Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేపాక్షి బసవన్నను ఎన్నికోట్లమంది చూచుచుండుట లేదు ! కాని బాపిరాజుగారివలె ఎవరు దానిని చూచి, ముగ్ధులై " లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ! కైలాస శిఖరిపై కదలిరావయ్య ! అని ఆంధ్రదేశమునంతను కదిపించ గలిగినారు ? బాపిరాజుగారు వివిధ భావనలతో కల్పనలతో రూపొం దించిన, ఆలపించిన గీతాలలో కొన్ని "గోధూళి, తొల కరి, శశికళ" అనే సంపుటాలుగా వెలసినవి. అన్నారు. చిత్రాలు : "కవి చిత్రకారుడు కాలేడు. చిత్రకారుడు కవి కాజాలడు." అని సుప్రసిద్ధాంగ్లకవి జార్జి బెర్నార్డు పా బాపిరాజుగారు దీనికప వాదమః . చిత్ర క ళ లో ను విశిష్టస్థానము సంపాదించుకొన్నా డాయన. పాశ్చాత్య చిత్రకళకు వెలుగునీడలు ముఖ్యమై నవి. భారతీయ చిత్రలేఖనములో రేఖ ప్రధానము. దీనిలో చాపి రాజుగారు అందెవేసిన చేయి. ఆయన కవు లలో చిత్రకారుడు, చిత్రకారులలో కవి. ఆయన శ్రీ ప్రమోద కుమార చటర్జీ వద్ద చిత్రకళ అభ్యనించినప్పటి కిని అజంతా రేఖలతో, అమరావతి పంపులతో, మేళ వించి తెనుగుచిత్ర సంప్రదాయమునకు కొత్తవన్నెలు కూర్చినారు. ఆయన చిత్రాలలో 'శబ్దబ్రహ్మ" డెన్మారు ప్రదర్శన శాలను, “భాగవతపురుషుడు” తిరువాన్కూరు రాజ సౌధ మును, "సూర్యదేవ” కూచ్ బీహారును, “సముద్రగుప్త” అల్లాడి కృష్ణస్వామయ్య గారింటిని, "తిక్కన "మృత్యుం జయ" మున్నగునవి మిత్రులు మందిరాలను అలంకరించి నవి. మద్రాసు ప్రభుత్వపు పనుపుపై లంకలోని "సిగీ రియా” గుహాచిత్రాలకు ఆయన ప్రతికృతులు సిద్ధపరచి తెచ్చినారు. ఇవి నేడు మద్రాసు మ్యూజియంలో ఉన్నవి. ప్రతికృతికల్పనములో వీరికి శ్రీ రాంభట్ల కృష్ణమూర్తి, పిలకా నరసింహమూర్తి, కోడూరు రామమూర్తి, శ్రీనివాసులుగార్లు తోడ్పడ్డారు. ఇంతటి చిత్రకళాచార్యుడు వెండితెరపయి కళాదర్శ కుడుగా విలసిల్లుటలో ఆశ్చర్యమేమున్నది? ఆంధ్రులలో ప్రథమ కళాదర్శకుడు కాగల ఘనత పొందిన వాడు కూడ ఆయనే, “సతీ అనసూయ", "ధ్రువ విజయము”, “మీరా 16 121 ణుబాంబు బాయి” చిత్రములలో ఆయన తన చిత్రలేఖనములో వలెనే ఉత్తమాదర్శాలు గక్షించుకొన్నారు. కళలలోనేకాక వైద్యశాస్త్రములో, సాముద్రిక, జ్యోతిష శాస్త్రాలలో, భరతశాస్త్రములో ఆయనకు అపారమయిన పాండిత్యము ఉండెడిది. ఒక్క మాటలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వము. ఆధునికాంధ్ర కళా సాహిత్య వైభవమును దిగంతములకు వెలార్చిన మహ నీయుడు. 2. 50. అణుబాంబు :- రసాయన శాస్త్రజ్ఞులు పృథివిలో నున్న భౌతిక పదార్ధమంతయు 92 మూలపదార్థముల సంయోగవియోగములవలన కలిగినదని నిర్థారణ చేసిరి. ఈ మూలపదార్థములను తిరిగి పరమాణువులనుగా విభ జింపవచ్చుననియు, అంతకంటె చిన్నవి ఉండవనియు, ఒక మూలపదార్థమునకు చెందిన పరమాణువుల గుణములు సమానములనియు వారు కనుగొనిరి. 1896 సంవత్సరములో బెకెరెల్ అను పేరుగల ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు యురేనియం అను మూలపదార్థము, a Bλ a B A (ఆల్ఫా, బీటా, గామా) అనుకొన్ని కిరణములను తనంతటతానే వెలిబుచ్చునని కనుగొనెను. ఇంకను ఇటు వంటి పదార్థములు పొలోనియం, రేడియం మొదలైనవి కలవని శ్రీమతి క్యూరి మొదలైన శాస్త్రజ్ఞులు కను గొనిరి. ఈ మూలపదార్థముల (Elements) విశేష మేమనగా, వాటి పరమాణువులు వాటంతట అవే అన్య పరమాణువులుగా మారుచు ఈ కిరణములను వెలిబుచ్చు చుండుటయే; కొన్ని సంవత్సరముల తరువాత 1919లో రుథర్ ఫర్డు మహాశయుడు నత్రజని (నైట్రొజను ) పరమాణువులమీద 'ఆల్ఫా' కిరణములను ప్రయోగించి, వాటిని ఆమ్లజని (oxygen) పరమాణువులనుగా మార్చ గలిగెను. శక్తిమంతములైన కణములవలన మూల పదార్థములను మార్చవచ్చునని దీనివలన స్థిరపడినది, పరమాణువులను భేదించుటకు సిద్ధముగా దొరకిన 'ఆల్ఫా' కిరణములే 1982 వరకు మొదట ఉపయోగ పడెను. క్రమముగా అన్ని పదార్థముల పరమాణువులను భేదించుటకు వాటిశక్తి చాలదని తెలియవచ్చెను. ఎందు కనగా ప్రతి అణువు గర్భమందున్న బీజము (Nucleus)