Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ ప్రేరణవల్ల దృశ్య జడపదార్థములు, ప్రాణులు, చైత్య ములు ఉద్భవించును. ఇవి అన్నియు ఈ ఘటనాప్రవాహ ములు ధరించిన ఆకృతి రూపములు, ఘటనలు అన్నియు అనేక విధములుగా పరస్పర సంబద్ధములు. ఈ ఆకృతులు కూడ అనంత విధములు. ఘటనలకు ఆకృతికారకుడు ఈశ్వరుడు. ఆకృతులన్నియు నిత్యవస్తువులు (exteranal objects); ఈశ్వరుని బుద్ధిరూపములు ( Conceptual forms); ఆయన బుద్ధిస్వభావసంఘటితములు. ఘటనలు నిరాకారములు అయినప్పుడు ఈశ్వరుడు కేవలము బుద్ధి స్వరూపమున ఉండును. ఆకృతులకు అప్పుడు సత్త ఉండదు. ఘటనలకు మాత్రమే సత్త ఉండును. ఘటనలు ఆకృతులను స్వీకరించినప్పుడు, ఆకృతులకు కూడ సత్త చెందును. మనము ద్రవ్యము అని పిలుచునది ఘటనల యొక్క ఒక ఆకృతి. ఈ ఆకృతులకు సత్త కలిగినప్పుడు ఈశ్వరునికి కూడ సత్తి కలుగును. అందుచేత ఈశ్వ రునికి రెండు భావములు : కేవల బుద్ధిభావము, సత్తా భావము (conceptual and actual) అని, పాశ్చాత్య దర్శనములందు సత్త పరిపరి విధముల నిర్వ చింపబడినది. కొందరిచే కేవలము ఈశ్వరస త్తతో ప్రారం భించి మానవస త్త జడసత్త నిర్వచింపబడినవి. అధునాతను లచే జడసత్తతో ప్రారంభించి, మానవసత్త ఈశ్వర సత్త నిర్వచింపబడినవి. ఈ రెండు రీతులయందు మానవ స త తన ప్రాముఖ్యమును కోల్పోయినది. అందుచేత ధర్మ శాస్త్రమునకు హానికలిగినది. ఈశ్వరస త్తను స్వీకరించుట గాని, నిరాకరించుటగాని మానవుడే తన బుద్ధివలన చేయ వలెను. అటులనే జడస త్తను స్వీకరించుటగాని, నిరాకరిం చుటగాని మానవునిదే. కనుక ధర్మశాస్త్ర ప్రారంభము నకు మానవుడు మూలమని, కేంద్రమని, చెప్పవచ్చును. ఈశ్వరస త్తను స్వీకరించి, తత్సాత్కారమునకు ప్రయ త్నము చేయునది”మానవుడు. ఈశ్వరుడు నిత్య సంపూర్ణ స్వరూపుడై నందున అతనికి ప్రయత్నా ప్రయత్నములు, కోరికలు, మనోరథము యొక్క సఫలత్వ విఫలత్వములు లేవు. కనుక ధర్మశాస్త్రములు, విజ్ఞాన శాస్త్రములు మానవునికొరకు ఉద్దిష్టములు. మానవుడే అప్రధాను డైనచో ఈ శాస్త్రములన్నియు నిరర్థకములు. జడసత్త మానవునకు అనుకూలముగా నున్నను, ప్రతికూలముగా 17 129 అతి భౌతిక శాస్త్రము ఈశ్వర నున్నను ఉదాసీనతయే. ప్రపంచకము సార్థకమైనచో దాని సార్థకత మానవా పేరు చేతనే కలుగును. దృష్టిచే ప్రపంచమునకు సార్థకత నిరర్థకత అనునవి లేవు. జడదృష్టిచే కూడ అవి లేవు. అందుచేత ఏ సత్తా శాస్త్రమై నను ప్రథమమున మానవుని జీవనమును, కర్మముకు నడవడిని, ధర్మమును, వీటి సార్థకతను చూపవలెను. ఈ అభిప్రాయమునకే ఇప్పుడు ప్రపంచమున ప్రాధాన్యము లభించుచున్నది. డెకార్టు చెప్పినట్లు మానవుడు సర్వమును సంశయింప గలడు. కాని తన సత్తను సంశయింపలేడు. తాను అనిత్యుడు మర్త్యుడు అయినను అతని సత్తయే ప్రథమ మున నిశ్చయ వేద్యము ; అనిరాకరణీయము, బుద్ధిని ఉపయోగించినకొలది తన సత్త, తన దేహ పరిమితమే గాక తనను అతిక్రమించి ఉన్నట్లు మానవుడు తెలిసికొనును. ఇది సంకుచితముగాని ప్రతిబుద్ధికి వేద్యము. ఈ అతిక్రమణ (Transcendence) వి ధాన మెట్టిదో తెలిసి కొనుట సత్తాశాస్త్రము యొక్క ఒక ముఖ్య విషయము. ఈ అతిక్రమణమును అంతఃక్రమణముగా చేయు విధానమే ధర్మము. తదనుకూల ప్రవర్తనమే ధర్మ ప్రవర్తనము. తదనుకుల జీవనమే జీవన వికాసము. ఈ వికాసమునకు ఈశ్వర సాక్షాత్కారము అంతిమకోటి. ఇట్లు మానవ జీవనమునకు, ధర్మమునకు, కర్మకు ప్రాధాన్యము ఇచ్చిన సత్తాశాస్త్రమే సత్యము కాగలదు. తక్కినవాటి సత్యా సత్యములు నిరూపించుట వ్యర్థ ప్రయత్నము. సత్తా శాస్త్రములలో పరస్పర వైరుధ్య ముండుటచే అన్నియు సత్యములు కాజాలవు. అయినచో ఒక్కటియే సత్యము కాగలదు. సత్యము ఏక స్వరూపము. అసత్యములు అనంతములు. రెండు రెండు కలిసిన ఎంతవచ్చును ? అను ప్రశ్నకు నిజమైన ఉత్తరము ఒక్కటియే. తప్పులు అనంతములు. నాలుగుసంఖ్య తప్ప తక్కిన సంఖ్యలు అన్నియు తప్పు జవాబులు. అటులనే ధర్మశాస్త్రములు, సత్తాశాస్త్రములు. వాటిలో సత్యము లెవ్వియో సత్యే తరము లెవ్వియో భగవంతునకే ఎరుక. మానవుడు తనబుద్ధిని ఉపయోగించి సత్యమును తెలిసికొనుటకు సర్వ ప్రయత్నములు అనేక శతాబ్దులనుండి చేయుచున్నాడు. కొంచెముకొంచెముగా అతని ప్రయత్నములు సఫలములు