Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అడవి బాపిరాజు ఆయన కథలలో "శై లబాల' శిల్పమునకు, " నేలతల్లి” సంఘపు ఆవేదనకు, "భోగీరలోయ" చిత్రలేఖనమునకు ప్రతీకమని గ్రహించవచ్చును. "రజాకార్" ఆయన కథలో మూడు ముక్కచెక్కలయిన తెనుగునాడు ఏక ము కావలయునని ఆవేదనపడినాడు. గజపతిదేశం - రాయలసీమా కళింగరాజ్యం - కాక తిభూమి ఆంధ్రులందరూ - ఒక ఔతారని ఏకకంఠమున పాటనిండునని - మోగింపమ్మా - జయజయఢంకా. " అని ఏనాడో గొంతెత్తి పాడిన విశాలాంధ్రవాది ఆయన. 'కన్ను తెరచినది మొదలు కన్నుమూయునంత దనుక సమకాలిక విషయాలను వస్తువుగా తీసికొని దేశమును బాగుపరిచు జీవముతో అతిసన్నిహితత్వముగల పదునైన కలముగలవారాయన. పాటలు : " అతడు గీసిన గీత బొమ్మయి అతడు పలికిన పలుకు పాటై అతని హృదయములోని మెత్తన అర్థవత్కృతియై” " అన్న శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి మాటపూ ర్తి గా అర్థవంతమైనది. ఇట్టి బాపిరాజుగారు కళాదేవిని శశికళా మూర్తిగా భావించుకొని తన్మయులై ఆరాధించెడు వాడు. తమ గీతాలన్నింటికిని ఆ "శశికళే" అధిష్ఠాన దేవి యని భావించి పాడినారు. ఆమెనిజస్వరూప సాక్షాత్కారము కోసము అంగలార్చినారు. ఆవేదన పడ్డారు. నీకు ఇవతల అవతల తెర ఉన్నది చాలా ! తెర ఉన్నదే! కన్నులు కానని రూపం పిలిచి కౌగిలి కందనీ భావం తలచీ తెరవైపున నా చేతులు మోడ్చి అరమూతలునా తీరని కలలై చీల్చిన చిరగని తెర ఇవతలనే చేరగరానీ నీ వవతలనే తెర ఉన్నది చాలా ! తెర ఉన్నదే ! " ఉపాస్య దేవీదర్శనము లభించనప్పుడు పడే ఆ వేదన, తెలివే పదాలు, కల్పన ఇంతకన్నను ఉండవను కొందును. " ఒక్కణ్ణి! ఇసుక బయలు ఒక్కణే! నీరు దెసలు కదలిపోవు దూరాలు బెదరిపోవు మేఘాలు మరచి పోవ కే.”” ఒంటరిబ్రతుకు చూపుచు కదలిపోయే దూరాలు, బెదరి పోయే మేఘాలు మనకు మరపురావు. సుమారాదర్శాల కోసము ప్రాకులాడే శశికళ” రస హృదయమునకు, కళాహృదయమునకు ప్రతిబింబము. “అల్పభావము లెట్లు శిల్పవిషయము లొను ?" అను మతము ఆయనది. " ' ఉప్పొంగి పోయింది గోదావరి- తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ! అనే గేయము గోదావరి వరదలను మన కనులకు కట్టి నట్లు చేయును. పట్టినములోని శివాలయము పూజా పురస్కారాలకు నోచుకోలేదన్న విషయమును ఆయన చమత్కారముగా చెప్పిన పద్దతి అపూర్వము. " గోదారి మద్దేన కొండొకటి వెలసింది కొండపయి జంగమయ కొలువు వేంచేశాడు గోదావరి వడులలో కూడె తీర్థాలన్ని కొండపై జంగమయ కోటి అభిషేకాలు గోదావరి వరదలో కోటిపూవులపత్రి కొండపై జంగమయ వెండిపూవుల పూజ గోదారి కెరటాల కొండతో గుసగుసలు కొండపై జంగమయ కునుకు బంగరుడోలి” ఆయన రసహృదయము బెంగాలు, పంజాబులలో జరిగిన దురాగతాలకు వికలమయి పోయినది. వెంటనే “ ఏమైనారు నా వాళ్లంతా ఏమైపోయిరి ఈ ఊళ్ళో కళకళలాడే గల్లీలన్నీ కలమోస్తరుగా కలిగి పోయినవి. " అని ఆరాట పడినది. 120.