Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతి శ్రుతి ధ్వని శాస్త్రము కూడా అయినవి. అయినను పరసత్త ఎట్టి స్వభావము కలదియో నిర్ణయింపగలుగుదాక తన జీవితమునుగాని, కర్మనుగాని, అతడు ఆపలేడు. కావున ఈ రెండింటిని ప్రథమమున స్వీకరించి దర్శనశాస్త్రము నిర్మించవలసి ముండును. సర్వ సత్తాశాస్త్రమును ప్రస్తుత కాలమున దర్శనశాస్త్రము నకు పర్యాయముగా కూడ వాడుట కలదు. ప్రపంచమునకు సామాన్య సత్తాస్వరూపము ఎట్టిదో తెలిసికొనుటకంటె వేర్వేరు సత్తల స్వరూపము తెలిసి ' కొనుట సులభము. కనుక తత్త్వశాస్త్రము ప్రపంచ శాస్త్రము (cosmology) సత్తాశాస్త్రము (ontology) పురుషార్థశాస్త్రము (philosophy of values) మత విజ్ఞానము (philosophy of religion) మొదలగు శాఖలుగా విభజింపబడినది. అన్నిటియందును సతా విషయక ప్రశ్నలు ఎత్తుకొనబడును. పి. టి. రా. అతి శ్రుతి ధ్వని శాస్త్రము :- ( Ultrasonics ) మానవకర్ణమునకు సెకండునకు 20 నుండి 20.000 పరివర్తనముల (cycles) మధ్యనుండు కంపన ప్రమాణము (frequency) గల ధ్వని తరంగములనుమాత్రమే గ్రహింస గల శక్తికలదు. 20,000 పరివర్తనములకంటె ఎక్కువ కంపన ప్రమాణము గల ధ్వనితరంగములు మానవ కర్ణముపై ఎట్టి ప్రభావమును కలుగచేయలేవు. ఇట్టి ధ్వని తరంగములను అతి శ్రుతి ధ్వని తరంగములు (Ultrasonic Waves) అందురు. ఈతరంగముల యొక్క ఉనికి 188లివ సంవత్సరమునుండి తెలియవచ్చినదని చెప్పవచ్చును. అతి శ్రుతి ధ్వని తరంగముల పుట్టుక : అతి శ్రుతి ధ్వని తరంగముల ఉత్పత్తిచేయు విధానములను స్థూలముగా నాలుగు విభాగములు చేయవచ్చును. 1. యాంత్రిక ఉత్పాదకములు (Mechanical generators). 2. ఉష్ణతా ఉత్పాదకములు (Thermal generators), 8. మేగ్నెటోస్ట్రిక్షను ఉత్పాదకము (Magneto- striction generator). ఓ. పీడనజనిత విద్యుత్తు ఉత్పాదక ము (Piezoelectric generator). 1. యాంత్రిక ఉత్పాదకములు : 1899 వ సంవత్సర ములో కోనిగ్ అను శాస్త్రజ్ఞుడు కొలది మిల్లిమీటర్ల పొడవు గల చిన్న శ్రుతిదండము (Tuning fork) ల సహాయమున గాలిలో దాదాపు సెకండునకు 90,000 పరివర్తనముల వరకు కంపన ప్రమాణముగల అతి శ్రుతి ధ్వనులను ఉత్పత్తి చేసెను. ఈవిధముగా ఉత్పత్తి కాబడిన తరంగ ములు అధికముగా మాంద్యమునొంది (Heavily dam- ped) త్వరలో నశించిపోవుటచేత ప్రయోగమునకు పనికి రావు. దాదాపు సెకండునకు 1,00,000 పరివ ర్తనముల వరకు కంపన ప్రసూణముగల తరంగములను గాల్టను ఈల (Galtan whistle) సహాయమున పొందవచ్చును. ఇందు, ఒక దీర్ఘ ఛిద్రము (narrow slit) నుండి వెలు వడు గాలిప్రవాహము పదునైన అంచునకు తగిలి, ఆ అంచునకు సంబంధించియుండు గొట్టములోని గాలిని కంపింప చేయును. ఇట్లు గాలి కంపించుటలో ఒక సంగీత ధ్వని వెలువడును. ఈ కంపనములు స్థిరమైన కంపన ప్రమాణమును, విస్తృతి (amplitude) ని కలిగియుండు టచే ప్రయోగములలో ఎక్కువ ఉపయోగకరములుగా ఉండును. ఈ పద్దతిని అనుసరించియే హర్తుమను, హోల్డ్సుమను అనువారు సెకండునకు 1,20,000 పరి వర్తనముల వరకు కంపన ప్రమాణముగల ధ్వని తరంగము లను ఉత్పత్తిచేయు రెండు ఉత్పాదకములను (Hart- mann's gas current genenator and Holtzmann's ultrasonic generator) కనుగొనిరి. 130 2. ఉష్ణతా ఉత్పాదకములు : మాంద్యమునొందిన (damped) డోలకపు (oscialltory) పరిపథము (circuit) వలన ఏర్పడిన విద్యుత్ విస్ఫులింగము (Spark) యొక్క సహాయమున ఆల్టుబెర్గ్ అను శాస్త్రజ్ఞుడు సెకండునకు 8,00,000 పరివర్తనములవరకు కంపనప్రమాణముగల అతి శ్రుతి ధ్వని తరంగములను ఉత్పత్తి చేసెను. వికల్ప విద్యు త్ప్రవాహము (Alternating current) చే కప్పబడిన ఏక ముఖ ప్రవాహ (Direct current) చాపము సహాయమున సెకండునకు దాదాపు 20 లక్షల పరివర్తనములవరకు కంపన ప్రమాణముగల అతి శ్రుతి ధ్వని తరంగములను ఉత్పత్తి చేయవచ్చును. నేటి కాలమున ఈ ఉష్ణతా ఉత్పా దకములు అంత ఎక్కువగా ఉపయోగింపబడుటలేదు.