Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వలన తరంగముఖమార్గమున వేరువేరు ప్రదేశములలో స్రవద్రవ్యము యొక్క సాంద్రత మారును. దీనివలన వక్రీభవన ఘాతాంశము (Refractive index) నందును మార్పు సంభవించును. ధ్వని క్షేత్రము (Q) నకు సమకోణ మార్గములో కాంతిజాలమును పంపినచో, అతిశ్రుతి ధ్వని తరంగముల ఛాయను ఒక తెరపైగాని లేక కొద్దిదూరము k Sp అతి శ్రుతి ధ్వని శాస్త్రము నందుండు ఛాయాగ్రహణ చిత్రఫలకము (S) పై గాని పడు నట్లు చేయవచ్చును. ఆ ఛాయయొక్క రూపము, తరంగముఖము యొక్క ఆకారము పై ఆధారపడి యుండును. తరంగముఖము గోళాకారముగా నున్నచో ఛాయ గుండ్రముగాను, సమతలము కలదిగా నున్నచో, సరళ రేఖా కారముతోను ఉండును. దృగ్విధానము 02 b C d అతి శ్రుతి ధ్వని తరంగముల మూలమున కలుగు కాంతి సమనము యొక్క పరిశీలనార్హమై సాధనముల కూర్పు ధ్వనితరంగములు లేనప్పటి దృశ్యము ప్రధాన తరంగ దృశ్యము తృతీయ క్రమ తరంగ దృశ్యము పంచమ క్రమ శరంగ దృశ్యము జయిలాలులో (Xylol) ధ్వని తరంగములవలన కలుగు నమన విచ్ఛిన్న కిరణములు 133 లన్నింటిలో ఇదియే మూల సూత్రము. ఒక స్రవద్రవ్యము నందు ధ్వని తరంగమును పంపినపుడు ఆ ఆ స్రవద్రవ్యము యొక్క వక్రీభవన ఘాతాంశము వికల్పముగా హెచ్చు టయు, తగ్గుటయు జరుగును. అందుచే ధ్వని క్షేత్రము ఒక దృక్ - రేఖాఫలకము (Optical grating) గా చేయును. ఒక దీర్ఘ ఛిద్రమునుండి వచ్చు కాంతికిరణ జాలమును ధ్వనిక్షేత్రమునకు సమకోణమార్గములో - పని పంపినచో ఆ కాంతికిరణజాలము నమనము నొందును. ధ్వనిక్షేత్రము లేనపుడు తెరపై దీర్ఘ ఛిద్రము యొక్క ప్రతిబింబము ఒక్కటే కనుపించును (a). ధ్వని క్షేత్రము వున్నపుడు, కాంతి కిరణజాలము నమనము నొందును గాన దీర్ఘ ఛిద్రముయొక్క మధ్య ప్రతిబింబమునకు ఇరు వైపుల అనేక ప్రతిబింబములు కనుపించును (b, c, d). చేతిలోనుండు సమస్యా స్వభావముపై ఆధారపడి వేరు వేరు పనులకు వేరువేరు గ్రహణ ఉపాయములు ఉపయోగింపబడుచున్నవి. స్రవద్రవ్యములలోని శోష ణము (absorption)ను, వేగమును నిర్ణయించుటకు గల పద్ధతులలో కాంతి నమన విధానము ఎక్కువ వాడు కలో నున్నది. దీనికి కారణములు కొంతవరకు దాని క్రొత్తదనము, అది ప్రదర్శించు దృశ్యము అయి ఉండ వచ్చును.