Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దకము నేడు లభ్యములగు ఎనిలీన్ రంగులలో ప్రతిదానిలోను ఒక సహాయకము ఉండును. దాని సహాయముననే రంగు వేయుటను జయప్రదముగా నిర్వహింప వచ్చును. రంగు వేయుటకు ఒక ఎట్టి దారపు పోగునకై నను ప్రత్యేకపు చాయగల రంగుగాని రంగు ద్రవ్యముగాని కావలసి యుండును. అప్పుడు రంగు ద్రవ్యమునుగాని రంగునుగాని దారపు పోగులలోనికి ప్రవేశ పెట్టుటకును అక్కడ దానిని స్థిర పరచుటకును ఒక సాధనము అవసర మగును. తడిరంగు వేయు విధానములో సాధారణ ముగా నీరు అవసరము. అట్టి నీరు తగినంత శుభ్రముగా నుండవలెను. స్వాదుజలము ఇందుకు పనికివచ్చును. కఠిన జలము పనికి రాదు. రంగు వస్తువును దారపు పోగులును ఉంచబడిన పాత్రను నిప్పుమీద ప్రత్యక్షముగా నుంచుట చేగాని పాత్రలోనికి ప్రత్యక్షముగా ఆవిరిని పంపించుట చేగాని రంగువేయుటకు వలసిన వేడిమిని సంపాదింప వచ్చును. రంగుద్రవ్యమును దారపు పోగులునుగల పాత్ర ఆవిరి (steam bath) లో నుంచి వేడిచేసెడి విధానము “పరో విధానము అనబడును. దారపు పోగులకు రంగువేయు టకు ఉపయోగించు పాత్రను (Dye bath) లోహముతో గాని కఱ్ఱతోగాని పింగాణిలోగాని చేయుదురు. లోహ పాత్రలలో రాగి పాత్రలు స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు 1. పెద్ద కొయ్య తొట్టె 2. ఆవిరి గొట్టము రంగువేయు తొట్టె 8. లోనికి ఆవిరి వచ్చు ద్వారము 4. ఆవిరి బైటికి పోవు ద్వారము 5. కొయ్య రూలర్లు 6. రంగు మట్టము 7. దారము లేక బట్ట 8. సచ్ఛిద్రముగ కల్పితమైన అడుగు. రంగువేయుటకు ఉపయోగింతురు. యంత్రాగారముల యందును పెద్ద అద్దకపు కర్మాగారములందును దీర్ఘ చతురస్రాకారముగల కఱ్ఱతొట్టిని ఉపయోగింతురు. ఒక ఆవిరిగొట్టము అమర్చబడి యుండును. దీనిని "రంగు తొట్టి" అందురు. రంగువేయుటకు ఉపయోగించు పాత్ర రంగువేయబడు దారపుపోగుల స్థితిపై ఆధారపడి యుండును. ప్రపత్తి, ఉన్ని, సిల్కు- ఇవి విడివిడి దారపు పోగులుగా రంగు వేయబడును. నిడు పైన బ్రద్దలకు దూదిపింజ చుట్టిగాని, పోగులుగాగాని చుట్టిగాని, నూలు పిడిగాగాని, నూలు చిట్టముగాగాని, కండెలుగాగాని, వస్త్రరూపమున ఉన్న నూలుపోగులుగాగాని రంగు వేయబడును. దూది పింజలు, నూలు పిడులు మున్నగు వాటికి రంగువేయునపుడు (packed system) రంగు ద్రావకమును వీటిగుండా ప్రవహింపజేయుదురు. చిట్టము (Hank) రూపములోనున్న నూలునకు తఱచుగా రంగు వేయునపుడు ఒక పెద్ద తొట్టెలో నుంచుదురు. రంగు వేయుటకు పూర్వము వస్తువును కడిగి, తడిగా నుండ గనే రంగుపాత్రలో నుంచుదురు. కడుగని వస్తువులో కొన్ని సహజ మలినములుండును. వీటిని వ్యతిరేకించు ధర్మము వీటికుండును. కడుగుటచే ఇట్టి సహజ మలిన ములు తొలగిపోవును. దారపు పోగుల స్థితినిబట్టి మలిన ములు ఆధారపడియుండును. బట్ట తయారగు స్థితివరకు అవి సమానముగానే యుండును. కాని బట్ట స్థితిలో సహజ మలివములేకాక ఇతర నుండును. నూనె మరకలు, దుమ్ము ఇట్టి మలినములు నేత నేయు సందర్భములో ఏర్పడును. 138 మలినములుకూడ ఉన్ని విషయములో, ముద్దగానున్న ఉన్నిలో దుమ్ము, ఎండుటాకులు మొ. సహజ మలినములు ఉండును. కాని నూలులో రంగు వృక్షసంబంధమయిన నూనెలు తప్ప ఇతర సహజ మలినము లుండవు. ఉన్ని బట్టయందుకూడ ఉన్ని నూలులో గల మలినములే కనిపించును. సిల్కు విషయములో విడిచారపు పోగులు, నూలు, బట్ట మున్నగు వాటియందు 'జిగురు' లేక 'సెరిసిన్' అను మలినము ఉండును. ప్రత్తి, మైనమునందు (wax) నీటిని వ్యతిరే కించు ధర్మమును ప్రత్తికి కలిగించును. ఇది సబ్బుగా మార్పరాని ఒక రకపు నూనె. నీటిని, నూనెను కలుపగా