Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపూర్ణముగనో, కొంతవరకో నీటిలో కరగును. రజన ములు (Resins) నీటిలో కరగవు. సాధారణముగ మధు సారము (alcohol) లో కరగును. అరబిక్ గురు, తుమ్మ జిగురు, బెంగాల్ కి నో అనునవి భారతదేశపు అరణ్య వృక్షములనుండి లభించు కొన్ని ముఖ్యములైన జిగు రులు. పైనస్ లాంజిఫోలిస్, ఎ క్సెల్సా, ఖాసిల్ మెర్కుపై అను నాలుగుజాతుల పైనువృక్షములు వ్యాపారరీత్యా వీలువైన రజనములను ఇచ్చును. ఉద్భిజ్జ ద్రవములు సహజముగ ఇగిరిపోవుటవలనగాని, ప్రత్యేక మగు గ్రంధుల వలనగాని తయారై, సహజముగా వృక్షమునుండి బయటికి వచ్చును. లేదా గంటు పెట్టిన యెడల పట్టలోనికి, దారువులోనికి వచ్చును. ఈ సందర్భ మున చిర్ పైన్ జనము, టర్పెంటైన్ పరిశ్రమ చెప్ప దగినవి, 7. వాసన ద్రవ్యములు. విషపదార్థములు, ఓషధులు :- భారతదేశమున హిమాలయములందును, ఇతర పర్వత శ్రేణులందును ఉన్న 'అరణ్యములలో అనేకములగు ఓషధు లున్నవి. వానిని తీయు ఉద్భిజ్జభాగములనుబట్టి ఓషధులు వర్గీకరింప బడినవి. వేరు ఓషధులు, పట్ట ఓషధులు, ఉదా :- క్వినైన్) పండు, గింజ ఓషధులు (ఉదా:- స్ప్రిన్) పత్ర - ఓషధులు (ఉదా :- గంజాయిమొక్క నుండి తీయు గంజాయి). ఏలకులు, మిరియాలు, దాల్చినచెక్క చాలా ప్రసిద్ధ మైన సువాసన ద్రవ్యములు. 8. జంతు, ఖనిజాది సంబంధమగు ద్రవ్యములు :- అరణ్యములనుండి లభించు మైనము, తేనె, కొమ్ములు తోళ్ళు, దంతము, షీకాయ, కుంకుడు వంటి చాల దిను సులు తక్కువ ప్రాముఖ్యము కలవి. అరణ్య లభ్యమగు పదార్థములలో మిక్కిలి ముఖ్య మైనవి లక్క, షెల్లాక్. వీటివిషయమున ప్రపంచములో భారతదేశము ఒక టే ఉత్పత్తిస్థానముగా నున్నది. అచ్చులు పోయుటకును, గ్రామఫోను పరిశ్రమలకును, చక్కని వార్నీసులు, మెరుగులు, లక్క, టోపీలు, కురు వింద కూపములు (emery wells) మందుగుండు సామా గ్రిని, విద్యుత్పరికరములను, విద్యుతంత్రుల కప్పులు మొదలగువానిని చేయుటకును ఉపయోగపడును. 116 అడవులు రజనము తయారుచేయుటలో భారత దేశము క్రమ ముగా అభివృద్ధి గనబరచు చున్నది. లై నోలియం, లక్క, నూ నెగుడ్డలు, కందెన సమ్మేళన ద్రవ్యములు (lubrica- ting compounds,) సిరాలు తయారు చేయుటకును, లోహములను అతుకుట, రంగులు, వార్నీసులు ఆర బెట్టుట, యంత్రముల పట్టాలను కప్పుట మొదలగు పను లకును రజనము ఉపయోగపడును. భారతదేశమున మంచిరకము టర్పెన్ టైన్ తయా రగును. అది చాలవరకు రంగులు, వార్నీసులు, ఔషధ ములు తయారు చేయుటకు ఉపయోగపడుచున్నది. (8) కాగితము, కాగితపుగుజ్జు :- భారత దేశ మున అరణ్యలబ్ధ పదార్థములలో కాగితపు గుజ్జు తయారుచేయు టకు గడ్డిజాతి కుటుంబమునకు చెందినవి మంచివి. హిమాలయములయందున్న 'కోనిఫరు'లు, కొన్ని ఆకు రాలు వృక్షములు కాగితపు పరిశ్రమకు మంచి పదార్థ ములు, హిమాలయ పాదపర్వతముల పైని, బీహారు, ఒరిస్సా, మధ్యభారతములలో కొన్ని భాగ ములయం దును ఎల్లప్పుడు పెరుగుచుండు సబాయ్ డ్డి ఈ పరిశ్రమకు ముఖ్యమైన ముడిపదార్థము. గడ్డిజాతి కుటుంబమునకు చెందిన వెదుళ్ళు, మద్రాస్ బెంగాల్, బీహారు, ఒరిస్సా, బొంబాయి, తిరువాన్కూరు రాష్ట్రములలో విస్తారముగా దొరకును. అవి కాగితపు పరిశ్రమకు పనికివచ్చును. (10) భూసార విశేషమును పదిలపరచుట (Soil Con- servation) : మధ్య శతాబ్దములలో జరిగిన విస్తారమగు ఆక్రమణ కార్యక్రమములలో అరణ్య నిర్మూలనమువలన కలిగిన నష్టములు గత శతాబ్దాంతమున తెలిసినవి. సహజ మగు ఉద్భిజ్జ శోభగల అరణ్యములు ఎంత ముఖ్యమైనవో దట్టమగు వర్ష మేఘములు (Cukulo-nimbus Clouds) ఏర్పడుటకు అవి ఎట్లు తోడ్పడునో, పూర్వము నుండియు గుర్తింపబడినది. ఈ మేఘములు ఏర్పడుటకు అవసరమైన చల్లదనము, ఆర్ద్రత, విస్తృతమగు అరణ్యముల వలన కలుగును. అరణ్యములు, వానియందున్న దట్టమగు ఉద్భిజ్జజాతి భూమి పైపడు వర్షపాతమును అదుపులో నుంచును. భూమిని నల్లగా నుంచుటయందును, అధిక ముగ నీటిని పీల్చుకొనుటకును అరణ్యవృక్షములు తమ