Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా దకుని బారినుండి ఒకడు తప్పించుకొని పారిపోవు మండుట వర్ణింపబడినది. దీనికి పైని వినాశకరమైన ఈ అభ్యాసమును వర్ణింపుమని ప్రజలు సుదాసుని వేడుకొను మన్నట్లు కనవచ్చుచున్నది. బాణ జేపమును సూచించు దృశ్యమునకు క్రింద సుదాసుడు తనపై దండెత్తివచ్చిన సేనలతో స్థిరముగా నిల్చి పోరాడుట వర్ణింపబడినది. ఈ చిత్రరచన కెడమవైపున నిష్కాసనానంతర మడవిలో జరి గిన వృత్తాంతములను సూచించుచున్న చిత్రములన్ని యు శిథిలము లై పోయినవి. సర్వావయవ హోమమునకై సుదాసుడు పట్టుకొన్న ఏకశత రాజకుమారులలో ఒక తును, కడకు ఆతని పరివర్తనమునకు కారణభూతుడైన వాడును అగు బోధిసత్వసుత సోముడు పద్మాకరమున తాను పట్టుకొనబడిన సమయమున సుదాసుని భుజముపై ఉన్నట్లు కానిపించును. చిత్రరూపమున చెప్పబడిన సుందరములైన కథలలో మాతృపోషక జాతక మొకటి. అది మాతృదేవోభవ అను వేదసూక్తికి నిదర్శనమైనట్టిది. బోధిసత్వు డొకప్పు డేనుగుగా జన్మించి ఒక వనేచరునిచే వంచింపబడెను. అడవిలో దారి తప్పియున్న సమయమున ఇంటికిపోవు తోవచూపి అది వనేచరుని కంతకుముందు ఉపకార మొనరించియుండెను. ఆ గజము పట్టుకొనబడి రాజ గజ శాలకు కొనిరాబడెను. తనకు మిక్కిలి ప్రేమపాత్రు రాలయిన చీకు ముసలితల్లి దీనావస్థను తలంచుకొని అది అచ్చట ఎట్టి ఆహారమును గ్రహింప నొల్లకుం డెను. రాజు జాలిపడి దానిని విడిచివైచెను. అన్ని దృశ్యములును చక్కగా అమర్పబడినవి. రాజ పరిచారక పరివృతమై అది తన ప్రియజననీజనకుల కలసికొనుట కై ఉత్సాహమున ఇంటికి పరెగెత్తుటను, పిఠాపుత్ర సుఖసమాగమమును సూచించు చివర దృశ్యములు మిక్కిలి సుందరముగా చిత్రింపబడినవి. కుడిగోడమీద చిత్రింపబడిన సింహలావదానమును గూడ ఇట పేర్కొనవలసియున్నది. ఇందలి కథ దివ్యావ దానము నుండి గ్రహింపబడి వలాహస్సజాతకములోని కొన్ని వివరములచే పుష్టి నొందినది. చిత్రము యొక్క కుడిచివర అడుగున సింహలుని సముద్రప్రయాణమున జరిగిన నౌకాభంగముతో కథ 109 తజ ఆరంభించుచున్నది. అతడును తదనుచరులైన 500 మంది వర్తకులును రాక్షసాంగనలతో కూడిన ఒక ద్వీపమునకు త్రోయబడిరి. అచ్చటి రాక్షస స్త్రీలు సుందరాకారమును వహించి సగౌరవముగా వారికి ఆతిథ్య మొసంగిరి. సింహలుడు మాత్రము వారిచే వంచితుడు కాలేదు. అతడు గుఱ్ఱముగా జన్మించిన బోధిసత్వుని ఆ తి థ్య ము గ్రహించెను. ఆ గుఱ్ఱము అతనిని కొందరనుచరులను తిరిగి వెనుకకు కొనిపోయెను. ఈ చిత్రము రాక్షసాంగనల వినోదోత్సాహములను సూచించు దృశ్యమున కించుక పైని రమణీయముగా చిత్రింపబడినది. కొంత సేపైన తరు వాత ఆ రాక్షస స్త్రీలు చిత్రములో కనబడునట్లుగా తమ యథార్థ రూపములు గ్రహించి మూర్ఖులై అచ్చట ఉండిపోయిన సింహలుని అనుచరులను కబళించిరి. తన్ను తప్పించినందుకు సింహలు డా గుఱ్ఱమునకు కృ కృత జ్ఞ తా వందనములర్పించును. ఆతడొక ద్వారముకడ ఆగుఱ్ఱము ముందు కృతజ్ఞతతో మోకరిల్లి యున్నట్లు చిత్రింపబడి యున్నది. కాని వెంటనే ఒక రాక్షసి సుందరవనితా కారమున ఒక బిడ్డ నెత్తుకొనివచ్చి ఇతడే నా నిజమైన భర్తఅని పల్కును. ఆస్థానదృశ్యమున గల మంత్రి విణ్ణ రూప మాతడు ప్రయత్నించియు రాజు నా సాహస కృత్యమునుండి మాన్పలేకపోయెనని సూచించుచున్నది. దాని ఫలితము ఎడమచివర చూపబడినది. ఆ రాక్షసి రాజును చంపి తిని వేయును. ఆమె అనుచారిణులు అంతః పురమున నున్నవారి నందరిని సంహరింతురు. సంవృత మైన ప్రాసాదద్వారముపై రాబందు లెగురుట చూచి ప్రజలు భీతులైరి. కాని సింహలు డొక నిచ్చెనసాయ మున ప్రాసాదకుడ్యము నెక్కి లోని రాక్షసాంగనల నందరిని బయటికి తరిమెను. సింహలుని సేనలు సముద్రమును దాటుట, గజములు చదునైన అధోభాగముగల పడవలపై ఎక్కుట, మున్నగు తుది దృశ్యములు మిక్కిలి సహజ ముగా చిత్రింపబడినవి. సముద్రతీరమున సింహలుని సేనలకును శస్త్రాస్త్రసన్నద్ధులైన రాక్షసస్త్రీలకును జరిగిన యుద్ధమును విజేతయైన సింహలుని పట్టాభి షేకమును మిక్కిలి ఉత్తమ తరగతికి చెందిన దృశ్యములు. 16వ గుహ యందలి చిత్రములు చిత్రించిన చిత్ర కారుడు సంస్కృతమున అశ్వఘోషునిచే రచింపబడిన