Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దకము నిక మైనరోలర్ ముద్రణముతో పోల్చినచో, దీనికి సంకుచిత మును, పరిమితమును, అగు స్థానము మాత్రమే కలదు. మిక్కిలి సున్నితములును, సునిశితములును అగు రేఖలు కఱ్ఱదిమ్మలపై చెక్కుట శక్యము కాదు. చెక్కిననుకూడ అచ్చుకొట్టుటలో అవి పాడై పోవును. అట్లే సన్నని చుక్క లను చెక్కుటకు కూడ వీలుపడదు. సన్నని రేఖలైనచో రంగును సమముగా గ్రహించును. వాటితో అచ్చు సమ ముగా వచ్చును. కాని విశాలములైన సమూహ రూప ములు రంగును సమముగా గ్రహింపవు. వాటితో అచ్చు ఎగుడు దిగుడుగా కూడ నుండును. కఱ్ఱదిమ్మలపై లోహ రూప రచనల నుంచి, అభివృద్ధి కరమైన మార్పులు చేయుదురు. దిమ్మలలో విశాల సమూహ రూపములు ఉన్న సందర్భములలో ఆ రూప ముల మధ్య తొలిచి " ఫెల్టు” (కంబళివంటి పదార్థము) తో నింపుదురు. "ఫెల్టు" అందుచే రంగును సమముగా గ్రహించును. ఈ విధముగా అచ్చు వేయుటచే అచ్చులు సున్నితముగను, సమముగను వచ్చును. దిమ్మలతో అచ్చు వేయుటలోగల మిక్కిలి గొప్పకష్టములు తిరిగి వేయబడు అచ్చులలో ఒకదానితో ఒకటి సరిగా కలుపుటకు సాధ్య పడకపోవుట; వేర్వేరు రంగుల

ముద్రా సరిగా నుండకుండుట. రచనయు ఏదైన ఒక రూపరచనకు కావలసిన దిమ్మల సంఖ్య ఆ రూపరచనలో నున్న రంగులసంఖ్యకు సమానముగా నుండును; ఏమన, ఒక దిమ్మ ఒక రంగును మాత్రమే గ్రహింపగలదు. రంగు భూమికలు (Colour Pads) : అనేక విధము లైన రంగు భూమికలు అచ్చువేయుటలో ఉపయోగింప బడును. ఒక దుప్పటి ముక్కను ఒక సమతలము పై పరచి, భూమికగా నుపయోగించుట వీటిలో మిక్కిలి సులువైనది. ఇట్టిదానిలో రంగు ముద్దను గ్రహించుశక్తి చాలా పరిమితమై యుండును. కాన ఎక్కువగా అచ్చు వేయవలసిన సందర్భములలో దీని ఉపయోగము లేదు. దీనిలో దిండువంటి సౌలభ్యము లేకపోవుటచే, కఠినమైన భూమిక నుండి దిమ్మలు ఎక్కువరంగును గ్రహించును; అందుచే, అచ్చు హెచ్చుతగ్గులు కలదిగా నుండును. కనుక, దేశమందంతటను సర్వసామాన్యముగా ఉపయోగింపబడు 142 భూమిక ఒక కఱ్ఱ పళ్లెము లేక తొట్టిని కలిగియుండును. ఈ తొట్టిలో ఒక వేదురు జల్లెడ ఉంచబడును. ఈ వెదురు జల్లెడపై దుప్పటి పరచబడి, దానిపై ఒక గుడ్డముక్య ఉంచ బడును. వెదురు జల్లెడ వెదురు బద్దలతో చేయబడును. ఇవి రెండు కాళ్ళపై ఆధారపడి యుండును. వెదురు బద్దలు దారముతో కట్టబడును. వెదురుజల్లెడ (జూలి) "స్ప్రింగ్" (Spring) లక్షణము కలిగియుండును. కాన, రంగును సమానముగా గ్రహించుటలో అది సాయపడును. జల్లెడ "స్ప్రింగ్" లక్షణముచే రంగును విడగొట్టును; మరియు సరియగు మార్గములద్వారా దానిని వచ్చునట్లు చేయును. దుప్పటి, రంగును ఇంకను విడగొట్టును. దుప్పటి సందులు నుండి వెలువడు రంగు ఇంకను సూక్ష్మ విభజన పొందిన స్థితిలో దాని పైభాగమునకు వచ్చును; అక్కడనుండి దిమ్మ రంగును గ్రహించును. - అచ్చువేయు బల్ల : కూర్చుండు స్థితిలో బట్టలను అచ్చు వేయుటకు ఉపయోగింపబడు సాధారణమైన బల్లకు బలమైన తలమును, బలమైన కాళ్ళును ఉండును. బల్ల పనివాని వైపునకు కొంచెముగా వాలి ఉండును. సాధా రణముగా ఈ 20 - 22" వెడల్పుగల్గి బల్ల పనిచేయుటకు అనుకూలముగా నుండును. బట్టను పరిచెడి ప్రదేశము కూడ అచ్చువేయుట పై ప్రభావము కలిగియుండును. ఆప్రదేశము హెచ్చుతగ్గులుగా నున్నచో, దిమ్మ రంగును సమానముగా గ్రహించినప్పటికీ అచ్చు హెచ్చుతగ్గులుగా నుండును. అందుచే మెత్తని దిండుగల ఉపరిభాగము అవసరము; ఉన్ని ఫెల్టు బట్ట సాధారణముగా ఉపయో గింపబడును. అచ్చు వేయబడు బట్టగుండా ప్రసరించు రంగు ఉన్ని ఫెల్టు లేక 'నామా' ను పాడుచేయును; ఈ ఉన్నికప్పుపై ఒక ముద్దుక బట్ట పరచ అందుచేత బడును. "బేక్ గ్రే" అని దీనికి పేరు. “పెరొ టైన్" లేక యంత్రములతో చేయబడు దిమ్మ. అచ్చు: "పెరొ టైన్" అనునది 4 రంగులను మాత్రము ఒక బూరు అచ్చు వేయును. పెరొటైన్ కొరకు రూపరచ నలు చేయుటలో రంగుపై రంగు రాకుండా చ వలెను. ఎందుచేతననగా దిమ్మ అచ్చులో రంగు ఇంచు మించు బట్టయొక్క పై భాగమున నుండును; ఈ తడి రంగులు కలిసి పడినచో, అవి తప్పనిసరిగా వాటి హద్దు