Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతి భౌతిక శాస్త్రము మిక్కిలి తక్కువ వికాసముకల వాటిని జడము లని, ఎక్కువ వికాసములు కలవాటిని మానసములని మనము తెలిసికొందుము. ఈశ్వరుడుకూడ ఒక మొనాడుమాత్రమే. అతడు మొనాడులన్నిటిని సృజించినపుడు పరస్పరసంగతి (harmony) దృష్టితో సృజించెను. గడియారము చేయు వాడు అన్ని గడియారములు ఒకే సమయమును చూపు నట్టు ఏలాగుచేయునో, అలాగే ఈశ్వరుడు గూడ ఒకే విధమైన ప్రపంచజ్ఞానమును, పొందునట్టు మొనాడులను సృజించెను. వీరందరు హేతు ప్రాధాన్య వాదులు (rationalists) అని పిలువబడుదురు. సత్యము వస్త్వ పేక్షి తముగాని, బుద్ధ్య పేక్షితము గాదని ఇంగ్లాండులో బేకను తన సిద్ధాంతమును వెల్లడించెను. ప్రపంచమున ఏ ఏ సత్తలు కలవు? అవి ఎన్ని విధములు ? ఏ స్వరూపములు కలవి ? అను విషయము బుద్ధి యొక్క స్వరూపమును, స్వభావమును పరిశీలించినంతమాత్రమున తెలియదు. అది ప్రత్యతానుభవమువలననే తెలియగలదు. ప్రపంచములో ? ఏ అయిదు మహాభూతములు కలవా ? అరువది భూతములు కలవా? అరువదికంటే హెచ్చుగా నున్నవా ? అను విష యము బుద్ధిని పరిశీలించిన మాత్రమున ఎట్లు తెలిసికొన గలుగుదుము? అందుచేత ఇంద్రియ జ్ఞానాధారమే సర్వ జ్ఞానము. ఈ మతమునకు అనుభవ మూలవాదము (empiricism) అని పేరు. బేకను గొప్ప దార్శనికుడు కాడు. అయినను అతడు ఈ వాదమునకు పునాది వేసిన వాడు. దీనిని పురస్కరించుకొని లాకు, బెర్కిలీ, హ్యూము అనువారు తమ దర్శనములను నిర్మించిరి. ప్రత్యణానుభవ మే ప్రధానమైనచో లై బిడ్డు చెప్పిన ప్రకా రము అంతరంగముగా బుద్ధివి కాస మే సత్యమును నత్తను తము చేయజాలదు. అదియునుగాక జాతిజ్ఞానము (knowledge of the universal) ప్రత్యక్షోద్ధృత మేగాని ప్రత్యక్ష కారకముకాదు; బుద్ధ్యంతరంగోద్ధృతము కాదు. మనము పెక్త్రుమంది మనుష్యులను చూచి, వారి సామాన్య గుణములను సంగ్రహించి, ఆ గుణసంపుటికి మనుష్యజాతి పదము వాడుదుము. మనుష్యజాతికి మనుష్య వ్యక్తి సత్తాభిన్నమైన వేరొక సత్తలేదు. వేరుగా మనము వాడి నప్పుడు అది నామమాత్రము, బుద్ధ్యాకృతి మాత్రము, మనోవృత్తి మాత్రము అని లాకు వాదము. 126 లాకు ప్రారంభించిన వాదమును బెర్కిలీ విస్తరించెను. అనుభవైక వేద్యమే సత్త అయినచో జడ ద్రవ్యము యొక్క సత్త ఏ అనుభవము యొక్క గోచరము? నారింజ కాయ ఆకుపచ్చగాను, పుల్లగాను ఉన్నదని, రంగు యొక్కయు రుచి యొక్కయు సత్త నారింజ కాయయందు ఉన్నదని, నారింజ కాయ ఈ రంగుకు రుచికి ఆధారమని భావిం తుము. కాని నా కన్ను రంగు గ్రుడ్డి అయినచో రంగు కనిపించదు. పైత్య భూయిష్ఠమైనచో సర్వము పసుపుగా కనిపించును. అందుచేత రంగు నా మానసిక వృత్తిగాని, విషయవృత్తి గాదు. అలాగుననే పులుపు గూడ మానసిక వృత్తియే. ఈ గుణము లన్నిటికి భిన్నమైన నారింజయను జడద్రవ్యమును చూచినవాడెవ్వడు ? జడద్రవ్యము గుణాధారమని అందురు. గుణములు మాత్రమే ప్రత్యక్ష ములు. తదాధారము ఎవ్వరికి గోచరము కాదు. తదుపరి గుణములు మానసిక ములు. అందుచేత జడద్రవ్యము అసత్య ప దార్థము. దానికి సత్తలేదు. సత్త సర్వదా మానసిక ద్రవ్య మే. బెర్కిలీ జడద్రవ్యమును నిరాకరించినరీతినే హ్యూము మానసద్రవ్యమును కూడ నిరాకరించెను. జడద్రవ్యము ప్రత్యక్ష వేద్యము కానిచో మానసద్రవ్యము మాత్రము ప్రత్యక్ష వేద్యమా? పంచజ్ఞానేంద్రియములలో దేనికిని మానసము ప్రత్యక్షము కాదు. నేను నా అంతరంగమున చూచినప్పుడు కొన్ని భావములు, సుఖ దుఃఖములు, జ్ఞాన ములు, కల్పనలు 'మొదలగునవి ప్రత్యక్షమగును గాని మనస్సు మాత్రము ప్రత్యక్షముకాదు. అందుచేత మనో ద్రవ్యమనునది ఉన్నదని రూఢిచేయలేము. అటులనే జాతిపద విషయములకు (universals) వ్యాప్తులకు (universal judgments) సత్త ఉన్నదని సత్త ఉన్నదని నిర్ధారణ చేయలేము. దేని సత్త అయినను, ఇంద్రియ విషయము అయినగాని, తత్సంబద్ధము అయిన గాని ఒప్పుకొనబడదు. అయినచో ఈశ్వరునికి సత్తలేదా? ఆత్మకు సత్తలేదా? కార్యకారణభావము అసత్యమా? కార్యకారణభావమే అసత్యమయినచో శాస్త్రజ్ఞాన మే అసంభవమగును. శాస్త్ర ముల నిర్వచనములన్నియు దానిమీద నే ఆధారపడి యున్నవి. లేనిచో ప్రపంచకమంతయు యాదృచ్ఛిక మగును. కార్యకారణద్యోతకము వాప్తివాక్యము;