Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యాప్తిచెందుట ' ఆల్పైన్ వ్యాప్తి' అనబడును. హిమాలయ పర్వతములను ఆరోహించినచో స్పష్టముగ చూడనగును. 3. భారతదేశ మందలి అరణ్యముల రకములు :- శీతోష్ణ స్థితులకు కారకములగు ఉష్ణోగ్రత, ఆర్ద్రత అనునవి నేలల అభివృద్ధికిని, తత్ఫలితమగు ఉద్భిజ్జ నివాసమునకును ముఖ్యమగు కారణములు. ఈ దేశములో నున్న వివిధ ఉద్భిజ్జ జాతులు, వృక్షశాస్త్ర దృష్ట్యా ఈ దిగువ ప్రత్యేక లక్షణములు గల ప్రదేశములుగా విభజింపబడినవి - 1. తూర్పు హిమాలయము, 2. పశ్చిమ హిమాలయ ప్రదేశము, 3. సింధు మైదానము, 4. గంగా మైదానము, 5. పశ్చిమ సముద్రతీరము, 6. దక్కను. ఈ ప్రదేశములలో నున్న అరణ్యముల రకములు, వాటి వ్యాప్తి ఈ దిగువ నీయబడినవి :- (1) ఉష్ణమండలస్థ సదాహరితార్దారణ్యము :- ఛత్రాకారముగ విజృంభించిన సదాహరితములగు మధ్యో దిృదములతో (Mesophytes) ఎత్తుగా, దట్టముగా నున్న అరణ్యము పడమటి కనుమల యొక్క పశ్చిమ ముఖము నను, అస్సాంలో ఊర్ధ్వభాగమున నైరృతిమూల నుండి కాచార్ గుండా దక్షిణమున చిట్టగాంగు పర్వత ప్రదేశ ముల గుండా వ్యాపించిన పీలిక యందును ఇట్టిది కలదు. (2) ఉష్ణమండల సదా అర్ధహరితారణ్యము :- ఆకురాలు జాతులు, స్వల్పకాలము పత్రరహిత ముగనుండు సదా హరితములును కలిసియున్నది. పడమటి కనుమలలో నున్న ఉష్ణమండల సదాహరితారణ్యమునకు ప్రక్కను, తూర్పుహిమాలయముల క్రింది వాలు లందును ఇట్టి అరణ్య మగపడును. (3) ఉష్ణమండలపు చెమ్మగల ఆకురాలు అరణ్యము :- (ఇది ఆకురాలు వృక్షములే ప్రముఖముగను, సదాహరిత ములు స్వల్పముగను గలది.) దీనికి ఋతుపవన మండలా రణ్యమని కూడ వేగు. ఇది భారతదేశపు టరణ్యలక్షణము లకు చక్కని ఉదాహరణము. హిమాలయ పాద ప్రదేశ మందును, పడమటి కనుమలలో తూర్పు దిక్కునను, ఛోటా నాగపూర్ లో కొన్ని భాగములందును, ఖాళీ పర్వతములలో గాలి మరుగుదిక్కునను, ఇట్టి అరణ్యము కలదు. 15 113 అడవులు (4) ఉష్ణమండలపు పొడియయిన ఆకురాలు అరణ్యము:- (ఇది ఇంచు మించు సంపూర్ణముగా ఆకురాలు ఎత్తుగాని వృక్షములు గల అరణ్యము.) ఇది భారతదేశము యొక్క మధ్యభాగమున ఉత్తర దక్షిణముగా హిమాలయ పాద ప్రదేశమునుండి కన్యాకుమారి అగ్రమువరకును వ్యాపించి యున్నది. ఇచట 40 అం. లు మొదలు 50 అం. ల వరకు వర్షము పడుటయు, 6 నెలలు వానలు లేకుండుటయు ప్రత్యేక లక్షణములు. (5) ఉష్ణమండలపు కంటకారణ్యము:- ఇందు తక్కువ ఎత్తుగల చెట్లుండును. ఇది దట్టముగా నుండదు. ఇందలి వృక్షములు వేడిమిని కానలేమిని తట్టుకొన గలిగి యుండును. ఇందుగల వృక్షములు ముండ్లుగలిగి ప్రధాన ముగా కాయధాన్యముల జాతికి చెందినవై యుండును. ఇట్టి అరణ్యము దక్షిణపంజాబులో సింధు పరీవాహప్రదేశ మందును, రాజపుత్రస్థానములోను, సింధులోను 10 అం. మొదలు 30 అం.ల వరకు వర్షపాతము కలిగియుండును. ఊర్ధ్వ గంగా మైదానమందును, దక్కను పీఠభూమి యందును ఇట్టి అరణ్యము కలదు. (6) తడిలేని ఉష్ణమండల సదాహరితారణ్యము:- (ఇందు చిన్న ఆకులు, ముండ్లు కల ఉద్భిజ్జములు ఎక్కువగా నుండును.) ఇట్టి అరణ్యము కర్నాటక సముద్ర తీరమున కనబడును. (7) ఉప-ఉష్ణమండలపు ఆర్ద్ర పర్వతారణ్యము :- (ఇది ఎత్తుగా, బాగుగా పెరిగిన సదాహరితవృక్షములతో కూడిన అరణ్యము). హిమాలయముల క్రిందివాళ్ల యందును. బెంగాలు నందును, అస్సాములోను, ఖాళీ, ఉదక మండల, మహాబలేశ్వర పర్వతపంక్తులపైని ఇట్టి అరణ్యమగపడును. (8) ఉప-ఉష్ణమండలపు' పైను చెట్ల అరణ్యము:- (ఇది సదాహరితములయినట్టి గాని, హరితములు కానట్టి గాని సులభముగా శాలునట్టి వృక్షములతో పలుచగానుండును.) ఇట్టి అరణ్యము, మధ్య, పశ్చిమ హిమాలయములలో, ఖాళీపర్వతములలో 3000 అడుగుల ఎత్తునుండి 8000 అడుగుల ఎత్తువరకు ఉండును. (8) పొడియైన ఉప ఉష్ణమండలసతతహరితారణ్యము:- (ఎండ వేడిమిని, వానలేమిని తట్టుకొనగల (xerophytic) ముండ్లజాతులు, చిన్న చిన్న ఆకులుగల 'ఆలివ్' వంటి సతత