Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విమల అను నాగరాణి అతని బోధలు వినుట కువ్విళ్ళూరు చుండెను. కాని అతనిని తన రాజ్యమునకు రప్పించుట కెట్టి అవకాశమును లేకపోయెను. ఇరందాతి అను ఆమె ముద్దుకూతురు తన ప్రియుడైన పున్న కుడను యక్షదండ నాథునిపై ఆకార్యభారము మోపెను. అతడు ద్యూత క్రీడయందు ఇంద్రప్రస్థ రాజును జయించి విధుర పండితు నోడుచుకొనెను. ఇరందాతి తూగుటుయ్యాలలో ఊగు చుండుట, పున్నకుడు ఇరందాతిని కలసికొనుట, నాగ రాజు తన కూతును పున్నకుడు వివాహ మాడదలచిన విషయమునుగూర్చి తన చుట్టములతో ఆలోచించుట, ఇంద్రపస్థరాజు కొలువుకూటము, అక్షక్రీడ, పున్నకునితో కూడ విధుర పండితుడు పయనించుట, నాగరాజు ప్రాసా దమున ఆతడు మతబోధ కావించుట, సంతోషకరమైన వివాహము. మున్నగు దృశ్యము లన్నియు కథ విచ్ఛి న్నము కాకుండ మిక్కిలి మెలకువతో చిత్రింపబడినవి. మొదటిగుహ యందలి శంఖపాల శిబిజాతకములు, రెండవగుహ యందలి హంసజాతకము, 16 వ గుహ యందలి హస్తి, వుమ్ముగ్గజాతకములు మున్నగు పెక్కితర జాతకములు ఆనాటి నిరుపమానమైన చిత్రరూప కథన కళకు నిదర్శనములుగా నున్నవి. శిథిల ప్రాయములై పోయినను బుద్ధుని జీవితమునుండి గ్రహింపబడిన పెక్కు చిత్రములు రూపకోచిత రామణీయకములో అప్రతిమాన ములై ఒప్పారు చున్నవి. డా. పు. శ్రీ అడవులు :—1. ఉపోద్ఘాతము :- సాంకేతిక ముగా 'అడవి ' అనగా అతి సూక్ష్మమగు ఉద్భిజ్జము మొదలుకొని అత్యున్నతమగు వృక్షములవరకు వివిధ పరిమాణ భేద ములతో కూడికొనియున్న జీవ ప్రపంచపు సంఘము అని వర్ణింపబడుచున్నది. కాని దానికిగల సామాన్యభావమున కే ఈ దిగువ వ్యాసమునందు ప్రాధాన్య మీయబడుచున్నది. "అడవి” “అరణ్యము” అనబడుచున్న వృక్ష సంఘముల పెరుగ పరిణామములు ఒక ప్రదేశము యొక్క శీతోష్ణములమీదను, భూగర్భ సంబంధమగునవియు, నేల యొక్కయు స్థితిగతులమీదను ఆధారపడి యుండును. ఉష్ణోగ్రత, వర్షపాతము, నేలలు వీనిలోని భేదముల ద్వారా స్థితిగతులలో కలుగు మార్పుల ఫలితముగ. ఉద్భిజ్జ - 111 అడవులు జాతిలో మార్పు లేర్పడును. పై కారణములు మార్పు లేక ఒక స్థితియం దున్నపుడు ఆ ఉద్భిజ్జ జాతిలో సామ రస్య మేర్పడును. బాహ్యకారణములు, ముఖ్యముగా మానవుడు జోక్యము కలుగజేసికొన్నచో దానికి భంగము కలుగును. నేటి ఉద్భిజ్జ జాతి అతి ప్రాచీన యుగములలో (Geological ages) నున్న ఉద్భిజ్జముల సంతానమే యని శిలారూప జీవపరిశీలన వలన తెలిసినది. ఊర్ధ్వ మత్స్య యుగపు శిలారూప జీవముల (Upper Domain Fossils) వలన అప్పటి ఉద్భిజ్జ జాతికిని నేటి ఉద్భిజ్జ జాతికిని చాల వ్యత్యాసమున్నట్లు తెలియుచున్నది. తక్కినవానితో పాటు దేవదారు (Coniferous) జాతి మొక్కలలో మొదటి రకములు అంగారయుగము (Carboniferous period)లో చక్కగా పెరిగినవి. గట్టి దారువుగల మొక్కలు ఖటీ యుగము (Cretaceous period) లో నున్నవి. కాని, నేటి జాతులను బోలిన మొక్కలు తృతీయ యుగము (Tertiary period) లో నున్నవి. జంతుజా తీవలెనే ఉద్భిజ్జజాతికూడ మొదట ఉత్ప త్తియై, తరువాత అభివృద్ధిచెంది, అటుతరువాత కాలము గడచిన కొలది పరిణామమున వివిధ రూపములను బొందును. ఉద్భిజ్జములలోను, వాని జాతులలోను గల ఈ వివిధ భేద ములనుబట్టి వివిధ మండలము అగుపడుచున్నవి. ఉష్ణో గ్రత, వర్షపాతము, గాలి ఒత్తిడి, నేలలు, అక్షాంశములు, ఎత్తు అనువానిపై ఆధారపడి ఆయా మండలములలో వేరు వేరు పరస్థిక (Ecological conditions), బాహ్య స్థితిగతులు ఏర్పడుచున్నవి. 2. ప్రపంచవ్యాప్తి - వివిధ శీతోష్ణ పరిస్థితులు, వానితో గూడిన వర్షపాతములు ఎట్లు వ్యాప్తిచెందియున్న వో దానికి అనుగుణముగా వివిధ తరగతుల అరణ్యముల వ్యా ప్తియుండును. అనగా ఒక్కొక్క రకపు శీతోష్ణ పరిస్థితులలో ఒక్కొక్క లక్షణముగల అరణ్యముండును. ఇట్టి అరణ్యములు సహజమగు ఉద్భిజ్జజాతి. మానవుని జోక్యముగాని, మార్పుగాని లేకున్నచో ఆ ఉద్భిజ్జములు ఉష్ణోగ్రత, వర్షము, నేల విని యొక్క పరస్పర క్రియల ఫలితముగా పెరుగును. అరణ్యముల స్థూలవర్గీకరణము, వ్యాప్తి ఈ దిగువ నీయబడినది:- ఆ