Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జంతా సంగీత నాట్యము లీ ప్రజలకు సాంప్రదాయిక లక్షణ ములుగా ఉండెను. మతాలయములకు సంబంధించిన సాంప్రదాయిక సంస్థలలో పరిణతములైన వాద్య పరికర ములును, సుశిక్షితములైన నర్తకుల మేళములును నెల కొని యుండెను. గాయక నర్తకులతో కూడిన ఈ మేళ మున పదునై దుగు రుందురు. అందరు స్త్రీలే. అం దిద్దరికి పొడుగైన బాకాలు కలవు. మిగిలినవారు చేతులతో తాళము వేయుచునో, నాట్యము చేయుచునో కనిపించు చున్నారు. కాలమును సూచించుటకో సంగీతమునందు లయా పరాకాష్ఠను కలిగించుటకో కరతాళ పద్ధతి ఇంకను అవలంబింపబడుచునే యున్నది. నర్తకులలో పవిత్ర వృత మునకు మిక్కిలి సమీపమున నున్న ఆమె శరీరమునకు సర్పాకారమున మెలికలతో కూడిన చలనము కలిగించు టకో యన చేతులను పైకెత్తి వింతగా త్రిప్పియున్నది. మిగిలిన యిరువురు నర్తకుల విన్యాసములును, అడుగు లును ప్రత్యేక భారతీయ సంప్రదాయమునకు చెందియు న్నవి. ఆధునిక నాట్యములలో కూడ నట్టివానిని మనము చూడవచ్చును. కొందరు గాయకులును, నర్తకులును అందమైన అల్లికతో కూడిన బల్లల(Stools) పై కూర్చుండియున్నారు. వారి వేషములును, భూషణములును ఈ దృశ్యమునందలి రాజాంతఃపుర వనితల వానికంటే భిన్నములుగా లేవు. ఈ వివరములను బట్టి దేవాలయములకు సంబంధించిన ఈ గాయనులును, నర్తకులును జీవితమున గౌరవార్హ మైన స్థితిని పొందియుండిరే కాని, ఏ విధముగను నిరసింప బడుచుండలేదని తెలియుచున్నది. న ర్తకుల కేశాలంకరణ విధానములు రాజాంతఃపుర స్త్రీలవానివలెనే వివిధ విన్యాసములు కలిగి యున్నవి. అందు కొన్ని మిక్కిలి విస్తృతములై యుండగా కొన్ని తల ఎడమవైపున పాపటతీయు పద్ధతితో కూడి మిక్కిలి సరళములుగా నున్నవి. అంతఃపుర కాంతల వేష భూషణములు నర్తకుల వేష భూషణముల వలెనే యున్నవి. వారు ధరించు నగలలో కర్ణభూషణములును, కంఠహారములును, దండకడియము లును, గాజులును కలవు. గాజు లొ కాలమున దక్కనులో ప్రచారమం దుండిన వానివలెనే శంఖద్రవ్యము (couch) 104 తోడనో, దంతముతోడనో చేయబడినట్లు కనబడుచున్నవి. మాస్కి, పైఠను, కొండాపురము మున్నగుచోట్ల జరిగిన ఖననములలో నట్టివి కుప్ప తెప్పలుగా కనిపించినవి. ముంజేయి అంతయు ఆచ్ఛాదిత మగునట్లుగా అట్టివి పెక్కు ధరింప బడుచుండెడివి. దక్కనునందలి లంబాడీల వంటి ఆదిమ జాతులవారిలో అట్టి ఆచార మిప్పటికిని నిల్చియున్నది. కొందరు స్త్రీలకు తలలను, వీపులను ఆచ్ఛాదించు పెద్ద రుమాల్లో, అవకుంఠనములో కలవు. ఇవి ఈ గచ్చు చిత్రము (Fresco) నందేకాని తరువాతి అజంతా చిత్రలేఖనములలో కానవచ్చుటలేదు. ఈ దృశ్య మెచ్చటిదో ఇంకను పూర్తిగా గుర్తింపబడ లేదు. ఇది యొక రాజు తన పరివారముతో బోధివృక్ష మును పూజించుటకై వచ్చు సన్ని వేశమును సూచించు చున్నది. బహుళ ః ఆ చెట్టునకు సమీపముగా నిలబడి యున్న బాలుని విషయమైన మ్రొక్కు చెల్లించుటకై ఆత డరుదెంచి యుండును. ఆత డేదో ప్రార్థనను పఠించు చున్నాడు. అంతఃపుర కాంత లందరును ఆ కర్మకలాప మున పాల్గొనుచున్నారు. ఒక కాంత శిరస్సు మూడు నెమిలి ఈకలచే నలంకరింపబడి యున్నది. రాజు కిరీట మేదియు ధరింపలేదు. కాని జుట్టు ముడిచుట్టును పాము పడగ ఆకారమున అమర్చబడిన కొన్ని భూషణములను ధరించి యున్నాడు. ఈ చిత్రముల చిత్రణము భావనయందును, నిర్వహణ మందును కూడ సుపరిపక్వమైన శిల్పమును సూచించు చున్నది. ఈ శిల్ప మిట్టి స్థితిని పొందుటకు వెక్కు శతాబ్దులు పట్టియుండును. ఈ గచ్చు చిత్రమునందు చిత్రింపబడిన బొమ్మలకును కొండనే, బెడ్స్, కార్లేల యందలి చైత్యములలోని భవనాంగణము లందును, గోడలపైని, స్తంభములపైని చెక్కబడిన శిల్పములందలి బొమ్మలకును ఆఖం కారిక వివరముల విషయమున సన్నిహితమైన సాదృశ్యము కనవచ్చుచున్నది. ఈ చిత్రలేఖకుడు మానవజీవితమును మత ప్రాపంచిక రంగములు రెంటను నిరూపించుటకు యత్నించినాడు. ఈ గచ్చు చిత్రము నందలి బొమ్మల చిత్రణము రాత్త్విక భావములనేకాక ప్రపంచ సుందర సన్ని వేళముల యెడ గల సానంద దృక్పథమునుగూడ వ్యక్తము చేయుచున్నది.