Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రభావముకంటే అత్యంత విలక్షణమై యున్నవి. కాని బౌద్ధ సన్యాసుల శతాబ్దుల ఆధ్యాత్మికానుభవమును, అట్టి అనుభవ ప్రకటనమునకై కల్పింపబడిన కళాత్మక చిహ్న ములును, మానవోద్యమ పూర్ణ పరిథిలో మహోన్నత స్థానము నలంకరించుచున్న వనుటకు వెనుదీయనక్కరలేదు. 4. చిత్రలేఖనము పదవగుహలో ఇప్పటికిని నిల్చియున్న కొన్ని చిత్ర లేఖనములు క్రీ. పూ. 2 శతాబ్దికి చెందినవని నిస్సంశయ ముగా చెప్పవచ్చును. పడమటి భారతదేశము నందలి కొన్ని గుహలలోని చిత్రలేఖన చిహ్నములను, కాలము నిర్ణయించుటకు వీలులేక సాధారణముగా శిలాయుగము నకు సంబంధించినవిగా తలపబడుచున్న శిలాచిత్రలేఖనము లను, రామఘర్ కొండలలోని జోగిమర గుహ యందలి అ ఆ అస్పష్టములును, సందేహాస్పదములునైన చిత్ర లేఖన ఖండములను విడిచినచో నివియే ప్రాచీన చిత్రలేఖనమున నిప్పటికిని నిల్చియున్న నిదర్శనములని చెప్పవచ్చును. కాని క్రీ. పూ. 2 వ శతాబ్దికి చెందిన పదవ గుహ యందలి చిత్రములలోని అతి పరిణతమైన కౌశలమును చూచినచో స్థితిని చెందుటకు ఒకటో, రెండో, ఇంకను ఎక్కువో సహస్రాబ్దులు పట్టియుండునని వ్యక్తమగును. ప్రాచీన భారతదేశమున చిత్రలేఖన కళ మిక్కిలి పరి పక్వమైన స్థితిని చెందియుండెనని సారస్వత నిదర్శనముల వలన తెలియుచున్నది. క్రీస్తు పూర్వపు శతాబ్దులలో ఇతర లలితకళలు, ముఖ్యముగా శిల్పకళ, పొందిన అభ్యు దయము భారతదేశ చిత్రలేఖన కళాప్రాచీనతనుగూర్చిన ఈ అభిప్రాయమును బలపరచుచున్నది. చిత్ర లేఖనకళ యొక్క దేశీయ స్వభావమునుగూర్చి కూడ ఎక్కువగా వాదోపవాదములు చేయనక్కరలేదు. అతి ప్రాచీన కాలమున చిత్రలేఖనములో అంత మహాభ్యు దయము సాధించిన ఏ విదేశమును భారతదేశముపై ఏ విదేశమును భారతదేశముపై సాంస్కృతిక ప్రభావమును ముద్రించెనని నిరూపించుటకు వీలులేదు. ప్రాచీనకాల మందలి శిల్ప వాస్తు శాస్త్రము అను నిష్పాక్షికముగా పరిశీలించినచో నెవ్వరైనను దక్షిణాపథమునందలి గుహా దేవాలయములు పుట్టుక యందును పరిణామమందును దేశీయములేయను నిర్ణయ 103 మునకు వత్తురు. అప్పటి శిల్పము సమ కాలమునందో అంతకుముఁదో ఉండిన దారు, ఇష్టక శిలానిర్మాణముల నుండి అనుకరింపబడినను ఆ మూలప్రకృతులుకూడ నిశ్చ యముగా దక్కనుకు సంబంధించినవే. అవి లలిత కళలు దక్కనులో స్వతంత్రముగా నుప్పతిల్లియుండుటయేకాక ఉత్తరహిందూస్థానము నందుకంటే ప్రాచీనత ర ము లై ఉండెనని నిరూపించుచున్నవి. క్రీ.పూ. రెండవ శతాబ్దిలోని చిత్రలేఖనము - పదవ గుహలోను, సుమా రేబడియో, వందయో సంవత్సరము అంతకంటే అర్వాచీనమైన తొమ్మిదవ గుహలోను గల ప్రాచీన చిత్రలేఖనములందు చిత్రితములైన మానవ రూపములు ప్రత్యేక మైన రూపు రేఖలు, వేషభూషణములు కల దేశీయప్రజల వేయై యున్నవి. చిత్రకారుడు వానిని చిత్రించునపుడు తన జాతికే చెందిన అప్పటి ప్రజలను దృష్టి పథమున నుంచుకొని యుండెననుట స్పష్టము. వారు అండాకార ముఖములును, పొట్టి ముక్కులును, దళమైన పెదవులును, సామాన్యమైన ఉన్న తియుగం దక్క మునందలి నేటి దేశీయప్రజలను పోలియుందురు. పురుషులు నడుము లందంతగా వెడల్పులేని వస్త్రములు ధరింతురు. స్త్రీ లధో భాగమున నట్టి వస్త్రాచ్ఛాదనమే కలిగియుందురు. కాని పైనొక చోశీయు, తలపై ఆధునిక భారతీయ పద్ధతి నొక వోణీకూడ ధరింతురు. వారు దీర్ఘములైన తమ కేశములను సర్పముల పడగల ఆకారమున తమ యౌదలలపై రిబ్బనులతో కట్టి యుంచుకొందురు. వారికి వివిధములైన భూషణములు కలవు. అందు చక్రాకార ములైన పెద్ద కర్ణాలం కారములును పలుమాదిరులు గ ల లోహ నిర్మిత కంఠహారములును, ముఖ్యములైనవి. వారు యోధజాతికి చెందిన ప్రజలనుట స్పష్టము. యోధులకు బల్లెములు, గదలు, ధనుర్బాణములు, ఖడ్గ ములు. కొడవలివంటి వంకరకత్తులు కలవు. వారు పొట్టి చేతుల చొక్కాలు ధరింతురు. వారిలో నొకని కగ్రమున తలపాగ రూపముగల యొక పెద్ద శిరస్త్రాణముకలదు. కర్ణ సంరక్షణమునకై దానినుండి ఇరువంకల రెక్కలవంటి వస్త్రఖండములు వ్రేలాడుచుండును. అట్లే ఆ శిరస్త్రాణ మును తలపై సుస్థిరముగా నుంచుటకు కాబోలుగడ్డము క్రిందినుండి వచ్చునట్లుగా ఒక పట్టికట్టబడి యున్నది.