Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆణుబాంబు దానికి రెండు మూడు మార్గములున్నవి. కాని ప్రతి మార్గము గొప్ప వ్యయ ప్రయాసములమీద ఆధారపడి యున్నది. విస్తార ధనవ్యయముతోకూడిన పని. అయినను అత్యంతమైన అవసరము వలన గత యుద్ధమందు ఆ పని నెరవేర్పబడినది. ఇంకొక సంగతి :- యు రేనియం 288 యందు వేగముగల న్యూట్రానులను ప్రయోగించినచో, అది సోపానక్రమముగా చతుర్ని వాతువు (ఫ్లూటోనియం) అను ఇంకొక క్రొత్త అణువు క్రింద మారును. ఈ ఫ్లూటో నియం కూడా న్యూట్రానులవలన సులభముగా భేదింప బడి గొప్ప శక్తినిచ్చును. అందువలన యురేనియం 285 తోపాటు ప్లూటోనియం కూడ అణుబాంబునకు మిక్కిలి అవసరమైన పదార్థము. ఈ రెండు పదార్థములు మంద గతి న్యూట్రానుల వలన భేదింపబడగలవు. భేదింపబడుట యేకాక ఆ పగులుడు (Fission) లో న్యూట్రానుల వరకు కూడ ఉత్పత్తి అగును. కాని ఇట్లుత్పత్తియగు న్యూట్రానుల వేగము చాలా ఎక్కువగా నుండును. సాధారణపు మందుగుండు బాంబువలెగాక యీ అణు బాంబు పేలుడుకు వ్యవధి మిక్కిలి తక్కువ. కాలము సెకండులో పదిల తల వంతు. సామాన్యపు బాంబుకు సెకండులో వెయ్యి వంతు. ఇంత త్వరితముగా జరుగు టకు న్యూట్రానులు అత్యధికముగా ఉత్పత్తి కావలెను. పైనచెప్పిన ప్రకారము యూరేనియం 285 పగిలినచో రెండు న్యూట్రానులు బయలు దేరవచ్చును. ఆ రెండును మరినాల్గింటిని ఉత్పత్తి చేయును. ఇటుల డెబ్బది పురుషాంత రాలకు పదివేలకోటి కోట్లు న్యూట్రానులు సృష్టి ఆగును. వీటివలన తయారగుళక్తి పదిటన్నుల T. N. T మందుగుండునకు సమానము. కాని ఒక ఆటంబాంబుశక్తి యిరవై వేల T.N.T తో సమానము. అందుకుగాను ఇంకొక పదిపురుషాంతరాలు అవసరము, ఇంత తొందరగా వెళ్ళుచున్న న్యూట్రానులు ఇంత అధికమగుటకు వలసిన కాలము ' సెకండులో పైనిచెప్పినట్టు పదిలక్షలవంతు మాత్రమే. ఇంత తక్కువ కాలములో వ్రేలుడు జరుగవల యును. కానీ నిజమునకు న్యూట్రానులు ఇంతత్వరితముగా అధికముకావు. ఎందుచేతననగా అందులో కొన్ని తక్కిన అణువులవలన పీల్చుకొన (absorb)బడును. కొన్ని పదార్థ మును విడిచి పై కిపోవును. అయితే ఇన్ని విధములుగా 123 నష్టపడినను అణువు పగులుడు (Fission) వలన ఒక న్యూట్రానుకు ఎక్కువమొత్తముపైన ఉత్పత్తి అయిన యెడల ఈ పరంపరా సంఘటనము (chain reaction) జరుగుటకు పూర్తి అవకాశము కలదు. పైన చెప్పిన విషయములనుబట్టి కొన్ని సంగతులు విళద మైనవి. యూరేనియం 285, ఫ్లుటోనియం, న్యూట్రా నులవలన భేదింపబడి అత్యల్ప కాలములో గొప్పశక్తిని ఇయ్యగలవని నిరూపింపబడినది. అయితే యీ వేలుడుకు యురేనియంముద్ద కొంత అవధిపరిమాణము ఉండ వలెను. ఆ ముద్దను రెండుతునుకలు చేసి ఆ రెంటిని దగ్గరకు తీసుకొని వచ్చుటలో న్యూట్రానులు ఉత్పత్తిఅయి పైని చెప్పినట్టు అతిస్వల్ప కాలములో ప్రేలును. ఆముద్ద కొన్ని పౌనులుండవచ్చునని అంచనా వేయబడినది. ఆ రెండు ముక్కలను ఎట్లు దగ్గరకు తీసుకొనివచ్చుట అనునది ఇంకను రహస్యముగా నున్నది. ఈ సందర్భములో కొన్ని ఆర్థిక పరిస్థితులను గమనించుటయుక్తము, మొదటి ఆటం బాంబుకు రెండువందలకోట్ల డాలర్లు వ్యయమైనట్టు తెలిసినది. అనగా అదిమన ఇండియా కేంద్ర, రాష్ట్రముల రెండుసంవత్సరముల ఆదాయము. ఆబాంబు తయారు అగుటకు ముఖ్యకారణము యుద్ధపు ఒత్తిడి. అనగా జర్మనులు ముందుతయారు చేయుదురేమోఅని భయము. శాంతిసమయములో ఐతే ఆ బాంబును తయారుచేయు టకు ఏ పదునైదు సంవత్సరాలకాలమో పట్టియుండెడిది. కాని యుద్ధసమయము అగుటవలన అది మూడు నాలుగు సంవత్సరములలోనే సాధింపబడెను. సర్వశక్తులు దీని క్రింద వినియోగింపబడెను. అటువంటి పని ధనముతో తులతూగుచున్న అమెరికాలో మాత్రమే సాధ్యము. తరువాత రమారమి అటువంటి పరిస్థితు లుండుట చేతనే రష్యాలో కూడ ఆ పని సాధ్యమయ్యెను. ఈ బాంబునకు గల నాశనశక్తికి హిరోషిమా, నాగ సాకి పట్టణములు నిదర్శనము, బాంబు ప్రేలుడువలన కలిగెడు వేడి యొక్క ఉగ్రత కోటి డిగ్రీలు. అనగా సూర్యునిలోనున్న ఉష్ణోగ్రతకు దగ్గరదగ్గరగా సమాన మన్నమాట. ప్రేలుడు వలన ఉత్పత్తి అయ్యెడు అగ్ని గోళము నూరు అడుగులుండును. అది మేఘమువలె పైకిలేచి కుక్కగొడుగు యొక్క రూపమును దాల్చును.