Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆయన తక్కిన నవలలు నారాయణరావు, కోనంగి, తుఫాను, జాజిమల్లి, నరుడు సాంఘికమైనవి. బాపిరాజు గారి నవలలోని ప్రత్యేక లక్షణా లివి : 1. చరిత్రాత్మక మైన నవలలో, చరిత్రానుసరణ విష యములో, ఆయనది అసిధారావ్రతము. కథా గమనము కోసమో, చమత్కారముకోసమో చరిత్రను తారుమారు చేయుట . స సేమిరా పనికిరాదు. ఏ రాజుల కాలపు కథ తీసికొని నవల వ్రాయదలచినా, మొదట ఆకాలపు శాస నాలు మొదలు కవిలెకట్టలదాక కుణ్ణముగా చదివి, చరిత్ర కారులతో తర్క వితర్కాలు జరిపి, సమన్వయించు కొని, అప్పటి ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు రాజుల లోటు రాకుండ రచన సాగించేవారు. తుదకు బిరుదావళులను కూడ వదలెడువారు కారు. ఇందులకు "గోన గన్నా రెడ్డిని ప్రత్యేకముగా ఉదహరించవచ్చును. 2. సాంఘికమయిన నవలలలో తన దృష్టిని కేవలము పాత్రల మీదనే కేంద్రీకరించక పరిసర పరిస్థితులను, దేశములోని ఘటనల్లో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తు లను కలిపివేసి, వాస్తవికతను మరింత స్పష్టముగా తోప జేసెడువారు. కనుకనే "నారాయణరావు” లోని జమీం దారీ పద్ధతి నిర్మూలనము గాని, తుఫానులోని శర్వరీ భూషణుని క ళాతృష్ణ కాని, “నరుడు”లోని హరిజన-ఆంగ్లో ఇండియను వనిత వివాహము కాని, విడ్డూర మనిపించవు సరిగదా, పాఠకునికి సన్నిహితముగాను, వాస్తవికము గాను కనుపించును. "నారాయణరావు" ఆంధ్ర విశ్వ విద్యాలయము మన్ననపొందినది. 3. దేనికి తగిన భాష దానికి అనేది బాపిరాజుగారి రచన లోని మొదటి కిటుకు. “హిమ బిందు”లో భాష ప్రాచీన ప్రబంధ ధోరణిలో కదం తొక్కును. 'కోనంగి', 'నరుడు' వంటి సాంఘికాలలో వ్యవహార భాషలో నల్లేరుపై బండి వలె సాగును. భాష యేదయినా ఈ శైలిలో కవిత్వము తొంగిచూచుచుండును. 4. చరిత్ర విషయములో వలెనే భూగోళ విషయము లోను ఆయనకు పట్టుదల యెక్కువ. ఆయన ఏ నవల చదివినను (ఏ కథ చదివినా) ఆయా ప్రాంతాలలో విహ రించినట్లు పాఠకులు తన్మయులయ్యెదరు. తనదేశ పర్యట నానుభవాలను యుక్తాయుక్త విచక్షణతో క్రోడీకరించి, 119 అడవి బాపిరాజు అక్కడక్కడ చొప్పించుట ఆయనకు పరిపాటి. “తుఫాను” లో ఆయనవి విధరాష్ట్రాల ప్రజల జీవితాలకు సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మవిషయాలను అద్భుతముగా చర్చించుట చూడవచ్చు. 5. ఆయనపాత్రలలోని ఉదాత్తత నిరుపమానము. సంఘములోని ఎగుడు దిగుళ్ళను సరిచేసే ఆ వేళము పాత్ర లలో తొణికిసలాడుచు ఉండును. ఆయన సిసలైన గాంధీ వాది. తనకు నచ్చని విధానాలను, సిద్ధాంతాలను వికార ముగాచూడక సానుభూతితో పరిశీలించేసహనముగలవాడు. రచయితకు అవసరమయిన ఈనిజాయితీ గిలవాడు-క నుక ఆయన పాత్రలుకూడ ఈఉదాత్తతను పోతపోసికొన్నవి. ప్రతిపదుల వాదాలను ఎంత ఉదాత్తతతో తర్కించునది "తుఫాను” సాక్ష్యమియ్యగలదు. కథలు :- బాపిరాజుగారి కథలు కళా మూర్తులు, రసగుళికలు. అతి సామాన్య విషయముతో అసాధారణ కథ అల్లగల మొనగాడాయన. బాపిరాజు గారితో తెనుగు కథారంగములో నూతన కళాత్మకాధ్యాయము ప్రారం థమై, మహోన్నతిని పొందిన దనుట నిస్సందేహము. ఆయన కథలలో "శైలబాల, భోగీరలోయ, వీణ” దివ్యపారిజాతాలు. ఆయనకథలు కొన్ని, రాగమాలిక, తరంగిణి, అంజలి" అనే మూడు సంపుటాలుగా వెలువడి నవి. కొన్ని కథలు జైలబాలవంటివి, ఆంగ్ల, కన్నడ, హిందీభాషలలోకి అనువదింపబడినవికూడ. బాపిరాజుగారి కథలలో ధగధగలు, భుగభుగలు కను పించవు, వినిపించవు. నిస్పృహ, దౌర్బల్యము అగుపిం చవు. "ఆయన కాళ్ళు నేలమీదనే యున్నను ఆయన చూపు నింగిమీదే. అందుచేత, ఆయన కథలు ఇతరుల కథలవలె కన్పట్టవు. అవి ఆయన దివ్యస్వప్నాలుగా ఉండును. ఆయన కనెడుకలలనే కథలుగా చెప్పివాడు... ఆయన తన కల్పన ద్వారా హృదయస్పందన లెన్నింటినో కథాత్మకముగా చేసినాడు.” ఇంతమాత్రాన ఆయన కాల్పనిక జగములోనే విహ రించినారనికాదు. వాస్తవిక జగత్తుకూడ ఆయన విహార భూమియే. "వాన, నేలతల్లి, గాలివాన” వంటి కథలలో ఆయన భూమిబిడ్డల సంగతులు వ్రాసి పేదల పెద్దతనమును పెద్ద చేసి ధనికుల దౌర్జన్యమును ఖండించినారు.