Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా మిక్కిలి రమణీయమైన కావ్యమునందలి నందుని కథను వస్తువుగా గ్రహించినట్లు తోచుచున్నది. కాని ఒకటి రెండు దృశ్యములు తప్ప మిగిలిన చిత్రమంతయు పూర్తిగా పాడైపోయినది. నందుని శిరోముండనము, బలవశ్సన్యాస స్వీకారముచే అతడు పొందిన విచారము, వాయుమండల ప్రయాణముకల దృశ్యములను మాత్రము కొంచెము గుర్తు పట్టవచ్చును. "మరణించుచున్న రాకుమారి" అని పేరుపొందిన తుది దృశ్యము మిక్కిలి ప్రసిద్ధమైనది. నందుని ప్రియురాలైన సుందరి విరహ వేదన పొందుచు, పరిచారకు డొకడు పట్టుకొన్న ఆతని కిరీటమువంక ఆత్రముతో చుండుట అందు వర్ణితమైనది. ఆతనికై పైకెత్తి చూచు కృతహస్తులైన చిత్రకారులచే అత్యంత నిపుణముగా చిత్రింపబడిన మరి రెండు ముఖ్య జాతక కథ లున్నవి. అందొకటి మొదటి గుహలోని మహాజనక జాతకము, రెండవది రెండవ గుహయందలి విధుర పండిత జాతకము. "ధమ్మ" వైభవమును ప్రత్యక్షముగా ప్రద ర్శించు 'మొదటి జాతకమునందలి కథలందు ముఖ్యము లును, నాటకోచితములు నైన అంశములందే దృష్టి కేంద్రీకృత మగునట్లుగా ఎన్నుకొని అమర్పబడియున్నవి. ఇరువురు సోదరుల నడుమ యుద్ధము జరుగుట, అందొక శు రెండవవానిని చంపుట, గర్భవతియైన రాణి మరొక రాజ్యమునకు పారిపోవుట మున్నగు నీరస విషయము లతో కూడిన కథయందలి తొలి సన్ని వేశములు విడిచి వేయబడినవి. నిజమునకు అసలైన కథ తరువాత ఆరంభించును. గర్భిణియైన రాణికి ఉదయించిన కుమారుడు మహాజనకు డను పేరుతో పెరిగి, యువకుడై పణ్య వస్తుసముదాయముతో సముద్రముపై, సువర్ణ భూమికి పయనించును. రూపకోచితమైన నౌకాభంగ దృశ్యమును, తిమినక సంకులమైన సముద్రమున మునిగి పోవుచున్న మనుష్యుని ముఖమునందలి దారుణమైన భయాధిక్యమును, మిక్కిలి సహజముగా చిత్రింపబడినవి. అత డొక దేవతచే రక్షింపబడి మిథిలానగరము చేరు కొనును. తరువాత కొన్ని దృశ్యములు మరల విడిచి వేయ బడినవి. కారణ మేమన ఇవి అంతకుముందే మరణించిన రాజ్యావహర్త కుమార్తెను మహాజనకుడు వివాహము 110 చేసికొన్న విషయమునకు సంబంధించినవి. వైరాగ్య ప్రధానమైన ఈ కథా నిర్మాణములో ఇట్టిదాని కంతగా ప్రాధాన్యము కనుపింపదు. లౌకిక భోగములయెక వై ముఖ్యము వహించిన మహాజనకుని నిర్విణ్ణ ప్రకృతియు, గీత నృత్యాదులచే రాణి అతని మనస్సు నాకర్షింప యత్నించుటయు మిక్కిలి విస్తృతముగా వర్ణింపబడినవి. పరిచారిక పాద సంవాహన మొనరించుచుండగా రాణి రాజున కానుకొని శిబిరమున కూర్చున్న దృశ్య మొకటి కలదు. కుడిప్రక్క గానముతో కూడిన దృశ్యము సాగు చున్నది. నర్తకి చిత్రము మిక్కిలి కోమలమును, మనో జ్ఞమునై యున్నది. శిబిరమునకు క్రిందుగా స్త్రీ యొక తె గుడిసెలో లేప నౌషధమును తయారుచేయుచున్నది. రాజు ముఖ రేఖలనుబట్టి అత డీ వినోదమునం దేమియు ఉత్సాహము చూపుటలేదని తెలియుచున్నది. తరువాత శిలా గుహలోనున్న ఒక సన్యాసిచేయు మత బోధలు వినుటకై రాజు గజారూఢుడై పురద్వారము వెలువడి వచ్చుచున్నట్లును, గుహ ముందు కూడియున్న జనసమూ హము నడుమ అతడు ముకుళిత హస్తుడై నిలబడినట్లును చిత్రింపబడినది. పిమ్మట ప్రాసాదమున మహాజనకుడు తాను ప్రపంచమును పరిత్యజింప నిశ్చయముచేసికొన్నట్లు రాణి కెరిగించుట సూచితమైనది. అనంతరము రాజు గుఱ్ఱము నెక్కి రాజధాని విడిచి వెళ్ళును. దీని క్రింద భర్త ననుసరించి ఏగుచున్న రాణి 'సివతి' దీనమైన చిత్రము కనిపించును. దురదృష్ట వశమున ఇచ్చటి చిత్రమంతయు పూర్తిగా శిథిలమయిపోయినది. దేవాలయమువంటి ఒక కట్టడముదగ్గర ఉన్న బొమ్మల ఊర్ధ్వభాగములు మాత్రమే దృశ్యము లగుచున్నవి. ఆ జనసమూహమున రాజు చిత్రము మిక్కిలి ప్రాధాన్యము వహించియున్నది. విధుర పండిత జాతక మును సూచించు చిత్రము - పైదానికంటే మేలుగా రక్షితమైనది. అది రెండవ గుహ లోని కుడి కుడ్యమునందు చాల భాగమును ఆవరించి యున్నది. దానిక్రింద ఉన్న స్వల్ప వైశాల్యముగల స్థలము'లో దివ్యావదానముమండి గ్రహింపబడిన పూర్ణావ దాన మను మరొక కథ చిత్రింపబడినది. విధుర పండితుడు ఇంద్రప్రస్థ రాజునకు మంత్రిగా ఉదయించిన బోధిసత్వుడు. అతడు సుప్రసిద్ధు డగుటచే