Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మయినను ప్రత్యక్షకృత విషయమందే అది ఉండునని చెప్పెను. తర్వాత మధ్యయుగము లందలి దార్శనికులు ప్రపంచసత ఈశ్వరస త్తనుండి వేదితవ్యమని నుడివిరి. కాని నవీన యుగమన ప్రకృతిసత్తాస్వరూప గ్రహణము ఈశ్వర సత్తాస్వరూపమును గ్రహింపవలెనని దార్శనికుల అభిప్రాయము.

పదునారవ శతాబ్దమున డెకార్డు ప్రతి ప్రత్యక్షము సంశయాస్పదమని ప్రారంభించెను. నేను చూచుచున్న వస్తువు లన్నియు స్వప్న తుల్యములు ఎందుకు కాకూడదు ? ఎవడైనా ఒక మాయావి యీ దృశ్యములను సృష్టించు చున్నాడేమో ? నేను చదువుచున్న పుస్తకము నిజమైన పుస్తకము ఎందుకు కావలెను ? అది నిజమైనని నిర్ధా రణ చేయుట ఎట్లు ? కనుక ప్రతి జ్ఞానము సంశయ విషయము అయినచో సత్తారూపమును నిర్ణయించుట ఎట్లు ? 'నేను సంశయించుచున్నాను” అనుచోట సంశయకర్త నిజము కావలెను. సంశయ విషయము నిజము కాకపోవచ్చును. అందుచేత సత్తాశాస్త్రము " నేను ” నుండి ప్రారంభము కావలెను. అయితే "నేను” అనునది ఉత్పన్న వస్తువు : కార్యముగాని, నిత్యము కాదు, ప్రతి కార్యమునకు కారణ ముండవలెను. ప్రతి మానవునకు మాతాపితరులు కారణభూతులు; వారికి వారి మాతాపితరులు. ఇట్లు అనంతముగా కార్యకారణ నిరూపణము సాగును. ఇది సొంతము కావలెనన్నచో అందరికి ఈశ్వరుడే కారణభూతుడని చెప్పవలెను. ఈశ్వరుడు పరంపరగా ఆ జ్ఞానమునకు కూడ కారణ భూతుడు. ఆయన నిష్కపటి, వాత్సల్య స్వరూపుడు. అందుచేత మానవులకు మాయాదృశ్యములు చూపించి మాయ చేయడు. తత్కారణముగా మానవుల జ్ఞానములు యథార్థములు. మనము మనస్సును రాగాది దోషముల నుండి శుద్ధము చేసినచో యథార్థమునే సర్వదా తెలిసికొందుము. డెకార్డు సర్వసత్త ద్రవ్యస్వరూపమని భావించెను. ఈ ద్రవ్యము రెండు విధములు, జడము, మానసము. జడ ద్రవ్యస్వరూపము విస్తృతత్వము, మానసద్రవ్వస్వరూ పము జ్ఞానము. ఈ రెంటికి సామాన్య గుణము ఏదియు లేదు. జడము చలనహీనము. మానసము చలనసహితము. 125 అతి భౌతిక శాస్త్రము డెకార్డు సిద్ధాంతము స్పినోజాకు నచ్చలేదు. వస్తుజ్ఞానో త్పత్తి మానసజడ ద్రవ్యసంయోగము వలన కలుగును. గాని అవి ఏకాంతభిన్నములయినచో ఎట్లు జ్ఞానోత్పత్తి కొరకు కలిసికొనగలవు? సంయోగశీలత వస్తువులకు సామాన్యగుణము ద్వారానే కలుగగలదు. మనస్సునకు జడపదార్థమునకు సం యోగసంబంధ శీలత లేనపుడు జ్ఞానము అసంభవము. కాని జ్ఞానము సర్వజన వేద్యము. అందుచేత మనోజడములు ఏకాంతభిన్న ద్రవ్యములుకావు. ద్రవ్యము ఒక్కటియే, అది ఈశ్వర స్వరూపము. దానికి పెక్కు విశేష గుణములు కలవు. వాటిలో రెండు మనస్సు, జడత. కాగితము యొక్క రెండు ప్రక్కలవలె ఈ రెండును పరస్పరా పేద కలవి. ఒక దానిలో మార్పు కలిగినప్పుడు రెండవ దానిలో తదుచితమైన మార్పు కలుగును. ఈ మార్పు మానసమున జ్ఞానాకారము పొందును. జంతుకోటియు, జడవస్తుకోటియు ఈశ్వరుని విశేషగుణముల విశేషణములు (modes). ద్రవ్యము ఒక్కటియే అను సిద్ధాంతము లైబ్నిగ్జు స్వీకరింపలేదు. ద్రవ్యము ఒక్కటే అయినచో మానవుల వేరు వేరు అనుభవములకు కారణము ఏమి? వారివారి స్వతంత్ర కర్మలకు కారణమేమి ? అందుచేత ద్రవ్య బహుశ్వము స్వీకరించవలెను. అదియునుగాక మానసము ఒక టే మాత్రము చలనశీలము కాదు. జడ ద్రవ్యము కూడ చలనశీలమే. దానిలోను శక్తి (force) ఉన్నది. చలన శీలత మానసత్వసూచక మైనచో జడద్రవ్యము కూడ మానసమే. అది అనావిర్భూతమానసము. ప్రపంచమున కేవల జడమాత్రమనునది లేదు. సర్వము అణుపరి మిత మానసో వేతము. ఈ మనస్సులకు లై బిడ్డు మొనాడులు (monads) అని పేరిడెను. అవి అణువులకంటే చిన్న వై నను మహత్తుకంటే మహత్తరములు. వాటికి పరస్పరము ఏ జోక్యములేదు. అయినను. ప్రతి మొనాడు ప్రపంచమునంతటిని " ఆంతరంగికముగానే గ్రహించును. బహిర్ముఖముగా చూచుటకు దానికి కిటికీలు లేవు. (The monads are windowless) జ్ఞానము బహిర్వస్తుజనితము కాదు. అంత రంగిక వికాసము. ఈ వికాసము కొన్ని మొనాడులలో ఎక్కువగాను, కొన్నిటియందు తక్కువగాను ఉండును.