Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దకము “మూతలేని తొట్టిపద్ధతి" (Openkier) ననుసరించి పదిపండ్రెండు గంటలవరకును వస్తువును ఉడక బెట్టుదురు. ఇట్లు మూత లేని లొట్టిలో ఉడక బెట్టుట మిక్కిలి ప్రశ స్తము కాదు. ఏమనగా అది ఈ పద్ధతియందు ఎక్కువఖర్చగును. ఇందలి దీర్ఘకాల ప్రక్రియ మూలమున "ఆక్సి సెల్లులోస్" మరియు, "హైడ్రో సెల్లులోస్" అనునవి ఏర్పడి చలువ చేసు వస్తువు మెత్తబడి, చెడిపోయెడి ప్రమాదము క లుగును. తక్కువ ఒత్తిడితో గూడిన తొట్టిలో రంగు వేయబడు వస్తువు 10, 12 గంటలవరకు ఉడక బెట్టుచు ఆ వస్తువు యొక్క బరువులో "సోడా ఆష్"ను కలువుదురు. ఈపని తర్వాత ఆ వస్తువు భ్రమణ ముద్రాయంత్ర (Washing mangle) సాహాయ్యమునను ఒత్తుడు రోలర్సు యొక్క (Squeeze Rollers) సహాయమునను శుభ్రముగా నుతకబడును. దీనివలన రంగుపదార్థముతప్ప తక్కిన మలినములన్నియు తొలగిపోవును. నూలు పోగులలోని సహజమైన రంగుపదార్థమును తొలగించుటకు “బ్లీచింగ్ పౌడరు" ను, ద్రావక మును ఉపయోగింతురు. ప్రయోగమును “కెమికింగ్" అందురు. . " ఈ 2° టి. డబ్లియు. బ్లీచింగ్ పౌడరు ద్రావకముగాని 1°‡° టి. డబ్లియు పెర్్కరన్ గాని, సుమారు 6 నుండి 8 గంటల కాలము చలువచేయు నిమిత్తము వాడుదురు. ఈస్థితియందు వేడిచేయుట అనవసరము. “బ్లీచింగ్" చేయ బడిన తర్వాత, దారము చన్నీళ్ళలో తడవకు 15 నిమిష ముల చొప్పున రెండుసార్లు కడుగబడును. గంధకిత ఆమ్లము శ్రీ నుండి 1° టి. డబ్లియు ద్రావకములో 15 నిమిషములు పులియబెట్ట బడును. ఇట్లు చేయుటలో నూలుపోగులనుండి "బ్లీచింగ్ పౌడర్" యొక్క అవ శేషములను తొలగింపనగును. పులియబెట్టిన తర్వాత ఆమ్లము యొక్క లవలేశములను పూర్తిగా తొలగించు టకై తడవకు 10 నిమిషముల చొ॥న మూడు సార్లు పరిభ్రమించుచున్న తొట్లలో తిరిగి దారము కడుగ బడును. తుది దశలో ఆమ్లముయొక్క తుది లవలేశము లను తటస్థపరచి తొలగించుటకును, ప్రత్తిని మెత్త పరచుటకును సబ్బును వాడుదురు. మజ్జిగకు బదులుగా గంధకిత ఆమ్లము వాడుటవలన చలువ జేయుటకు వల సిన కాలము 6 నెలలనుండి 8 నెలలకు తగ్గును. 140 “క్లోరిన్" 1774 లో కనుగొనబడినది. కాని దాని తెలుపుచేయుశక్తి 1785 లో మాత్రమే బెర్తోలెట్ చే కనుగొనబడినది. దానిని కర్మాగారములలో తెలుపు చేయుటకు ఉపయోగించినవాడు జేమ్స్ వాట్ అను నతడు. అతడు క్లోరిన్ నీటిని ఉపయోగించెను. ఈ క్లోరిన్ నీరు అంతగా ఉపయోగించు వస్తువు కాకపోవుటచే 1799 లో చార్లెస్ టెన్నెన్చ “బ్లీచింగ్ పౌడరు" వ్యాపారార్ధము తయారుచేయబడినది. కాని అది ఉప యోగములోనికి 1800 సం॥లో మాత్రమే వచ్చెను. క్రమముగా "పాట్ ఆష్ "నకు బదులుగా సున్నము వాడుకలోనికి వచ్చెను. పిడప సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా 1880 లో వాడుకలోనికి వచ్చెను. అపుడు తెలుపు చేయుట కుపయోగించిన విధానము లీ 10 1. పీడన మాపక ము 2. మూతి 3. చిమ్ముడు గొట్టము 4. క్షారద్రావణ మట్టము 5 9 8 7 అధిక పీడన ద్రోణి 7. క్షార ద్రావణము . 8. నీరు 9. ఆవిరి 10. ఖాళీచేయు గొట్టము 5. సచ్ఛిద్రముగ కల్పితమైన అడుగు 11. గుడ్డ లేక నలు 6. కేంద్రావగ ఉదంచము (Centrifugal pump)