Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రంగువేయుట ఒక దారపు పోగుపై గాని, బట్టపై గాని, రంగును కనబరచు విధానమును రంగువేయుట అందుము. దారపు పోగులపై కేవలము రంగు కనబడు నట్టు చేయుటకంటె గూఢమైన అర్థము ఈ పదమునకు గలదు. దారపు పోగులందు అంతటను సమానముగా రంగు విస్తరించి యుండుటయే అద్దకపు పని అనబడును. పై భాగమున కేవలము పై పూతగా రంగు పూయుట అద్దకము కాజాలదు; ఇట్టిపని చిత్రలేఖన మనిపించు కొనును. దారపు పోగు, లేక బట్ట రంగు వేయబడినదని చెప్పబడుటకు అట్టి దారపుపోగు లేక బట్ట ఈ ఈ క్రింది విశిష్ట ధర్మములను కలిగియుండవలెను. 1. రంగు సరిసమానముగా అంతటను విస్తరించి యుండవలెను. రంగు రాదు. భాగములు ఉండ 2. ఉపయోగింపబడిన రంగు కేవలము పైభాగమున అంటినదిగా నుండరాదు. లి. రంగు వేయబడిన వస్తువు ఉతుకును, వెలుగును, చెమటను నిరోధించునంత మన్నిక కలిగియుండవలెను. రంగువేయు విధానమునందు ముఖ్య విషయములు రెండు. (1) దారపు పోగు (2) రంగు పదార్థము. దారపుపోగు. రంగువేయు విధానము ఈ రెండింటిపై గాని, వీటిలో నొకదానిపై గాని ఆధారపడియుండును. రంగువేయు విధానము దారపు పోగులనుగాని, రంగు పదార్థమును గాని అనుసరించి మారుచుండును. ఈ విధానమును నిర్ణ యించు మూడవ అంశ మొకటి కూడ కలదు. అది “సహా యక ద్రవ్యము" (Mordant) అని పిలువబడును. సహా యక ద్రవ్య మనగా దారపుపోగునకు రంగు పదార్థ ముతో సన్నిహిత సంబంధమును పొందుటకు సహాయ పడు నొక వస్తువు. “సహాయక ద్రవ్యము” (Mordant) యొక్క సహాయము లేనిచో కొన్ని రంగుపదార్థములు కొన్నిరకముల దారపు పోగులకు రంగువేయుటకు శక్తి గలిగియుండవు. సహాయక ద్రవ్యముచే దారపుపోగు రంగు పదార్ధమును తనలోనికి గ్రహించుకొను గుణమును పొందును. అప్పుడు దానికి రంగు హత్తుకొనును. “సహా యక ద్రవ్యము" నేడు ఎక్కువగా నుపయోగింప బడుట లేదు. పూర్వకాలములో 'ఎనిలైన్' అను రంగు పదార్థ 18 - 137 అద్దకము ములు దొరకని దినములలో సహాయక ద్రవ్యములు వాడబడుచుండెడివి. ఆ దినములలో ప్రకృతినుండి తీయ బడిన రంగు పదార్థములచే రంగులు వేయబడు చుండె డివి. "సహాయక ద్రవ్యములు" దారపు పోగుల యొక్క సూక్ష్మ రంధ్రములను పెద్దవిగా చేయునవియు, ఇట్లవి రంగుపదార్థములతో సన్నిహిత సంబంధనమును గూర్చు టకు సహాయ పడుననియు నమ్మబడు చుండెను. దీని పని ఇంతమాత్రమే కాదని తరువాత తేల్చబడినది. "సహాయక ద్రవ్యము” ప్రత్యక్షముగా రంగు పదార్ధములతో రాసా యనిక సంయోగమునుపొంది, కరగని ఒక అవక్షేపషు (precipitate) గా నేర్పడునని ఇప్పుడు రుజువు చేయబడి నది. ఈ అవక్షేపము “సరస్సు" (Lake) అని పిలవ బడును. ఈ రాసాయనిక సంయోగము దారపు పోగు మీద జరుగును. పూర్వము వాడబడుచుండెడి “సహాయక ద్రవ్యములు" బరువు లోహముల యొక్క లవణములై యుండెడివి. అవి జంతు లేక వృక్ష సంబంధ మైనవనియు (organic) ఖనిజ సంబంధమైనవనియు (inorganic) రెండు రకములుగా నున్నవి. లోహ సంబంధముకల “సహాయక ద్రవ్యము"లలో గురుత్వము గల లోహ లవణము లున్నవి. ఉదా : ఇనుము, క్రోమియం, అల్యూమినియము, తగ రము, రాగి మొదలగు వాటి లవణములు. జంతు లేక వృక్ష సంబంధమైన “సహాయక ద్రవ్యము" - అనగా వివిధ ములగు నూనెలు, వాటి రాసాయనిక సంయోగములు (compounds) (ఉదా: సబ్బులు) టేనిన్ పదార్ధములు మొదలగునవి. సహాయకములు (Assistants): సహాయకములు అనగా దారపుపోగులోనికి రంగు చొచ్చుకొని పోవుటకు సహాయపడు వస్తువులు. అవి లేకుండ కూడ రంగు వేయ వచ్చును. కాని దారపు పోగులు రంగును సులభముగా గ్రహించుటకు సహాయకములు తోడ్పడునేగాని వాటి వలన రంగులకుగాని, దారపు పోగులకుగాని, ఎట్టి ప్రమా దములేదు. రంగు వేసిన తర్వాత సహాయకములను సులభముగా కడిగివేయ వచ్చును. దారపు పోగులతో గాని రంగు పదార్థముతోగాని అవి ఎట్టి రాసాయనిక సంయోగమును పొందవు. ఈ సహాయకములు బజా రులో వేర్వేరు కంపెనీ పేరులతో విక్రయింపబడును.