Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దకము శ్రుతి ధ్వని వికిరణము (radiation) సోకునట్లు చేయ బడెను. ఈ విధముగా మారినెస్కో (Marinesco) అను శాస్త్రజ్ఞుడు సోడియము, పొటాసియము, పాదరసము, సీసము మున్నగు లోహములను అతిశ్రుతి ధ్వని తరంగ ముల చర్యవలన సారాయి, నూనె, నీరు మున్నగు ద్రవ ములలో చెదరగొట్టెను (dispersed). అధిక కంపన ప్రమాణముగల ప్రకంపనముల సహాయమున ఛాయా గ్రహణమునందు ఉపయోగించు రసాయనమును అభి వృద్ధి పరచవచ్చునని కనుగొనబడినది. ఉక్కును నత్రజని సహాయమున వేగముగా గట్టిపరచుటకును, అభివృద్ధి చేయుటకును అతిశ్రుతిధ్వని తరంగములను ఉపయోగింప వచ్చును. ఒక ద్రవములో అతిశ్రుతి, ధ్వని క్షేత్రము ఉన్నపుడు ఉష్ణోగ్రత అధికమగును. ఈ ప్రభావము వలన అతిశ్రుతి ధ్వని తరంగములు వైద్య శాస్త్రములో ఉపయోగింప వచ్చునని తెలియుచున్నది. ఎముకకు ఎట్టి హానియు కలుగకుండ ఎముక యొక్క మధ్య భాగముననుండు గుజ్జును వేడిచేయ వచ్చును. కీళ్ళగుండ ధ్వని శక్తిని ప్రవ హింపచేయుటకు కూడ వీలుకలదు. ఇప్పటివరకును శరీరమునందలి ఒక భాగమును వెచ్చచేయుటకు ఉపయో గింపబడు విద్యుదుష్ట విధానము (Electrical diathermy) స్థానే అతిశ్రుతి ధ్వనిని ఉపయోగింప వీలు కలదో లేదో ఇంకను తెలియదు. అతిశ్రుతి ధ్వని తరంగముల ప్రభా వము జీవ జంతువులపై కూడ చూడవచ్చును. అతిశ్రుతి ధ్వని తరంగములు సోకుటచేత కప్పలు, చేపలు మొద లగు అల్పజంతువులు కుంటివగుటయు, ఒక్కొక్కప్పుడు చనిపోవుటయుగూడ సంభవించును. ఈ తరంగములకు సృష్టిలోని ఏకకణ జీవులను (Protozoa) నశింపచేయు ప్రభావము కలదు. పొడవైన వృక్ష జీవకణములు ఆల్గే (Algae) మున్న గునవి అతిశ్రుతి ధ్వని తరంగముల వలన చిన్న చిన్న ముక్కలుగా చేయబడును. అతిశ్రుతి ధ్వని తరంగముల ప్రభావము చల్లని రక్తము కలిగిన జంతు వుల హృదయములపై కూడ కన్పించును. వీనివలన హృదయస్పందనముల విస్తృతి తగ్గి, గుండె కొట్టుకొను ప్రమాణము ఎక్కువగును. అతిశ్రుతి ధ్వని తరంగములు సోకుటచే మధుళిలీంధ్ర కణముల (Yeast cells) యొక్క 136 ప్రత్యుత్పత్తి శక్తి నశించును. ప్రకాశముకల బాక్టీరియా (Luminous Bacteria) తమ ప్రకాశమును పోగొట్టు కొనును. అతిశ్రుతి ధ్వని తరంగముల సహాయమున పాల చేయ అతి సూక్ష్మ క్రిములను నాశనము వచ్చును. ఇటీవల అతిశ్రుతి ధ్వని తరంగములు వస్త్రము శుభ్రపరచుటయందు యందలి లను కూడ ఉపయోగపడు చున్నట్లు తెలియుచున్నది. అధిక కంపన ప్రమాణము గల ప్రకంపనముల సహాయమున బట్టలను ఎడ తెగక కదలునట్లు చేయుటచే పోవును. వానినుండి మురికి తొలగి ఈ విధముగా వివిధ క్షేత్రములలో అతిశ్రుతి ధ్వని తరంగములు అత్యంత ప్రయోగోపయోగము లై యున్నవి. పైన ఉదహరింపబడిన వాటిలో పెక్కు విషయములు ఇంకను ప్రయోగశాల ఆవరణమును దాటి రాలేదు. దీనికి కారణము ఏమన అతిశ్రుతి తరంగ ముల ఉత్పాదకములలో ఉత్ప త్తిస్థానము యొక్క ఉపరి తలము సాధారణముగా చిన్నదిగా నుండుటచే ఈ అధిక కంపన ప్రమాణముకల వికిరణమును ఘన పదార్ధముల యొక్కగాని ద్రవపదాముర్థల యొక్క గాని అధిక పరి మాణముకల ఉపరితలము పై పడునట్లు చేయుట సులభ సాధ్యముకాదు. అయినను ఇప్పటికంటే భవిష్యత్తునందు, అతిశ్రుతి ధ్వని శాస్త్రము పారిశ్రామిక విషయములలో విశేషముగా ఉపయోగింప బడునని మనము గట్టిగా విశ్వసింప వచ్చును. టి. శే. రా. అద్దకము :- అను పదము ప్రత్యేకముగా బట్టల పరిశ్రమకు సంబంధిచినదై యున్నది. బట్టల ఉత్పత్తిలో విస్తారముగా ఉపయోగింపబడు ముఖ్యములగు దార ములు మూడు రకములు. అవి ప్రత్తి, సిల్కు, ఉన్ని అను వాటిచే నిర్మితములు. దారపు పోగులను మూడు ముఖ్యరకములుగా విభజింపవచ్చును (1) వృక్షజన్య ములు, ఉదా : ప్రత్తి, జనుము, లెనిన్; (2) జంతు జన్యములు, ఉదా : ఉన్ని, సిల్కు; (8) కృత్రిమ జన్య ములు, ఉదా : రేయాన్సు, లోహ లవణ జన్యములగు బంగారము, వెండి, ఏస్ బెస్టాస్ వంటి వాటికి అద్దకము విషయములో ప్రాముఖ్యము తక్కువ.