Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతి భౌతిక శాస్త్రము పడుట వ్యర్థము. అందుచేత సత్యాన్వేషణకు సత్తాన్వేష ణకు వేరువేరు విధానములను కలుగ జేసికొనవలెను. ఈశ్వరా న్వేషణ కూడ అట్టి విధానములనే ఉపయోగించి సాగించవలెను. విజ్ఞానశాస్త్రములను (sciences) ఇందు కొరకు ఉపయోగించుకొనవలెను. ఇట్లు ప్రస్తుతపు దార్శ నికులలో ఎక్కువమంది అభిప్రాయపడుచున్నారు. కాని ప్రకృతిశాస్త్రములకు (Natural Sciences) కూడ సత్తాన్వేషణ ఆవశ్యకము. కార్యకారణవిధానము అసత్య మైనచో ఏ శాస్త్రము పనిచేయలేదని ఇదివరకే సూచింప బడినది. ప్రతి శాస్త్రము తాను పరిశోధించు వస్తువునకు కారణము కని పెట్టును. ఇదియే దాని నిర్వచన పద్ధతి కార్యకారణ (method of explanation). నిజముగా ? భావమునకు సత్త లేనిచో శాస్త్రము నిష్ప్రయోజన మగును. ఉన్నచో దానిని సమర్థించుట ఎట్లు ? తత్త చ్ఛాస్త్రజ్ఞులు ఈ సమర్థనము చేయకపోయినను సత్యమని స్వీకరించియే తమ పని చేయుదురు. కానీ సత్తా శాస్త్రము, కార్యకారణ భావము సత్యమా అసత్యమా అనుదానిని రూఢిచేయును. అటులనే కర్మ సత్యమా అసత్యమా? అసత్యమైనచో ధర్మశాస్త్రము నిర్మూల మగును. అటులనే మానవబహుత్వము సత్యమా అసత్యమా ? అసత్యమైనచో సంఘశాస్త్రములు (Social Sciences) నిర్మూలములగును. సత్యమైనచో నేను చూచు వాడు నా సజాతి జీవుడని నేను ఎట్లు గ్రహింపగలను? ప్రత్యక్షముగా అతని ప్రాణమునుగాని, మనస్సునుగాని చూడలేను. నాకు కనుపించునవి అతని రంగు, ఆకృతి అనుమానమును పురస్కరించుకొని అతడు పురుషు డనుటకు వీలులేదు. ఏలన అనుమానమునకు ప్రత్యక్షము ఆధారము. ప్రత్యక్షముగా ఎక్కడైన ఇతరుల మనస్సు నేను చూచిఉండవలెను. కాని ఎక్కడను ఇది అసంభవము. నిరాధారమైన అనుమానము ఇతర మానవస త్తను ఎట్లు స్థాపింపగలదు? విజ్ఞానశాస్త్రములకు మూలభూతములై న యీ ప్రశ్నలన్నియు తత్త్వశాస్త్రము విమర్శింప వలయును. వర్తమాన యుగమున జడద్రవ్యము నిశ్చలముకాదని స్థిరీకరింపబడినది. మూలసత్త జడము కాదని, అది చైత న్యోపేతము, ఉత్తేజస్సంకలితము అయిన ప్రాణరూప 128 మని (life), అదియే కాలము (time) అని, బెర్గ్ సను బోధించెను. దానిస్వరూపము పరిణామిత్వము కాదు, పరిణామమే. అనగా, పరిణమించే వస్తువు ఒకటి, దాని పరిణామము వేరొకటి. బెర్గ్ సను మతానుసారము మూలసత్త ఒక వస్తువు యొక్క పరిణామము కాదు. పరిణామ స్వరూపమే. దానిస్వరూపము స్వభావముకూడ పరిణామమే. అది ఏదైనా ఒక ఆకృతి (pattern) స్వీకరించి నప్పుడు, ఆ యాకృతికి మనము ఒక పేరు పెట్టి ద్రవ్యము (substance) అని అందుము. బెర్గ్ సను వాదములోని ఈ పరిణామమాత్ర భాగ మునే వైజ్ఞానిక తత్త్వజ్ఞులు (Scientific Philosophers) త స్వీకరించిరి. ఐన్ ను అను భౌతిక గణితశాస్త్రవేత్త, e> కాలము దిక్కు వేరువేరు తత్త్వములు కావనియు, దిక్కాలమనునది space time ఒక టే తత్త్వమనియు, దానినుండియే ప్రపంచము ఉద్భ నిరూపించెను. వించినదని అలెగ్జాండరు వాదించెను. దిక్కాలము నుండి జడద్రవ్యము, జడద్రవ్యము నుండి ప్రాణికోటి, ప్రాణికోటినుండి చిత్తవంతములను (mental-beings) చిత్తవంతములనుండి సర్వేశ్వరుడు ఉద్భవించుట - ఇది దిక్కాలము యొక్క పరిణానుకృత్యమని ఆయన మతము. లాయడ్ మార్గము కొంచము అదేవిధముగా భోధించెను. ఈయన జడద్రవ్యముతో ప్రారంభించును. ఈశ్వరుని కూడ మొదట నే పెట్టి, అతనిని జడ ద్ర వ్య పరి ణా మమునకు ప్రేరకునిగా భావించును. వైటు హెడ్డు కూడ కొంచము ఈ మోస్తరు పరిణామము నే స్వీకరించెను. ఈయన అధునాతన సత్తాశాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు. గొప్ప గణితశాస్త్ర వేత్త. మూలసత్త అనునది ఘటనా సమూహము (events). అది మానవదృగ్గోచరము కాదు; అనుమేయము. ఈ ఘటనలు (events) ఒక సంప్రదాయమును, ఒక ఆకృతిని అనుసరించినచో స్థాయి ద్రవ్యము ఉద్భవించును. మన పూర్వకాలికులు చెప్పిన పరమాణువులు ఘటనాసమూహములు. అవి అవిభాజ్య ములు కావు; అవి భేద్యములు కావు; అవి ఖాజ్యములు; అవి భేద్యములు; క్షణికములగు ఘటనలు మాత్రమే. ఈశ్వరుడు వీటిని సంఘములుగాను, సంప్రదాయములు గాను ప్రవాహాకృతిని పొందుటకు ప్రేరేపించును. .