Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనగా సామాన్య వాక్యము. ధూమమునుండి అగ్నిని అనుమానము చేసినప్పుడు అగ్ని ధూమమునకు సర్వత్ర సర్వదా కారణమని ఒప్పుకొనియే అనుమానము చేయుదుము. కాని ఎవడు సర్వాగ్నులను సర్వత్ర సర్వదా చూచిన వాడు? లేనప్పుడు, మన జ్ఞానము సర్వము సంశ యాస్పదమగును. తత్ఫలితము సంశయతాసిద్ధాంతము (skepticism). ఈ ఫలితమును తొలగించుటకు కాంటు పూనుకొని ప్రపంచానుభవమునకు కారణములు రెండని, అవి అంతఃకరణము వస్తు స్వనత్త (thing in itself) అని చూపెను. కాంటు అంతఃకరణమునకు మూడు భాగములు అని చెప్పెను. అవి ఇంద్రియ వేదన (sensation) (వేదన అను పారిభాషిక పదమును బౌద్ధులు వాడుదురు). మనో వృత్తి, బుద్ధివృత్తి, వస్తంతఃకరణముల సంయోగము వలన సర్వ ప్రపంచము ఉద్భవించును. కేవలము వస్తువు గాని, కేవలము అంతఃకరణముగాని ప్రపంచమునుసృజింప నేరదు. “ఆత్మా మనసా సంయుజ్యతే మన ఇంద్రియేణ | ఇంద్రియ మర్థేన తతః ప్రత్యక్షం” అన్నట్లు వస్తు స్వసత్త ఇంద్రియముల ద్వారా అంతఃకరణముతో సంబంధమైన ప్పుడు ఇంద్రియచేతన ఉద్భవించును. ఇంద్రియచేతనలే దృశ్య ప్రపంచము యొక్క ద్రవ్యసామగ్రి. కాని మైనము ముద్రలను స్వీక రిం చునట్లు అంతఃకరణము ఇంద్రియ వేదన లను స్వీకరింపదు. వాటిని తన ద్వారముల ద్వారా తీసి కొనుచు వాటికి తన రూపములను ఇచ్చును. అట్లు చేయని ఇంద్రియచేతనలు ఈ రూపములు. ఈ రూపములు మూడు విధములు. ఇంద్రియచైతన్యరూపములు, మానసచైతన్య రూపములు, బుద్ధిచై తన్య రూపములు (forms of sensa- tion, understanding and reason) మొదటివి దిక్కాల ములు (space and time). ప్రతి ఇంద్రియచేతనను అంతః కరణము దిక్కాలములద్వారా లోపలికి ప్రవేశ పెట్టు కొనును. అందుచేత ప్రతివస్తువు దిక్కాలనియమితమైనట్టు మన అనుభవము. దిక్కాలరూపితములైన ఇంద్రియచేత నలకు అంతఃకరణము మనస్సుద్వారా ద్రవ్యగుణ, కార్య కారణాది రూపములను ఇచ్చును. అందుచేత మనము ప్రతివస్తువును కార్యముగను, కారణముగను, ద్రవ్య ముగను, గుణముగను, అనుభవగోచరము చేసికొందుము. అనుభవ విషయములనన్నింటిని బుద్ధి సంచితముచేసి, 127 Q అతి భౌతిక శాస్త్రము ఏకీకృతముచేసి, పరస్పర సంబంధములు కల్పించి, ఏకవస్త్వంగములుగా నిరూపించును. ప్రపంచములోని నియామక సూత్రములన్నింటికి అంతఃకరణమే మూలము. పద్ధతిబద్ధమైన ప్రపంచము అంతఃకరణ సృష్టము. అందు చేత అంతఃకరణము, ఆ నియామక సూత్రములను తదా ధారములైన వ్యా ప్తులను తెలిసికొనగలదు. తత్కారణ ముగా శాస్త్రజ్ఞానము అసంభవము కానేరాదు. ఈ ప్రపంచకము యాదృచ్ఛికముగాక, సూత్రబద్ధ మైనది. ఈ సూత్రములు బుద్ధినిర్మితములగుట చేత ప్రపంచము గూడ బుద్ధినిర్మిత మే . బుద్ధికిగోచరము కానిది, ఇంద్రియ చేతనలకు కారణమైనది. వస్తుస్వస త్త (Thing in itself) అను నది వేరొకటిలేదు. దృశ్య ప్రపంచము వెనుక అదృశ్య ప్రపంచము వేరొకటి ఒప్పుకొనము. వ్యావహారిక సత్త అని, పారమార్థిక సత్త అని, రెండుసత్తలులేవు. సత్త అన్నది బుద్ధిగ్రాహ్యము; బుద్ధినిర్మితము. స్వారాయ తసత్తాక మైన వస్తువు ఒకటి ఉన్నదని కాంటు పొరపాటు బడెనని హెగెలు వాదించెను. బుద్ధి నిరూప్య మే సత్త, సత్తయే బుద్ధినిరూప్యము. (The rational is real, and the real is rational). బుద్ధి యొక్క అంతరంగ తత్త్వములను (Categories) తెలిసికొనినచో ప్రపంచస్వభావమును తెలిసి కొనగలము, బుద్ధికి ఏకసత్తాన్వేషణయే పరమగతి. ఏక సత్తావాదమే సత్యము (Monism) పరమాత్మస్వరూపమే (Absolute consciousness) ఏక సత్త. హెగెలు ప్రపంచపు దార్శనికులలో మొదటి తరగతిలోనివాడు. ఆయన ప్రభా వము రమారమి మాట ఏబది సంవత్సరములు ప్రపంచము మీద వ్యాపించెను. మార్క్సు కూడ ఆయన సిద్ధాంతమును మార్చి స్వీకరించెను, కాని హే గెలువాదము ప్రత్యక్ష ప్రాధాన్య వాదులకు నచ్చలేదు. బుద్ధి స్వభావమును గ్రహించినను ప్రపంచ స్వభావమును గ్రహింపలేము. ప్రత్యక్షము, ప్రత్యణాధారమయిన అనుమానము అవసరములు. జడద్రవ్య స్వభావము భౌతిక విజ్ఞానము వలనను, జంతు స్వభావము జంతుశాస్త్రము వలనను, మనఃస్వభావము మనశ్శాస్త్రమువలనను, ప్రత్యక్షమును, అనుమానమును, యంత్రములను (instruments of knowledge) ఉపయో గించియు తెలిసికొనవలెను. బుద్ధిమీద మాత్రము ఆధార