Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. మేగ్నెటోస్ట్రిక్షను ఉత్పాదకము : (The Magneto- striction generator) నికెలు మున్నగు అయస్కాంత లోహసంబంధమగు కడ్డిగాని గొట్టముగాని పరివర్తిత అయస్కాంత క్షేత్రము (Alternating magnetic field) లోనికి తేబడినపుడు అయస్కాంతీకరణము వలన కడ్డీ లేక గొట్టము యొక్క పొడవు నియమిత కాలములో మారును. ఇట్టి సంఘటనను "మేగ్నెటోస్ట్రిక్షను ఉత్పా దకము" అందురు. వికల్ప విద్యుత్ప్రవాహము యొక్క కంపన ప్రమాణము, నికెలు కడ్డీయొక్క స్వాభావిక కంపనప్రమాణము సమానముగా నున్నపుడు, అను నాదము (resonance) పుట్టి, కంపనవిస్తృతి గరిష్ఠముగా నుండి, కడ్డి చివరనుండి అదే కంపనప్రమాణము గల ధ్వని తరంగములు వెలువడును. 4. పీడన జనిత విద్యుత్ ఉత్పాదకము: నేడు అతి శ్రుతిధ్వని తరంగములను ఉత్పత్తి చేయుటకు ఈ విధానమే విరివిగా నుపయోగింప బడుచున్నది. ఈ పద్ధతిని ఉప యోగించి సెకండునకు దాదాపు 8,000 లక్షల పరివ వర్త నముల వరకు కంపన ప్రమాణముగల ధ్వనితరంగములు ఉత్పత్తి చేయబడినవి. ఇంతకంటె హెచ్చు కంపన ప్రమా ణము గల ధ్వనిత రంగములు నేటివరకును ఉత్పత్తి కాలేదు. ఈ శిలా స్ఫటిక ములను ఒత్తిడికిగాని వ్యాకోచపు శక్తికి (tension) గాని గురి చేసినప్పుడు, ఆ స్ఫటిక ముల యొక్క నిర్దిష్ట ఉపరితలములపై విద్యుత్తు పుట్టునని 1880 వ సంవత్సరములో క్యూరీ దంపతులు కనుగొనిరి. సంఘటనను పీడనజనిత విద్యుత్ప్రభావము అందురు. ఈ ప్రభావము క్రింది స్ఫటికములలో కూడ కాననగును, టూరుమలై ను (Tourmaline) యశద గంధకిదము (Zinc blende), సోడియ హరితము (Sodium chlorate) తింత్రిణ్యాకము (Tartaric acid), కండచక్కెర (Cane sugar), రాచెలి లవణము (Rochelle salt) పొటాసియ ద్వి ఉదజ భాస్వరితము (Potassium dihy- drogen Phosphate), అమ్మోనియా ద్వి ఉదజ భాస్వరి తము (Ammonium dihydrogen Phosphate), ఎథిలిన్ డై ఏమైన్-టార్ట్రేటు (Bthylene diamine tartrate మొదలగునవి. 131 అతి ప్రతి ధ్వని శాస్త్రము తరువాత కొలదీ కాలములోనే ఓడనజసౌరవిద్యు త్ప్రభావమునకు విరుద్ధమైన ప్రభావమును కూడ క్యూ దంపతులు కనుగొనిరి. ఒక శిలాస్ఫటికమును నిర్దిష్ట దిశలో వికల్ప విద్యుత్ క్షేత్రమునందు ఉంచిన ఆ శిలా స్ఫటికము సిర్దిష్ట దిశలలో సంకోచించుట (Contract) గాని వ్యాకోచించుట (expand) గాని జరుగును. శిలా స్ఫటికము యొక్క పీడనజనిత విద్యుత్తు అక్షము (Piezoelectric axis) విద్యుత్ క్షేత్రపు అక్షముతో ఏకీభ వించవలెను. ఇట్లు ఉంచినచో ఆ శీలాస్ఫటికము విద్యుత్ క్షేత్రపు మొదటి అర్ధ పరివర్తనములో పొట్టిదిగా నొక్కబడి రెండవ ఆర్చ పరివర్తనములో ఆప్రమాణము గానే సాగును. ఈ విధముగా శిలాస్ఫటికము స్థితిస్థాప కత్వముగల డోలనములను (Elastic oscillations) పొందును. ఈ డోలనముల ఆవర్తన కాలము (Period) వికల్ప విద్యుత్ క్షేత్రపు ఆవర్తన కాలమునకు సమాన Yx ప్రేరక విద్యుత్ వాహకముల నడుమ శిలాస్పటిక ఫలక నిక్షేపము. l, d= శిలా ఫలకము X, y, z = సంకోచ వ్యాకోచ దిశలు S= వికల్ప విద్యుత్ క్షేత్రము ముగా నుండును. శిలాస్ఫటిక ఫలకము యొక్క స్వాభావికమగు యాంత్రిక కంపన ప్రమాణముతో విద్యుత్కవన ప్రమాణము అనునాదము జరిపినపుడు, కంపనముల వి స్తృతి గరిష్ఠముగా నుండును. ఈ విధముగా అనువాదమునందు శిలాస్ఫటిక ఫలకము అతిశ్రుతి ధ్వను లను పుట్టించును. స్వాభావిక కంపన ప్రమాణమునకు సంబంధించిన ఏ బేసి అనుస్వరమువద్ద నైనను ఆ శిలా స్ఫటికము అనువాదపు కంపనములను పొందునట్లుగా చేయవచ్చును. అందువలన సెకండునకు 20,000 పరివర నములనుండి కొన్ని వేల లక్షల పరివర్తనముల వరకు కంపన ప్రమాణముగల అతిశ్రుతి ధ్వనులను విద్యుత్పీడన జనకముచే పొందగలము, అనువాదమునందు శిలాస్ఫటి