Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా పునరుక్తి గోచరింపదనియు గ్రిప్ఫిత్తు చెప్పుచున్నాడు. సుపర్ణులు (పక్షిశరీరము మానవ పూర్వకాయముతో కూడి యుండును.) గరుడులు, యక్షులు, గంధర్వులు, అప్సర సలు మున్నగు కల్పిత కథా పాత్రలయు, పౌరాణిక వ్యక్తులయు బొమ్మలు స్థలమును నింపుటకై ఉపయో గింపబడి ఉన్నవి. అవి బాణకవి కాదంబరిలో వర్ణించిన ఉజ్జయిని యందలి చిత్రిత మందిరములను స్మరణకు తెచ్చుచున్నవి. ఆజంతా చిత్రములందలి ప్రకృతి :- చిత్రకారునికి గల ప్రకృతి ప్రీతియు, వివిధ ప్రకృతి దృశ్యములను సౌందర్య వైభవములతో వర్ణించుటయం దాతడు చూపు నేర్పును ఇక్కడ వేరుగా నొక్కి వాక్రువ్వనక్కరలేదు. 17 వ గుహలో చిత్రింపబడిన పెక్కు జాతక కథలలో ఉత్తమ శ్రేణికి చెందిన కథనాత్మక చిత్రములకు అసంఖ్యాకము లైన నిదర్శనములు ఉన్నవి. ఇతర గుహలలో కూడ ఇట్టివి కొన్ని కలవు. ఈ గుహలో చిత్రింపబడిన ఛద్దన, మహాకపి, హస్తి, హంస, శరభంగ, మత్స్య, మహిష, రురు, శిబి, నిగ్రోధ, మిగ జాతకములను గూర్చి సంగ్రహ ముగ సూచించుటకు కూడ ఇచ్చట తావు చాలదు. వెస్సంతర, సుతసోమ, మాతుపోషక జాతక ములనుగూర్చి సంగ్రహముగా చెప్పవలసియున్నది. వెస్సంతర జాతకము గోడతో కలిసిపోయినట్లు కట్టబడిన రెండు స్తంభముల నడుమ గల ఎడమప్రక్క గోడనంతను అవరించియున్నది. అది ఎడమప్రక్కనుండి ఆరంభించును. అచ్చట వెస్సంతర రాజకుమారుడు తన నిష్కానన వృత్తాంతమును భార్య యైన మడ్డి(Maddi) కెరిగించును. అతని యందలి లోపము అతిమాత్రమైన ఔదార్యగుణము. వర్షమును కలిగింప జాలు శక్తిగల ఒక దివ్యదంతావళము నాతడు దానము చేసిపై చినప్పుడు, ప్రజలు గగ్గోలు చేసి రాజైన అతని తండ్రిని అతనిని దేశ బహిష్కృతుని చేయుమని బలవంత పెట్టిరి. అతడు తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పుట, నాలుగు గుఱ్ఱములను పూన్చిన రథముపై అతడు తన కుటుంబముతో కూడ విపణివీథిని పోవుట, ఆశ్రమమున అతని జీవితము, వన్యమృగములచే ఆశ్రమమునకు రాకుండ ఆపివేయబడిన మడ్డి పరోతమున అతడు తన బిడ్డలను జూజకున కిచ్చుట, బంధవిమోచన ధనముగా 108 వారి తాత ఆ బిడ్డలను తిరిగి యిచ్చుట, మడ్డియు, వెస్సం తరుడును తిరిగి రాజధాని కరుదెంచుట మొదలగు సన్ని వేశము లీ మనోహరమైన కథలో అతి నుందరముగా చిత్రింపబడినవి. వివిధ దృశ్యముల క్రమము కొంత క్లిష్టముగా ఉన్న మాట నిజమేయైనను ముందరి గది కెడమవైపున గల వెనుక గోడపై నున్న చిత్రములో సుతసోమ జాతక ము కూడ -మిక్కిలి చక్కగా చిత్రింపబడినది. సుదాసు డశ్వా రూఢుడై తన పరివారముతో కూడ మృగయార్థమై పురద్వారమునుండి బయల్వెడలుటతో ఈ కథ ఆరంభిం చుచున్నది. ఆ పరివారములో కొన్ని వేటకుక్కలు కూడ ఉన్నవి. అవి ఒక లేడిని తరుముచున్నట్లు కనబడుచున్నవి. తరువాతి దృశ్యములో వన్యమృగసంకులమైన అడవియం దొంటరిగా అశ్వారూఢు డైయున్న రాజు చిత్రింపబడి ఉన్నాడు. ఇంకను కొంతపైని ఈ రాజు నిద్రించుచుం డగా ఒక సింహి ఆతని పాదములను నాకుచున్నట్లున్నది. తరువాత ఆత డొక రాతిపై కూర్చుండియుండును. సింహి ఆతలిముం దుండును. సింహి గర్భిణియై ఒక మానవ శిశువును. రాజునకు ప్రియకుమారుడు. కనుట మొదలగు సన్ని వేళములు తొలగింపబడినవి. తరువాత చూపరులు ఆశ్చర్యచకితులై చూచుచుండ ఆ సింహి బజారువీధిని ప్రాసాద ద్వారము వంక కరుగుచున్న సుందరమైన దృశ్యము కానబడును. కుడిప్రక్క అ సింహి రాజసన్ని ధికి ప్రవేశ పెట్టబడిన దృశ్యమున్నది. రాజు కుమారుని గ్రహించి తన తొడపై కూర్చుండబెట్టుకొనును. దీని క్రింద సుదాస రాజకుమారుని విద్యాభ్యాసము చిత్రింపబడినది. కుడిప్రక్క అత డొక బల్లపై వ్రాయుచున్నాడు. ఎడమ ప్రక్క అతడు బాణములు వేయుట అభ్యసించుచున్నాడు. దాని కెడమవైపున సుదాసుని పట్టాభిషేకము చూప బడినది, అతని తల్లి సింహి అగుటచే అతడు నరమాంస భక్షకుడగును. తరువాత నున్న మూడు దృశ్యములలో తొలుత వేయబడిన మనుష్యుని దేహమునుండి మాంసము కోయుట, అట్లు తెచ్చిన మాంసమును వండుట, దానిని రాజునకు వడ్డించుట మున్నగువానిచే అది సూచింప బడినది. తరువాత సుదాసుడు వేట కరుగుచున్నట్లు చిత్రింపబడిన చట్రమునకు వెనువెంటనే పైని అంతఃపుర