Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గించెను. అతి శ్రుతి ధ్వని తరంగ॥ సాంకేతికములు లఘు అంతరములలో (Short intervals) ఒక పేషణ యంత్రమునుండి (Transmitter) సముద్రము అడుగు భాగమునకు పంపబడును, కొట్లు పంపబడిన ధ్వని కిరణము నీటి అడుగున ఉన్న వస్తువు (Object) నకు తగిలి పరా వ ర్తనము చెందును. పరావర్తనము చెంది తిరిగి వచ్చు ధ్వనికిరణము ప్రేషణయంత్రము చేతనే గ్రహింపబదును. పరావర్తనము చెందిన ధ్వనికిరణము యొక్క తీవ్రతను (Intensity) బట్టి పరావర్తనమునకు కారణభూత మైన వస్తువు యొక్క స్వభావమును తెలిసికొనవచ్చును. వస్తువు వద్దకుపోయి తిరిగి వచ్చుటకు ధ్వని తరంగములకు వలసిన కాలమును కొలుచుటవలన, తరంగ వేగము తెలియును గాన, వస్తువు యొక్క దూరమును కనుకొనవచ్చును. ఈ ప్రతిధ్వని సూత్రమువలన సముద్రము యొక్క లోతును నిర్ణయింపవచ్చును. దీనివలన సముద్రగర్భము యొక్క స్వభావము (అనగా బురద, ఇసుక, బంకమన్ను -వీనిలో ఏది సముద్ర గర్భములో నున్నదో) ను కూడ గ్రహింప వీలగును. ప్రతిధ్వని సహాయమున సముద్రముయొక్క లోతును కనుగొను పద్దతి - ఈ ప్రతిధ్వనిసూత్రము ఇటీవల సముద్రపు అడుగుభాగ ముననుండు చేపలను పట్టుటకు మిక్కిలి ఉపయోగపడు చున్నది. బెస్తలు చేపలను పట్టుటకు అనువయినలోతును, . 135 అతి శ్రుతి ధ్వని శాస్త్రము చేపల గుంపుల ఉనికిని కనిపెట్టుటకు ఈ సూత్రము ఉప యోగించును. అతిశ్రుతి ధ్వని తరంగములచే లోహములందలి లోప ములను పరిశోధించు విధానము ఇప్పటికే భారీ యెత్తున యంత్రాగారములలో ఉపయోగింపబడు చున్నది. పల్సు టెక్నిక్ ను ఉపయోగించి లోహముల యొక్క పరీక్ష జరుపబడుచున్నది. ఈ విధానములో సెకండునకు సుమారు 50 లక్షల పరివర్తనముల కంపనప్రమాణముగల ధ్వని పల్సును పరిశోధింపవలసిన నమోనాద్వార పంపింతురు. ధ్వని పల్సు పోవుమార్గములో నమోనాయందు బీటగాని, పగులుగాని ఉండినచో ఆ విల్సు యొక్క శక్తి నలువైపు లకు వెదజల్లబడుటగాని (Scattered), ఉత్పాదక మునకు (Transducer) పరావర్తనముచే తిరిగి పంపబడుట గాని సంభవించును. ఇట్లు తిరిగివచ్చు సాంకేతిక ము (received signal) స్వంకితమైన (Calibrated) విద్యుత్కణ డోలన లేఖకము (Cathode-ray oscillograpb) పై చూప బడును. దీనినిబట్టి లోహములందు లోపము లున్నది లేనిదీ తెలిసికొననగును. లోపములు లేని లోహముల యొక్క స్థితిస్థాపక ధర్మములను తెలిసికొనుటకు అతి శ్రుతి ధ్వనిని ఉపయోగింతురు. ద్రవీభూత లోహముల నుండి వాయువును తీసివేయుటకు అనగా రాసాయినిక విక్రియ (Chemical reaction) వలన ఏర్పడిన బుడగలను తీసివేయుటకుకూడ అతిశ్రుతి ధ్వని తరంగములు ఉపయో గింపబడుచున్నవి. అట్లు వాయువు తీసివేయబడనిచో, ఆ బుడగలు లోహమునందే దాగియుండి లోహముయొక్క అవిచ్ఛిన్నతను (Continuity) పాడు చేయును. 1927వ సంవత్సరమునాటికే వుడ్ (Wood) మరియు లూమిస్ (Loomis) అను శాస్త్రజ్ఞులు ఒకదానితో నొకటి కలియని, నీరు, నూనె; నీరు, పాదరసము వంటి ద్రవ పదార్థములను తీక్షమైన అతిశ్రుతి ధ్వని తరంగముల సాయమున సుస్థిరమైన రసాయనము (Stable emul- sion) గా మార్చవచ్చునని చూపిరి. తక్కువ ద్రవీభవన స్థానము (low melting point) కలిగిన లోహములను గాని మిశ్రలోహములను (alloys) గాని ఎక్కువ ద్రవీ భవన స్థానముగల నీటితో లేక నూనెతో ద్రవస్థితియందు కలిపి, హద్దు ఉపరితలము (boundary surface) పై అతి