్చు: 10. పై భాగము లేక "ఫెగ్" (Peg) అచ్చు నేటికాలపు స్థూప ముద్రణము (Cylinder Printing) లేక "రోలరు" ముద్రణమునకు ప్రాతిపదిక. ఈ “పెగ్" - అచ్చులో చెక్క బడిన 'రోలరు' కట్టితో చేయబడును. అనగా దిమ్మ వర్తులా కారముగా నుండును. దీనిలో అనేక లోపములు కలవు. రంగు సమానముగా సమకూర్ప బడదు. ఒ త్తిడిని క్రమ పరువ వీలు కాదు. ఎడతెగక తడియుట వలనను, ఎండుట వలనను, కఱ్ఱరోలరు గుంటలుపడి చెడిపోవును. దీని తర్వాతి అభివృద్ధి దశలో రంగును సమకూర్చుట కును బాగుపరచుటకును ఒక ఏర్పాటు చేయబడినది. దీని కొరకు నిరంతరమైన (రెండు కొసలు కలుపబడిన) ఒక పెద్ద దుప్పటి ఉపయోగింపబడును. ఈ దుప్పటి రంగుతో సమకూర్పబడి యుండును. రంగు సమకూర్పు సమానముగా చేయుటకై ఒక కఱ్ఱగాని ఇనుప "బ్లేడు" గాని (Blade) ఏర్పాటు చేయబడును. "డాక్టరు" అని దీనికి పేరు. ఇది రంగును విస్తరింపజేయుటకు సహాయ ఈ “డాక్టరు ” ముందుకును అద్దకము ములో ఇది ఉపయోగింపనగును. అందు రేఖలు మిక్కిలి సునిశితముగా, సుస్పష్టముగా నుండవు. యంత్ర ముద్రణము: దీనికి యంత్ర ముద్రణము, స్తూప ముద్రణము (cylinder printng) లేక "రోలరు" ముద్రణము అని పేరు. ఇతర పద్ధతులలో దిమ్మలు, తెరలు “స్టెన్సిళ్లు" (Stencils) వాడబడుచుండును. దీనిలో తిరుగుడు యంత్రము 1. వర్ణ పేటిక 2. వర్ణ సంపాదకము 3. వర్ణ వ్యవస్థాపకము 4. తొలచబడిన తిరుగుడు చుట్ట 5. స్తూపము +8 8. బొత్తివలె దూర్చుట 7. దుప్పటి 8. "బాక్ గ్రే" 9. గుద్ద 10. నార పీచు 11. ముందుకు నడుపు రోలర్లు రూపరచన కొరకు చెక్కబడిన రాగి 'రోలర్లు' ఉపయో గింపబడును. 'రోలరు' ముద్రాయంత్రము 1788 లో ఇబేల్ అను నాతనిచే కనీపెట్టబడినది. మిక్కిలి సామాన్య రూపము కల ఈ ముద్రాయంత్రములో ఈ క్రిందిభాగములు కలవు. (1) స్థూపకము (Cylinder) (2) లేపింగ్ (Lapping) (3) దుప్పటి, (4) 'బేక్ గ్రే' (Back Grey) (5) చెక్క డపు పనిగల 'రోలరు' (8) రంగు 'డాక్టరు' (7) అంటు (Lint) (8) రంగు సమకూర్చునది. (9) రంగుపెట్టె. స్థూపక మనగా అచ్చు వేయబడు దేనిమీద కొంచెముగా కదలిక గలిగియుండును. మోటు ముద్రణ గుండ్రముగా తిరుగుచుండునో అట్టి పెద్ద "డ్రం" వంటి పడును. వెనుక కును 143 బట్ట