Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అడవులు హరితములు ఇది కలిగి ఉండును.) ఇది భారతదేశమున వాయవ్య భాగమున నున్నది. (10) ఆర్ద్ర సమశీతలారణ్యము :- (ఇది క్రిందిభాగమున దట్టముగా పెరిగిన ఉద్భిజ్జములతో సదాహరితము, అర్ధ సదాహరితములు గల మిశ్రారణ్యము.) తూర్పు హిమా లయములలో 8,000 అడుగుల నుండి 9,500 అడుగుల వరకు గల భాగమందును, దక్షిణ భారత దేశములో పర్వత శిఖరములపై నను ఇట్టి అరణ్యము లగపడును. (11) చెమ్మగల సమశీతలారణ్యము :- (సూచీముఖ వృక్షజాతి (కోనిఫరు) మరియు ఓక్ వృక్షములతో సదా హరితములు, క్రింది భాగమున ఆకురాల్చు ఉద్భిజ్జము లుండును.) మధ్య హిమాలయములు, పశ్చిమ హిమా లయములందు 40 అంగుళములకు మించి వర్షపాత మున్న ప్రదేశములలో ఇట్టి అరణ్యము లుండును. (12) తడిలేని సమశీతలారణ్యములు:- దేవదారు, పై౯, జ్యూనిపెర్ వృక్షములును, విశాలమగు ఆకులుగల వేడి మిని వానలేమిని తట్టుకోగల (xerophytic) వృక్షము లును ఉండును.) హిమాలయ పర్వతముల లోపలి పంక్తు లలో నిట్టి అరణ్యముండును. (13) “ఆల్పైన్" (alpine) అరణ్యము :- సదాహరి తములగు 'కోనిఫరు' వృక్షములు, ఎత్తు తక్కువ, విశాల మగు ఆకులు గల వృక్షములు ఉండును.) 10,000 అడు గులకు మించిన ఎత్తులో 'కలపహద్దు' వరకు హిమా లయములం దంతటను ఇట్టి అరణ్య మగుపడును. 14. ఆంధ్రదేశములోని అడవులు :- ఈ రాష్ట్రము ఉష్ణమండలములో నున్నది. ఈశాన్య ఋతుపవనముల వలన ఇచట కొన్ని తావులలో వర్షము కురియును. తూర్పు కనుమలలో ఇంచుమించు 40 అంగుళముల వర్షము కురియును. పడమట తెలంగాణాయందు 20 మొదలు 30 అంగుళముల వరకు వర్షపాతముండును. స్థూల వర్గీకరణమున ఆంధ్రరాష్ట్రపు టడవులు ఋతు పవనారణ్యముల తరగతికి చెందును. అవి ఆకురాలు లక్షణముగలవి. పశ్చిమ భాగములలో ఆకురాలునట్టివి, ఉష్ణమండలపు ముండ్లతో గూడినట్టివి మిశ్రారణ్యములుగా నుండును, సముద్ర తీరమున నున్న రొంపి నేలలో, ముఖ్య ముగా గోదావరీ, కృష్ణా ముఖద్వారములందు గొప్ప 114 సముద్రపు పోటులకు, ఉప్పునీటికి తగియున్న వాయు శిఫలు (mangroves) పెరుగును. ఆంధ్రరాష్ట్రమున నున్న అడవులను భౌగోళిక ముగా ఈ క్రింది తరగతులుగా విభజింపవచ్చును. అ) గోదావరి లోయలోనున్న అడవులు చక్కని మురుగుపొరుగల గలదియు, సారవంత మైనదియు, చాల లోతువరకు మెత్తని మట్టిగలదియు నగు నేలలో పెరు గును. అచటి వృక్షములలో టేకు ముఖ్యమైనది. అది 60 అడుగులు మొదలు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగును. కొంచెము మరియొక రకపు అడవి తడిలేని, లోతులేని వండు నేలలలో పెరుగును. అచటి టేకు వృక్షములు 25 మొదలు 50 అడుగుల వరకు పెరుగును. (ఆ) కృష్ణానది లోయలోని అడవులలో ఏపి, చిరు మ్రాను, అబ్నస్ (Abnus), నల్లమద్ది వృక్షములు ముఖ్య మైనవి. ఈ అడవులు విడివిడిగా లోతులేని ట్రాపియ (Trappean) ప్రదేశముల యందు పెరుగును. కాని ఇసుక రాతి ప్రదేశములలో విస్తారముగా వ్యాప్తిచెందును. (ఇ) తూర్పు కనుమలలో నున్న అడవులలో పలు రకముల వృక్షము లుండును. వానిలో టేకు, వెదురు, కాగితపు గుజ్జుకొరకు పనికివచ్చు ఇతరమైన రకములు ఉండును. (ఈ) డెల్టాలలో రొంపిగానుండు సముద్ర తీరము లలో 'వాయుశిఫలు' అను జాతి (Mangrove) అడవులు పెరుగును. వృక్షములు చాలవరకు వంట చెరుకుగా ఉప యోగపడును. 5. అరణ్య సంబంధమగు పదార్థములు: అరణ్య ప్రదేశములలో దొరకు అన్ని రకముల జంతు, వృత్త, ఖనిజ పదార్థములు ఉప అరణ్య పదార్థములు, ఇందు దొరకున కలప, వంటచెరుకు, ముఖ్య పదార్థము. భారతదేశపు ఉప - అరణ్య పదార్థములను ఈ క్రింది తర గతులుగా విభజింపవచ్చును : 1. నార, పీచు: చేవగల చాల జాతుల యొక్క నార పొరనుండి నారలు లభించును. వానిలో కొన్నిటినుండి త్రాళ్ళు పేనుటకు వీలుగా పొడవుగల బలమైన నాగ లభించును. కొన్నిటినుండి నేతవనుల కుపయోగించు పట్టు మాదిరి సన్నని పోగులు దొరకును. ఆయా జాతులను