Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతి క్రుతి ధ్వని శాస్త్రము కపుప్రకంపెనములు అధిక తీక్షముగా (sharp) నుండును. అందువలన స్థిరమైన కంపన ప్రమాణములు గాను, ప్రేషణ యంత్రముల నడుపుటలోను, డోలన వలయము లను (Oscillating circiuts) స్థిరీకరించుట యందును అనునాదమువద్ద ప్రకంపించు శిలాస్ఫటిక ఫలకములను ఉపయోగించెదరు. కొలది కాలమునుండియే స్వాభావిక ముగా లభించు విద్యుత్పీడన స్ఫటికములకు బదులుగా మట్టి సంబంధమగు ద్రవ్యముల (Ceramic materials) నుండి రాసాయనికముగా తయారు చేయబడిన బేరియం టిటా నేటి (Barium titanate) మొదలగు వాటిని అతి శ్రుతి ధ్వని జనక ములుగా ఉపయోగించుచున్నారు. ఇట్టి అతిశ్రుతిధ్వని జనకములు ఎక్కువ పరిమాణమును (Large size) కలిగి యుండుటచే ఎక్కువ వెడల్పగు తరంగజాలమును ఇచ్చును. ఆతి శ్రుతి ధ్వనుల పరిశోధనము (Detection) :- సామాన్యముగా శబ్దతరంగముల పరిశోధనకు ఉపయోగ పడు విధానము లన్నియు అతిశ్రుతి ధ్వనులను గుర్తించు టకు వినియోగింపవచ్చును. చెవిని మాత్రము ఉపయో గించుటకు వీలుపడదు. అతిశ్రుతి ధ్వనులను గుర్తించుటకు ఉపయోగపడు వేరువేరు గ్రాహిణులను మూడు రక ములుగా విభజింపవచ్చును. 1. యాంత్రిక గ్రాహిణులు (Mechaincal detectors) : పొగ, ధూళి, బిందుకణములు, పటలములు (Films), జ్వాలలు, వికిరణమానములు (Radiometers). 2. విద్యుత్ గ్రాహిణులు (Electrical detectors) : ప్రతిరోధకములు (Resistors), వేడి తీగెలు (Hot wires). 3. దృగ్విధానము (Optical methods): ఛాయా రేఖలు (Shadowgraphs), ప్లీ రెన్ (Schlieren) విధానము నమన విధానము (Diffraction method). యాంత్రిక, విద్యుత్ గ్రాహిణులు ప్రవద్రవ్యముల (Fluids) లోను, దృగ్విధానములు ద్రవములలో ను సంపూర్ణకిరణ భేద్యమగు (Transparent) ఘనపదార్థము లలోను ఉపయోగింపబడు చున్నవి. 1. యాంత్రిక గ్రాహిణులు : తేలికయగు ఘనపదార్థపు కణములనుగాని ద్రవపు బిందువులనుగాని (ఉదాహరణకు చుట్టపొగలో నుండు నట్టివి) వాయువుతో కూడిన ధ్వని 132 ఆ కణములు వాయుకణముల చలనమును అనుసరించుటచే ధ్వనితరంగముల చిత్రమును ఇచ్చును. ధ్వనితరం గము యొక్క నిష్పంద బిందువుల (Nodes) వద్ద బుడగలు ఏర్పడునట్లు చేయుటచే ఆ తరంగము యొక్క రూపము కనుపించునట్లు చేయవచ్చును. పురిగల నారచే (Torsion fibre) వ్రేలాడ తీయబడిన గుండ్రని బిళ్ళపై (disc) అతిశ్రుతిధ్వని తరంగజాలమును పడునట్లు చేసినచో, ఆ పురి పై భాగమున ఏర్పడు మెలిక (Twist) యే తరంగజాలపు తీవ్రత (Intensity) కు ప్రమాణమగును. అతిశ్రుతిధ్వనిజాలమును గుర్తించుటకు ఉపయోగపడు వికిరణమానమునందు ఈ సూత్రమే ఉపయోగింపబడు చున్నది. అతిశ్రుతిధ్వనిజాలమును గుర్తించుటకు సబ్బు పటలము (Soap film)ను గాని సునిశితమగు జ్వాలను (Sensitive flame) గాని ఉపయోగింపవచ్చును. క్షేత్రములోనికి ప్రవేశ పెట్టబడినపుడు, ణ 2. విద్యుత్ గ్రాహిణులు : ఒక సవద్రవ్యము యొక్క ఉష్ణోగ్రతలో, దానియందు జరుగు సంపీడన విరళీకరణ ముల (Compressions and rarefactions) మూలమున, కొద్దిమార్పులు జరుగును. దాని ఉష్ణోగ్రత అతికొంచె ముగా మారుటచే అతి సున్నితమగు ఉష్ణోగ్రతా మాపక ములు మాత్రమే ఆ మార్పును గుర్తింప గల్గును. ధ్వని తరంగమార్గములో ఒక వేడితీగెను (Hot wire) ఉంచి నచో అది చల్లబడును. ఈ చల్లబడుటను (అనగా ఉష్ణో గ్రతలో మార్పును) తరంగము యొక్క వేగమునకును విస్తృతికిని ప్రమాణముగా తీసికొనవచ్చును. ధ్వని క్షేత్ర మును అన్వేషించుటకు ఉపయోగించు హాట్ వైర్ మైక్రోఫోను (Hot wire microphone) నందలి మూల సూత్రము ఇదియే. దీనియందు ఒక సన్నని ప్లాటినము లేక నికెలు తీగను ఉపయోగింతురు. ఈ తీగను ధ్వని క్షేత్రములో ఉంచినపుడు దాని ఉష్ణోగ్రత మారును. దీని ఫలితముగా ఆ తీగ యొక్క ని రో ధ క త్వ ము నందును మార్పు కల్గును. నిరోధకత్వమునందలి మార్పు ధ్వనితరంగముల విస్తృతికి ప్రమాణమగును. దృగ్విధానములు: ఒక స్రవద్రవ్యమునందు ధ్వనిత రంగ జాలమును పంపినపుడు, తరంగముఖ రంగము (Wave- front) న సంపీడనము, విరళీకరణములు జరుగును. అందు