Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ణుబాంబు మహత్తరమైన ధనవిద్యుత్తును కలిగియుండును. ఆల్ఫా కిరణములు కూడ ధనవిద్యుత్తును కలిగియుండుటవలన వాటిశక్తి ఎంతో ఎక్కువగా ఉండినగాని బీజముచుట్టును ఉండు విద్యుత్ - మండలమును దాటి బీజమును భేదింప లేదు. అందుకు ఆల్ఫాకిరణశ క్తి చాలదు. 1982 లో ఛాద్విక్ అను బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు బెరిలియం అను పదార్థమును ఆల్ఫాకిరణములచే భేదించి న్యూట్రాను (Neutron) అనుకొ త్తకణము (particle)ను కనిపెట్టెను. ఈ కణములు విద్యుత్ రహితముగా నుండి, శ క్తిమంత మగుటవలన తతిమ్మా అణువుల చుట్టును ఉండు విద్యుత్ మండలము ప్రవేశించుటకు ఏ మాత్రము అడ్డులేకుండెను. ఏ అందువలన క్లీబాణువులు (న్యూట్రానులు) ఏ అణువులను పగులకొట్టుటక యిన మిక్కిలి ఉపయోగ కారులు గా నుండు నని తెలియవచ్చెను. 1988లో రెండవ ప్రపంచయుద్ధపు ప్రారంభములో ఓటోహాన్ అను జర్మను రసాయన శాస్త్ర జ్ఞుడు యురేనియంఅణువులను క్లీ కాణువుల (న్యూట్రాన్) వలన పగులగొట్ట గలిగెను. హాన్ విజ్ఞాని, యురేనియం పరమాణువు పగిలి బేరియం, లాంథనం పరమాణువుల క్రింద మారినట్లును, అవి అతి శక్తిమంతములై యున్న ట్లును కనుగొనెను. అదియును గాక ఈ క్రియ యందు రెండు క్రొత్త క్లీ బాణువులు ( న్యూట్రానులు ) ఉత్పత్తి అయినట్టు తేలినది. ఇదే గొప్ప విషయము. ఈ క్లీ బాణు వులు తిరిగి యురేనియం అణువులను బ్రద్దలుచేయుటకు పనికివచ్చును. బ్రద్దలు అయిన తునుకులు కూడ బహు శక్తి మంతములుగా నుండును. ఆ శక్తి అంతయు వేడిగా మారును. ఇట్లు గొలుసుకట్టుగా మార్పుచెంది యు రేనియం అంతయు భిన్న భిన్న అణువులుగా మారి బ్రహ్మాండమైన వేడిమిని ఉత్పత్తిచేయును. ఇదియె ఆటంబాంబు యొక్క మూలసూత్రము. ఈసందర్భములో ద్రవ్యరాశి (Mass), శక్తి (Energy). వీటిని గురించి కొంచెము తెలిసికొనవలసియున్నది. బహు కాలము వరకు ద్రవ్యరాశి నిత్యత్వము, శక్తి నిత్యత్వము (Conservation of Mass and Energy) అను రెండు ప్రత్యేక సిద్ధాంతము లుండెడివి. కాని ఐన్ స్టయిన్ అను మహా తత్త్వవేత్త ఆ రెంటిని మేళవించి ఒక సిద్ధాంత మును చేసెను. ఆ సిద్ధాంతము ప్రకారము ద్రవ్యరాశి E=mc" ప్రకారము శ క్తిగా మారవచ్చును. దీని ప్రకా రము ఒక గ్రాముపదార్థములో రెండున్నర కోట్ల కిలో వాట్ గంటలకు సమానమైన శక్తి యిమిడి ఉన్నదని తేలును. (విద్యుత్ ఉన్న ఇండ్లలో ఉన్న మీటర్ తెలుపు ప్రమాణము కిలో వాట్ గంట). దీనినిబట్టి రసాయనిక ము లయిన మార్పుల వలన కలిగిన శక్తి కంటే అణువుల మార్పు వలన కలిగెడు శక్తి పదిలక్షల రెట్లు అధికముగా ఉండునని విశదము కాగలదు. రెండు పరమాణువులు కలిసి వేరొక పరమాణువుగా మారి, దీని రాశి ఆ రెండు పరమాణువుల కంటె తక్కువ అయినచో, ఈ తక్కువయిన రాశి శక్తిగా మారును, ఉదా: హీలియం వర మాణువును గాని, ఆల్ఫాకిరణమును గాని పరిశీలించినచో అందులో రెండు ప్రాణువులు ( ప్రోటానులు ) రెండు క్లీ బాణువులు (న్యూట్రానులు) ఉండును. లేక నాలుగు ఉదజని ( హైడ్రొజన్) పరమాణువులై నను ఉండవచ్చును. వాటి రాశికి హీలియం (యానాతి) రాశికిని భేదము అందువలన ప్రతి హీలియం అణువు నాలుగు హైడ్రొజన్ అణువుల నుండి ఉత్ప త్తిఅయినచో ఇంత విపరీ తపు శక్తి ఉద్భవించును. మన సూర్యునిలో వేడిమిశక్తి ఈ రీతిగానే ఉత్పత్తి అగుచున్నట్లు శాస్త్రజ్ఞుల నమ్మకము. 122 కలదు. అణువులలో కెల్లను యురేనియం అణువు మిగుల బరువు కలది. ఆ అణువుమీద న్యూట్రాన్ ప్రయోగించి నచో అది రెండు తునుకలుగా పగులును, ఆ తునుకల రాశి అసలు అణువు రాశికంటె తక్కువ. అది శక్తిగా మారును. అయితే ఇంత శక్తి ఉద్భవించుటకు కొన్ని షరతులున్నవి. న్యూట్రాన్ వేగము మందముగా నుండ వలెను. ఇంకొక సంగతి కిరణాతువు (యురేనియం)లో రెండు తరగతుల అణువులున్నవి. 1. యురేనియం 238 రాశి అనియు, 2. యురేనియం 285 రాశి అనియును. రెండవది సాధారణపు యు రేనియంలో 189 వ భాగము మాత్రమే. ఈ తేలిక యురేనియమే మందగతి క్లీ బాణు వుల(న్యూట్రానుల) వల్ల భేదింపబడును. కాని యురేనియం 288 అంతసులభముగా భేదింపబడదు, రెంటికిగల ఈ భేదము బోర్ మహాశయుడు మొదట నిరూపించెను. అయితే యురేనియంలో నున్న ఈ రెండు తరగతుల అణువులను వేరుచేయుట మిక్కిలి కష్టసాధ్యమైన పని.