Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆతి ప్రతి ధ్వని శాస్త్రము అతిశ్రుతి ధ్వని శాస్త్రము యొక్క ప్రయోజనములు (Applications) : అతిశ్రుతి ధ్వని శాస్త్రము ఒక మాది రిగా క్రొత్త శాస్త్రమనియే చెప్పవచ్చును. భౌతిక శాస్త్రజ్ఞుల యొక్కయు భౌతిక రసాయనిక శాస్త్రజ్ఞుల యొక్కయు హస్తములలో ఈ శాస్త్రము సునిశితమైన ఉపకరణము అయినది. ద్రవపదార్థములను వాయు పదార్థములను పరిశోధించుటయందు అతిక్రుతి ధ్వని తరంగములు విస్తారముగా ఉపయోగింప బడినవి. వివిధ స్రవ ద్రవ్యములందు ఈ తరంగముల వేగమును, శోషణ మును నిర్ణయించుటచే ఆ స్రవద్రవ్యముల అణునిర్మాణము (Molecular structure) ను గూర్చి తెలిసికొనవచ్చును. తక్కువ కంపన ప్రమాణముగల (అనగా చెవికి వినబడు నట్టి) శబ్ద తరంగములను ఉపయోగించి స్రవద్రవ్యము లందు వేగము, శోషణము నిర్ణయించుటలో వెక్కు చిక్కులు కలవు. ఎక్కువ కంపన ప్రమాణముగల అతి శ్రుతి ధ్వని తరంగములను ఉపయోగిం చుటచే ఈ చిక్కులు మాయమగును. అందుచే అతిశ్రుతి ధ్వని తరంగములను ఉపయోగించి వేగమును, శోషణమును వివిధ స్రవ ద్రవ్యములందు నిర్ణయించుటకు అనేక సునిశితమైన పని ముట్లు (Highly accurate instruments) కనుగొనబడి నవి. వీనిలో అల్ట్రాసోనికు ఇన్ టర్ ఫెరోమీటర్ (Ultrasonic interferometer) అతి సునిశితమైనది. దీనిని దృక్ఛాస్త్రమందు దీని ప్రతిరూపమయిన రేఖా ఫలకవు కిరణ పృథక్క రణమానము (Grating spectrometer)తో పోల్చవచ్చును. స్రవద్రవ్యములనేకాక ఘనపదార్ధము లను కూడ పరిశోధించుటయందు అతిశ్రుతి ధ్వని తరంగ ములు ఎక్కువగా ఉపయోగింపబడినవి. ఘనపదార్ధము లలో కొన్ని ఏక స్ఫటిక ములు (Single crystals) గాను మరికొన్ని స్ఫటిక సముదాయములు (Polycrystalline aggregates) గాను ఉండును. వీని స్థితి స్థాపక ధర్మము లను సమగ్రముగా పరిశోధించుటయందు అతిశ్రుతి ధ్వని తరంగములు విరివిగా ఉపయోగింపబడుచున్నవి. ఇట్టి పరిశోధన కొరకు అనేక పద్దతులు కనుగొనబడినవి. నేటి కాలమున ఘనపదార్థములందును ద్రవపదార్థము లందును ధ్వని తరంగవేగమును, శోషణమును కను గొనుటకు ఒక నూతనపద్ధతి ఉపయోగింపబడుచున్నది. 134 d అందురు. దీనిని పల్సు టెక్నిక్ (Pulse Technique) ఆల్ట్రాసోనిక్ ఇన్స్టర్ ఫెరోమీటరు కండె ఇది ఎక్కువ సునిశితమైనది. ఇందు అతిశ్రుతి ధ్వని తరంగములకు బదులు పల్సులను (Pulses) వాడుదురు. ఈ లల్ట్రా సోనిక్ పల్సులను ఆయా పదార్ధములలో పంపించి, అవి ఒక నిర్ణీత దూరము ప్రయాణము చేయుటకు పట్టు కాల వ్యవధిని సునిశితమైన పద్ధతులచే నిర్ణయింతురు. దీనివలన ఆయా పదార్ధములలో పల్సుల వేగమును కనుగొన వచ్చును. పల్సుల నుపయోగించి మరికొన్ని సాధనములు ద్వారా శోషణమునుగూడ నిర్ణయింప వచ్చును. ఇట్టి పరిశోధనముల మూలమున దశాశ్రయమునందుండు పదార్ధముల అణునిర్మాణమును నిరూపింప వచ్చును. రసాయన శాలలో శాస్త్ర పరిశోధనములకే గాక అతిశ్రుతి తరంగములు సాంకేతికముగా కూడ అనేక విధములుగా ఉపయోగింపబడుచున్నవి. లోహశోధన కార్యము (Metallurgy) వాయు పృథక్కరణము (Gas analysis) పీడన మాపకములు (Pressure gauges) పింగాణి సంబంధమగు మట్టి పరిశోధనలు (Ceramic research) ప్రతిస్ఫటిక పరిశోధనము (Colloid research) ఔషధపు పరిశోధనములు, జీవశాస్త్రపు పరిశోధనములు లోహపు పూత (అనగా మాలామా చేయుట), ధ్వని సాంకేతిక కార్యములు (Sound signalling) - వీనియందు అతిశ్రుతి ధ్వని తరంగముల సాంకేతిక ప్రయోగములు కాననగును. అతిశ్రుతి ధ్వని తరంగముల ప్రథమ సాంకేతిక ప్రయోగములలో ధ్వని సాంకేతిక కార్యము ఒకటి. అధిక కంపన ప్రమాణముగల ధ్వని తరంగములను ఉప యోగించుటవలన కలుగు గొప్ప లాభ మేమన, ఈత రంగ ములను అతిసులభముగా ఒక పుంజము (beam) గా ఏర్పడునట్లు చేయవచ్చును. ఇట్లేర్పడుటచే నిర్దిష్టమైన దిశయందు సంకేతముచే సమాచారమును పంపుటకు వీలగుచున్నది. 1914 నుండి 1918 వరకు జరిగిన ప్రథమ ప్రపంచ సంగ్రామ సందర్భమున నీటియందు మునిగి యుండు శత్రువుల జలాంతర్గాముల ఆచూకీలను తెలిసి కొనుటకు లాంజెవాన్ (Langevin) అనుశాస్త్రజ్ఞుడు అతిశ్రుతి ధ్వని తరంగములను మొట్టమొదట ఉపయో•