Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆడవులు గాలి, నేల (అ) 'సెల్వాలు' అనబడు భూమధ్య రేఖాప్రాంతపు సదాహరితారణ్యములు భూమధ్యరేఖ పొడవున నున్న వర్షపాత మండలములో నున్నవి. సంవత్సరమునకు 80 అంగుళములకు మించి వర్షపాతముగల ఋతుపవన ప్రదేశములలోగూడ అవి యుండును. అచట సంవత్సరము పొడుగునను సూర్యరశ్మి బాగుగానుండును. ఎప్పుడును తడిగానుండును. ఆ అరణ్యములు పొడవైనవి. పొట్టివియగు వేలకొలది రకముల మొక్కలతో దట్టముగా, ఏపుగా పెరుగును. అవి భూమధ్య రేఖా ప్రాంతమందంత టను ఉన్నను అమెజాన్, కాంగోపరీవాహ ప్రదేశముల లోను, భారత దేశము, సింహళము, మలయా, ఈస్టు ఇండీస్, బర్మాలోను ఉన్న అడవులు అత్యుత్తమ మైనవి. రబ్బరుచెట్లు, సింకోనా, కోకో, మానియోక్, కొబ్బరి చెట్లను కలిగియుండుటచే నివి చాల ముఖ్యమైనవి. భారత దేశపు ఋతుపవనారణ్యములనుండి వర్తకమునకు పనికి వచ్చు కలప, ముఖ్యముగా టేకు సాలవృక్షములనుండి లభించును. 40 అంగుళములకు తక్కువ వర్షపాత మున్నచోట్ల అడవులు కొంచెము పలుచగను, కొట్టివేయు టకు సులభముగను పెరుగును. వీటియందు కలప నిచ్చు వృక్షములు, వెదురు, తాడి, తృణధాన్యములు, వరి, ప్రత్తి, కొన్ని పర్వతపు వంపులందు తేయాకు, కాఫీ లభించును. ఆహార ధాన్యపు పైరులను పెంచుటకు ఈ ప్రాంతము చాల అనుకూలముగ నుండును. అందువలను అచట జనసంఖ్య ఎక్కువగానుండును. (ఆ) వెచ్చని సమశీతలారణ్యములు ఋతుపవనారణ్య ములను ఇంచుమించు పోలియుండును. కాని వేరురక ముల వృక్షములు కలిగియుండును. ఆహారసంబంధమగు పైరులను సేద్యము చేయుటకొరకు పెక్కు ప్రదేశములలో నున్న అరణ్యములు చాలా కాలము క్రిందటనే కొట్టివేయ బడినవి. వీటిలో 5 ముఖ్యమగు ప్రదేశము లున్నవి - (1) రొంపినేలలో మాత్రమే అరణ్యములు గల ప్రాంత ములు, విశాలమగు ప్రత్తినేలలు, మొక్కజొన్న నేలలు కల అమెరికా సంయుక్త రాష్ట్రములోని ఆగ్నేయ భాగము, (2) విలువైన కలపనిచ్చు అరణ్యములుగల బ్రెజిల్ లోని దక్షిణ భాగము. (8) చెరకు, మొక్కజొన్న వైరు చేయుటకు అరణ్యములను నరకి వేసిన దక్షిణాఫ్రికా 112 లోని నేటాలు. (4) మధ్య చైనా, ఉత్తర చైనా. (5) యూకలిప్టను అరణ్యములకు ప్రాముఖ్య మొందిన ఆస్ట్రేలియాలోని తూర్పు భాగము. (ఇ) చల్లగానుండి, ఆకురాలు సమశీతలారణ్యములు చల్లగా సమశీతలముగానున్న ప్రదేశములలో చలినుండి రక్షించుకొనుటకై శీతకాలమున వృక్షముల ఆకు రాలును. అందుచే వాటికి ఆకురాలు వృక్షములని పేరు. ఓక్, ఎల్మ్. బీచ్, బర్చ్, పేపుల్ అను వృక్షములు విలువైన కలప నిచ్చును. ఇట్టి వృక్షములుగల అరణ్యములు ఉత్తర యూరప్ , అ మెరికా ఈశాన్య భాగములో, మంచూ రియాలో కలవు. గోధుమ, బార్లీ, రై, మెదలగు ఆహార ధాన్యపు పైరులను పెంచుటకొరకు ఈ ప్రదేశములలో మొదటనున్న ఉద్భిజ్జజాతి నరకి వేయబడినదను విషయము గమనించతగినది. (ఈ) చల్లని సమశీతల కోనిఫరు అరణ్యములు :- కోనిఫరు పృథములు ఎక్కువ చలిప్రదేశములలో పెరు గును. అందుచే, మంచునుండి కాపాడుకొనుటకును, బాష్పోత్సేకమును తగ్గించుకొనుటకును, వాటిపత్రములు సూదులవలెనుండును. ఆవృక్షములు మెత్తని దారువు కలిగి, కాగితపు పరిశ్రమలకు చాల ఉపయోగపడును. ఉ త్తరార్ధగోళము యొక్క ఉత్తరపు సరిహద్దులయందును, మధ్య యూరప్ (జర్మనీ, స్విట్జర్లాండు, కార్పేధియన్సు) పర్వతములలోగల ఉన్నత ప్రదేశములయందును, న్యూజీ లాండు, టాస్మేనియా, ఆస్ట్రేలియాలలో ఆగ్నేయ భాగములందుగల పర్వత ప్రదేశములయందును కోనివరు అరణ్యములు విస్తృతముగానున్న భాగములు వరుసగా గలవు. ఈ ప్రదేశములలో నివసించు ప్రజల కార్యకలాప ములు అరణ్యములతో సంబంధించియుండును. (ఉ) మిక్కిలి ఎత్తయిన (ఆల్పైన్) ఉద్భిజ్జజాతి :- భూమధ్య రేఖనుండి గల దూరమునుబట్టి ఉష్ణోగ్రతలు, వర్షపాతము నేలలు ఎట్లు మార్పుచెందునో, అట్లే అవి పర్వతపార్శ్వములందు భూమట్టము నుండి గల ఎత్తునుబట్టి కూడ మారుచుండును. అందుచే ఉన్నత పర్వతశ్రేణులలో క్రిందినుండి శిఖరమువరకును పైన చెప్పిన తరగతుల అరణ్యములన్నియు ఉండవచ్చును. పర్వతపార్శ్వములందు అరణ్యము లిట్లు మాండలిక ముగ