Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతి భౌతిక శాస్త్రము కొన్ని నిముసములలో అది విచ్ఛిన్నమయి చెదరిపోవును. అయితే యింత విపరీతపు నాశనమునకు కారణము ఈ వేడియే కాదు, ఈ అపరిమితమైన వేడిమివలన గాలిలో గొప్ప యొత్తిడికలిగి, ఆ విపరీతపు ఒత్తిడి వలన నూరు తుపానులు ఒకేసారి వచ్చినప్పటి వాయువు కెరటపు (Shock wave) శక్తి కలిగి, అది గోడలు, ఇండ్లు ఒక్క సారి భూమట్టము చేయును. దీని పెను వెంటనే గామా కిరణములు మనుష్యుల శల్యములలో ప్రవేశించి ప్రాణ ములు తీయును. మొత్తముమీద నాలుగైదు చతురపు మైళ్ళలో నున్న ఏ జంతుకోటి కూడ మిగులదు. యురేనియం అణువుల పగు మీద చెప్పబడిన బాంబు లుడు వలన తయారు చేయబడినది. బరువు అణువు పగిలి మిగిలిన తునుక అణువుల రాశి తక్కువగా మండుటవలన ఆ భేదరాశి శక్తిగా మారును. ఇంకొక విధముగా కూడ శ క్తి ఉత్పత్తి అగునని మీద నిరూపింపబడినది. హైడ్రోజన్ అణువులనుండి హీలియం అణువులు తయారు అయిన ప్పుడు కూడ శక్తి ఉత్ప త్తి అగును. కాని ఈ శక్తికి కోటి డిగ్రీల వేడిమి అవసరము. ఆ వేడి యురేనియం 285, ప్లుటోనియం బాంబువలన కలుగ జేసినచో హైడ్రొజన్ బాంబును పేల్చవచ్చును. ఈ బాంబునకు నాశన మొనర్చు శక్తి యింకను హెచ్చు. ఈ బాంబులు ప్రేలునప్పుడు అక్కడి ప్రదేశము నాళన మగుటయే కాక, విష కిరణములు ఉత్పత్తి అయి వాయువువలన అవి వ్యాపించి, చుట్టుపట్లనున్న ప్ర దేశము లను కూడ నాశనమొనర్చును. ఇంకొక ప్రపంచయుద్ధము జరిగి ఈ ఆటంబాంబులు ఉపయోగింపబడినచో మన భూప్రపంచమంతకు ప్రమాదము వచ్చునని వేరుగా చెప్ప నక్కర లేదు. జె. సి.కా.రా. అతి భౌతిక శాస్త్రము :- మోటా ఫిజిక్సు అను శబ్దము తొలుత అరిస్టాటిల్ చేత ఉపయోగింపబడెను. మెటా అనగా పరము, ఫిజిక్సు అనగా భౌతిక శాస్త్రము, భౌతికత త్త్వమునకు పరమైన తత్త్వము యొక్క శాస్త్రము మెటా ఫిజిక్సు. దీని ముఖ్యోద్దేశము సత్త యొక్క స్వరూపమును నిరూపించుట. అందుచేత దీనిని పార భౌతిక శాస్త్రమని, సత్తాశాస్త్రమని, తత్త్వశాస్త్రమని కూడా పిలువవచ్చును. "తత్" అనగా, "అది" అనగా సత్తయే. అందుచేత సత్తకు, త త్త్వమునకు అర్థము ఒక్కటిగానే గ్రహింపవచ్చును. అరిస్టాటిలు అర్థము ఏమయినను ప్రస్తుతము ఈ శాస్త్రమును ప్రమాణశాస్త్రమునుండి, తర్కశాస్త్రమునుండి విడదీయుటకలదు. సత్తాశాస్త్రము సత్తా స్వరూపమును, ప్రమాణశాస్త్రము సత్య స్వరూప మును, తర్కశాస్త్రము అనుమాన పద్ధతిని నిరూపణము చేయును. 6 6 సత్యము (truth) అనునది జ్ఞానమునకు చెందినది. "కలము నల్లగా ఉన్నది" అను వాక్యమునందు " ఉండుట ” కలమునకు చెందినది. కలము నిజముగా ఉన్నచో ఈ వాక్యము సత్యము; ఎఱ్ఱగా ఉన్నచో అసత్యము. అందుచేత సత్యాసత్యములు వాక్యమునకు చెందును. ఒకప్పుడు మనము వాక్యమును ఉచ్చరించక పోవచ్చును. అయినను, "కలము నల్లగా ఉన్నది" అను ప్రత్యక్షజ్ఞానమందు కూడ సత్యాసత్యములు ఉన్నవి. ఉదాహరణము రజ్జుసర్పజ్ఞానము. రజ్జువును చూచి సర్ప మని అనుకొనవచ్చును. సత్యమునకు ప్రమ అని, అసత్య మునకు భ్రమ అని పర్యాయములు. ఇప్పుడు సత్తాశాస్త్రము అను పదము అన్ని శాస్త్ర ముల సంపుటికి ఉపయోగించు వాడుక కలదు. ద్రవ్య స్వరూపము, కార్యకారణ స్వరూపము, ధర్మస్వరూపము, జీవ స్వరూపము, ఆత్మస్వరూపము, ప్రపంచ స్వరూపము, టూకీగా సర్వ సత్తాస్వరూపము నిర్ణయించు శాస్త్రము సత్తాశాస్త్రము. వస్తుసత్త జ్ఞానవేద్యమయినప్పుడే గుర్తించబడును గనుక, సత్తాశాస్త్రమునకు, సత్యతాశాస్త్రమునకు సంబం ధము గలదు. సత్త సత్యమయినప్పుడే సత్త యగును. లేనిచో అసత్తయే. అందుచేత సత్తాశాస్త్రము చదివి నప్పుడు సత్యతాశాస్త్రముకూడ చదువవలసి యున్నది. పరస త్త అనేది ఒకటి ఉన్నదా? ఉన్నచో దానిని ఎట్లు తెలిసికొనుట? అను ప్రశ్నలు సత్యతాశాస్త్రము యొక్క విషయములు. మొట్టమొదట యూరోపు దేశమున ప్లేటో వస్తున త బుద్ధి (reason) గోచరముగాని, ఇంద్రియ (sense) గోచరము కాదని అనెను. అరిస్టాటిలు బుద్ధి గోచర 124.