Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా ఆ కనబడునట్లు పద్మాసనాసీనుడై యుండెను. ఆత డొక పారదర్శకమగు దుస్తును ధరించి యుండెను. ఆ దుస్తు యొక్క క్రింది అంచు చీలమండలకు కొంచెముపైగా ఒక రేఖచే గుర్తింపబడేను. కేశ సముదాయమును సాంప్రదాయకమగు రీతిలో మెలివేయబడి నడినెత్తిన ఉష్ణషమువలె ముడి అమర్చబడెను. శిరస్సునకు వెనుక వై పున ఒక చిత్రితమగు చక్రాకార ఫలకము కలదు. ఇది ప్రభాపరి వేషమును సూచించును. ఇద్దరు మత్త గంధర్వులు స్వర్గధామమునుండి పుప్పోపహారములను తెచ్చుచున్నారు. సింహాసనమునకు వెనుక, బుద్దున కిరు వైపుల గొప్ప కిరీటమును ధరించిన ఒక్కొక్క రాజ భృత్యుడు కలడు. సింహాసనమునకు ముందు మధ్యభాగ ములో ధర్మచక్రము చెక్కబడెను. ఆ చక్రమున కిరు వైవుల లేళ్ల బొమ్మలుకూడ కలవు. లేళ్ల వెనుకభాగ మందు కొందరుభక్తుల ప్రతిమలుకూడ కాననగును. ఆ భక్తులు పలురక ములగు భంగిమలలో చూపబడిరి ; కొందరు నేలమీద ఆసీనులై యుండిరి, కొందరు మోకాళ్ళమీద నిలుచుండిరి, మరికొందరు కాళ్ళను చేర్చి, ఒకటి భూమిని తాకునట్లును, మరొకటి పై కెత్తబడినట్లును కూర్చుండి యుండిరి. ఆ సింహాసనముపై తొలువబడిన విషయము సారనాథమందలి మృగదావములోని బుద్ధుని ధర్మోపదేశమును స్పష్టముగా వ్యక్తపరచుచున్నది. బుద్ధప్రతిమ మామూలు మానవ పరిమాణమునకు పూర్తిగా మూడు రెట్లు కలదు. సింహాసనాధిష్ఠితమైన యీ విగ్రహము 10 అడుగుల 8 అంగుళముల యెత్తున ఉన్నది. ఆ మూర్తి ఒక సంప్రదాయకమగు రీతిలో మలుచబడినను ధాని ముఖవై ఖరి అంతర్గత ప్రశాంతతను, ఉదాత్తతను వెల్లడించుచు అత్యద్భుతమై యున్నది. ఆ మూర్తి యొక్క ఆధ్యాత్మిక ప్రభావము ఆ కాలమున అహర్నిశలు వెలుగుచుండు దీపముల సువర్ణ కాంతిచే అనల్పాధిక్యము నొందింపబడినది. ఆ దీపములు కాంతిలో ఆ మహావ్యక్తి యొక్క పెద వులమీది ఆతని దయారు స్వభావమును సూచించు చిరునగవుకూడ వ్యక్తమగు చుండును. ఆ ప్రతిమయొక్క వెడల్పు ఛాతి భుజములతోగూడ ముందు వరకు సింహాసనముమీద 8 అడుగుల 10 అంగుళములు, 102 గుప్తయుగము నాటి సారనాథ క్షేత్రము నిస్సందేహ ముగా బౌద్ధ శిల్పము యొక్క అభివృద్ధికి అపారమగు దోహదమిచ్చినను, గుప్తయుగము అవశ్యముగా హిందూ మతము యొక్క పునరుద్ధరణకు, బౌద్ధమతము యొక్క క్షీణదశకును చెందిన కాలమని మరువకూడదు. ఇట్టి పున రుద్ధరణాత్మకమగు మతోద్రేకముచే స్పృశింపబడనట్టియు విదేశీయ కళా సంపర్కముచే మిశ్రితము కానట్టియు ఏకైక బౌద్ధ కేంద్రము క్రీ. శ. అయిదవ, ఆరవ శతాబ్ద ముల నాటి అజంతాయే అయియున్నది. కనుక అజంతా యందలి శిల్పము, వర్ణచిత్రలేఖనము వాటి మతవిషయక, ఆధ్యాత్మిక ప్రభావములం దొక విశిష్ట స్థానమును అలంక రించియున్నవి. అత్యున్నత కళాప్రమాణములతో పరిశీలిం చిన అజంతా శిల్పము ఆధ్యాత్మిక కృషి యొక్క అత్యంత పరిపూర్ణ సాధనముగను, ఆధ్యాత్మిక భావములను, అభి లాషలను, ఉద్రేకములను, అనుభవములను ప్రకటించుట యందు ఆదర్శసాధనముగను తోడ్పడుచున్నది. ఆశిల్పము బహుళః తరువాత హిందూ ప్రతిమలందు సాధింప బడిన నిగూఢ ఆధ్యాత్మిక భావములందును, విశ్వాత్మకత యందును కొరవడియుండవచ్చును. కానిఇది అని వార్యము కావచ్చును. ఏలయన బౌద్ధులు భగవంతు డొకడు కలడని యంగీకరింపలేదు. అట్టి సర్వాంతర్యామియైన భగవం తుని అర్చారూపమైన విగ్రహ కల్పనమును గూడ వారు సమర్థింపలేదు. బౌద్ధమతము దాని సిద్ధాంతముననుసరించి . అవశ్యముగా భౌతికవాద మత మైయున్నది; కాని అది నేడు మనము గాంచు తర్క ప్రభేదము అందలి ప్రాపంచక భౌతిక వాదము వంటిది కాదు. అది యొక ఉదాత్తమగు భౌతిక వాదము. అనంతుడును, సర్వ శ క్తిమంతుడును అయిన భగవంతుని అధికారమును గాని, ఆతని నిశ్వసిత ములై మార్పరానిపైన ఆధ్యాత్మిక గ్రంథముల ప్రభావ మునుగాని బౌద్ధు లంగీకరింపరు. వీరి భౌతిక వాదమునందు ఈశ్వరుని చేతను, వేదము చేతను నిబద్దము కాని ఆధ్యా త్మిక సాధనకు స్వేచ్ఛ యొసంగబడినది. సాధారణముగా బుద్ధ ప్రతిమయొక్క ఆధ్యాత్మికతయు, అలౌకిక మహ త్త్వమును నటరాజ విగ్రహమువంటి హైందవ ప్రతిమల 6 అడుగుల 8 అంగుళములు మరియు మోకాలినుండి మోకాలి 8