Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బట్టి నారను తయారుచేయు పద్ధతులు చాలవరకు వేరుగా నుండును. కాని పోగులను ఒకదాని నుండి మరియొక దానిని వేరుచేయు పద్ధతి “రెట్టింగు" అనబడును. ఉపయోగకరమగు నారనిచ్చు మొక్కలు స్టెర్క్యూలి యేసీ, టిలియేసి, లెగూమినోసీ, అస్కిపియడేసి, అర్టి కేసీ అను కుటుంబములకు చెందినవి. అనగా జనుపనార మొక్కలు 'లినెన్' అను నార మొక్కలు, 'హెంప్', 'మానిల్లా హెంప్ ' ముఖ్యముగా లభించు అరణ్యపదార్థ ములు. పీచు, కపోక్, ఇండియన్ కపోక్ అనునవి అరణ్య అనునవి అరణ్య వృక్షముల యొక్క ముదుక పట్టువలెనుండు రకములు. 2. గడ్డిరకములు, వెదురు, పేములు:- సన్నబట్ట నేత కు పనికివచ్చు ప్రోగులను (Fibres) ఇచ్చు గడ్డి జాతులు భారతదేశములో లేవుకాని, ఏకులకు, చాపలకు, కాగితపు గుజ్జుకు పనికివచ్చురకములు చాల ఉన్నవి. కాగితపు గుజ్జు తయారుచేయుటకు ఎంతయో ఉపయోగపడుచు బీహార్, ఒరిస్సా, బెంగాల్, మధ్యప్రదేశ్, తూర్పు పంజాబు రాష్ట్రములనున్న 'బైబ్' అనుగడ్డి అన్నిటికంటెను ముఖ్య మైనది. 'ముంజ్' గడ్డి ప్రఖ్యాతి చెందిన ఢిల్లీ చాపలు తయారుచేయుటకు విస్తారముగా నుపయోగపడును. వట్టి వేళ్ళు సువాసననిచ్చు చాపలు తయారుచేయుటకు ప్రసిద్ధి చెందినది. వేర్వేరురకముల వెదురు భారతదేశ మందంతటను కనబడును. దాని ఉపయోగములు అందరకు బాగుగ తెలిసినవే, పేము లేక రటన్ అనునది 'పామ్' కుటుంబ ములో పెక్కు గణములకు చెందిన ఎగబ్రాకు మొక్కల యొక్క కాండములు. వాటిలో క్లారుస్ (Clamus) అను గణము అన్నింటికంటే అన్నింటికంటే ముఖ్యమైనది. వీటిని తాళ్ళకుబదులుగా నుపయోగింతురు. ఒక్కొక్కప్పుడు 800 - 400 అడుగుల పొడవుగల వేము బెత్తములను వ్రేలాడు వంతెనలకు ఆధారముగా నుపయోగింతురు. కుర్చీలు, కర్రసామాను, పిల్లల తిరుగుడు బండ్లు, బుట్టలు, జల్లెడలు, చాపలు, కాళ్ళు మొదలైనవి తయారుచేయు -టకు కూడ వానిని ఉపయోగింతురు. 3. స్వేదనమువలన, కషాయము తీయుటవలన లభించు ద్రవ్యములు :- అడవిగడ్డిజాతులనుండి స్వేదన క్రియవలన 115 అడవులు లభించు పరిమళ తైలములు 5 ముఖ్యమైనవి భారతదేశ మున గలవు - పామరోజా లేక జెరేమియంతై లను, నిమ్మగడ్డినూనె, నింబరై లము, అల్లపుగడ్డినూనె, వట్టి వేరు తైలము, చందన తైలము, అగరు నూనె, దేవదారు తైలము, ఆయావృక్షముల దారువులనుండి లభించును. కర్పూర తైలము, యూకలిప్టరు రైలము, దాశిన తైలము, వింటర్ గ్రీన్ రైలము అనునని ఆయాప త్ర ములనుండి లభించువానిలో ముఖ్యమైనవి. వింటర్ గ్రీన్ తైలము తక్క మిగిలినవి చాల ప్రసిద్ధములైనవి. వింటర్ గ్రీన్ తైలమునుండి సాలిసిలికామ్లము కార్బాలికామ్లము తయారుచేయవచ్చును. 'ఆస్పిరిన్' అనుదానిని సాలిసిస్టిక్ ఆమ్లము నుండి తయారుచేయవచ్చును. మూస్ర 4. నూనెగింజలు : - అవిసె, నువ్వులు, ఆవ, (Rape) వంటి నూనెగింజలు చాలవర కిప్పుడు క్షేత్ర సస్య ములుగా పైరుచేయబడుచున్నవి. అమెరికా, యూరప్ బజారులలో భారతదేశపు అరణ్యలబ్ధమగు చౌత్ మూ గ్ర తైలము కుష్ఠు చర్మవ్యాధులకు ముఖ్యమైన ఔషధ ముగా అమ్మబడుచున్నది. 'సేపియం సాబిఫెరమ్ ' అను వృక్షమునుండి లభించు తెల్లనిమైనము చైనాలో సబ్బులు, క్రొవ్వు వత్తులు చేయుటకు ఉపయోగ పడుచున్నది. 'జపాను మైనము' అనునది దీనిలో మరి యొక రకము. 5. రంగులు, అద్దకములు: తుమ్మ, తంగేడు, సాల వృక్షముల యొక్క పట్టనుండి రంగులు తయారు చేయు దురు. వీనిలో తుమ్మపట్టరంగు అన్నిటికంటే ముఖ్యమైనది. భారతదేశ మందంతటను ఇది ఉపయోగములో నున్నది. మిగిలినవి పండ్లరంగులు ఆకురంగులు అని రెండు విధ ములుగా విభజింపఁబడినది. కరకాయలు, తుమ్మకాయలు, డివిడివికాయలు వీనినుండి లభించురంగులు పండ్ల రంగులు. ఇతరవృక్షములనుండి లభించునవి ఆకురంగులు. కొన్ని తరగతులకు చెందిన మొక్కల చెక్కలు. పట్టలు, పువ్వులు, పంళ్లు, వ్రేళ్ళు, రంగులు తయారు చేయుట కుపయోగ పడును. ఎనిలైన్ సంబంధమగు రంగులు వచ్చినప్పటినుండి శాకసంబంధమగు రంగుల ప్రాముఖ్యము తగ్గినది. 6. జిగురులు, రజనములు :- జిగురులు చెట్లనుండి పట్టలనుండి, బయటికి స్రవించు పదార్థములు, అని