Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అద్దకము


ఏర్పడు పాలవంటి ద్రవమును ఉపయోగించి (Emulsifcation) ప్రత్తిమైనమును తొలగింపవచ్చును. ప్రత్తిలో నుండు క్రొవ్వుసంబంధమగు ఆమ్లము 'మార్గంక్ ఆమ్లము' 'పాల్మిటిక్ ఆమ్లము' అను రెండు ఆమ్లముల మిశ్రమముచే నేర్పడును. ఈ ఆమ్లములు 55.5° సెంటిగ్రేడ్ వద్ద కరగును. ఇవి క్షారములందు మిళితములగును. రంగువేయు పదార్థమునందు నత్రజని సంబంధమైనవియు, అస్ఫటికాకారముగా నేర్పడ నవియును అగు రెండు రంగువేయు వస్తువులు ఉండును. వీటిలో ఒకటి 'ఆల్కహాల్'లో కరగును. రెండవది ఆల్కహాలునందు అత్యల్పముగా కరగును. ఈ రంగులు చలవచేయుటవల్ల నశించి పోవును. మలినములన్నియు కలసి విడి ప్రత్తిలో 5% ఉండును. 'పెక్టిక్ ఆమ్లము' ఈ మలినములలో అత్యధికాంశముగా ఉండును,

చలువ చేయుట : పూర్వకాలము 'చలువ చేయుట'చాలమోటును, సుదీర్ఘమును, శ్రమతో గూడినదియునగు విధానము ననుసరించి జరుగుచుండెడిది. ఇందుకొరకు పాట్ ఆష్ (Pot ash=K2 Co3) ఉపయోగించు చుండెడివారు. పులియ పెట్టుటకై మజ్జిగయు, తెలుపు జేయుటకై సూర్యరశ్మియు సాధనములుగ ఉండెడివి. రంగు వేయుటకు పూర్వము బట్టలను చలువ చేయుటకై ఆరు నెలలు పచ్చగడ్డిపై పరచెదరు. ఈ విధానమునకు తృణప్రక్రియ అని పేరు.

ప్రస్తుతము చలువచేయుటకు చాలవరకు బ్లీచింగ్ పౌడరు (కాల్షియం హైపోక్లోరైట్) వాడుచున్నారు.ప్రస్తుతము విశేషముగా వక్త్రరూపమున చలువ చేయుదురు. నూలు దారము రూపమున స్వల్పముగను, వైద్యావసరముల కొరకు నీరు పిల్చెడి స్వభావముగల దూదిపింజల రూపమున అత్యల్పముగను చలువచేయుదురు. దూదిపింజలను తోటాలు చేయుటకును తుపాకీ ప్రత్తి కొరకును చలువచేయుచున్నారు. ఈ దూదిపింజ రూపమున చలువచేయునపుడు నారపోగులు బలముగా నుండ అవసరము లేదు. దారమును బట్టలను తయారుచేయు విషయమున దారపుపోగులు బలముగా నుండుట అవసరము - ప్రత్తిదారమును పెద్ద యెత్తున తెలుపు చేయుటకై మూతలేని తొట్టిలో అనగా తక్కువ ఒత్తిడిగల తొట్టిలో దానిని ఉడక బెట్టుదురు. చలువ చేయుటకై ఉడక బెట్టుటలో దారపుప్రొగులలోని ప్రత్తి మైనమును, క్రొవ్వుసంబంధము లగు ఆమ్లములను, తదితరములగు జీవకణ నిర్మాణ ద్రవ్యములు కాని (Non-cellulosic) మలినములను, పూర్తిగా తొలగించుట అవసరమై యున్నది. పెద్దతొట్టిలో ఉడక బెట్టుటకు వేరు వేరు పద్ధతులు ఉన్నవి. మూతలేని తొట్టిపద్ధతి' లో తగిన కొల

వివృతాంతస్క్రావణ ద్రోణి

1. పెద్ద కొయ్య తొట్టె
2. ఆవిరిని చిమ్ము గొట్టము
3. సచ్ఛిద్రముగ కల్పితమైన అడుగు
4. బోలు గొట్టము
5. ఆవిరిని క్రమబద్ధముచేయు మూత
6. వస్తువులు మజ్జము
7. క్షారద్రావణ మట్టము

తలుగల ఒక గుండ్రని నిలుపుకొట్టిని ఉపయోగింతురు. అడుగున రంధ్రములు పొడువబడిన ఒక కృత్రిమ నిర్మాణము అమర్పబడి యుండును. దానిలో రంగువేయబడు పదార్థము ఉంచబడును. ఈ కృత్రిమపు టడుగునకును, నిజమైన అడుగు భాగమునకును మధ్య జానెడు ఖాళీ స్థలము ఉంచబడును. ఈ స్థలము ద్రవము చేరుకొనుటకును, ఆవిరిగొట్టము లుంచుటకును ఉద్దేశింపబడినది. బయటికి తీసినపుడు అది చిక్కులు పడకుండ నుండుటకై చలువచేయబడు వస్తువును తగు జాగ్రత్తతో తొట్టియందుంచవలెను. చలువచేయు పదార్థమునకు సమముగా రంగుపట్టుటకయి, దానిని తొట్టిలో క్రమమైన రీతిలో నుంచవలయును. మొదట నొక వేడివీళ్ళ తొట్టిగుండా పోనిచ్చి, తరువాత “ఒత్తుడు రోలర్ల”చే ఒత్తుదురు.