Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వ : కావచ్చును. దాని తీరు తియ్యములు మనకు తెలియవు, మన ప్రణాళిక భిన్నముగ నుండగలదు. ఆంగ్లము వంటి గొప్ప భాషలలో ఎన్ని తీరుల విజ్ఞానసర్వస్వములు లేవు? లక్ష్మీ; "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన." మీరు నాయకత్వము వహింపుడు. నేను అనుసరించి వత్తును. కనీసము సుస్పష్టమైన ప్రణాళిక నైనను మనము సిద్ధము చేయగల్గినచో అది భావి సాహిత్యకు లకు ముడిసరకుగ ఉపయోగపడవచ్చును " అట్లే జంకుకొంకులతో 1958 సం. 15 అక్టోబరు ప్రాంతమున ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలుగుమందిరమునందు పై ఇరువురును సమావేశమై గణాధిపతిని స్తుతించి, సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ నిర్మాణ యత్నమును ఆరంభించిరి. కోళమునందు చెప్పవలసిన ప్రధాన విషయములకు విశ్వవిద్యాలయమే ఒరవడిగా చేకొనబడెను. ప్రతి శాస్త్రమునకు సంబంధించిన ముఖ్య విజ్ఞానమును సంగ్రహరీతిలో జనుల కంద జేయుట లక్ష్యముగా గ్రహింపబడెను. విజ్ఞానము అనంతమైనది. దానిని ఒక్క గ్రుక్కలో ఆపోశనము పట్టలేము. కావున ప్రతి శాస్త్రమును గూర్చియు పరిమిత సంఖ్యగల శీర్షికలు ఏర్పాటుచేయ నిశ్చయము జరిగెను. ప్రణాళికానిర్మాణము చాలవరకు పూర్తిఅయినతర్వాత అప్పటి హైదరాబాదు ముఖ్యమంత్రులును, బహుభాషా వేత్తలును, సహృదయులును అయిన డాక్టరు బూర్గుల రామకృష్ణారావుగారికి ప్రణాళిక ను సమర్పిం చుటయు, దీని నిర్వహణభారము వహింప సమితికి అధ్యక్ష పదవిని స్వీకరింపగోరుటయు జరిగినవి. శ్రీవా రిట్లు హెచ్చరించిరి. ముఖ్యమంత్రి : విజ్ఞానసర్వస్వ నిర్మాణమా! సుసంపన్నమైన తెలుగు భాషాసమితి నిర్వాహకులే దీనితో పెనగు లాడుచున్నారు. మీకు విజయమెట్లు కలుగును? లక్ష్మీ: ఇది సంగ్రహకోళము, మన సాహిత్యకులు దీనిని నిర్వహించుటకై ఉత్సాహవంతులై యున్నరు. ముఖ్యమంత్రి : సంగ్రహ కోళమైనచో అది వేరుమాట. నిదానముగా నడిపింపుడు, ప్రభుత్వమునుఁ/డి ధనసహాయము జరుగునని పెద్ద ఆశ పెట్టుకొనవలదు. " తెలంగాణములో అన్ని సదుద్యమములకును పితామహులయిన ఆంధ్రపితామహ మాడపాటి హనుమంత రావు పంతులుగారు “జాగ్రత్తతో, అచంచల దీవి తో దీనిని కొనసాగించు"డని హృదయ భారముతో నాశీర్వదించిరి. మమ్ముల సంపదను చూచినచో తెలుగు శాస్త్ర శాఖకే ఒక ప్రత్యేక లకు, ప్రౌఢులకు వేర్వేరు విజ్ఞాన మత్వష్టికివచ్చిన విజ్ఞానసర్వస్వములు అక్టోబరు 2, 1958 సంవత్సరము మహాత్మాగాంధీ పవిత్ర జన్మదినోత్సవ సందర్భమున విజ్ఞానకోశ ప్రథమ సంపుట ముద్రణమునకు ప్రారంభోత్సవము జరిగెను. అప్పటి ఇప్పటికి రెండు సంవత్సరములు దళములు రాల్చుకొన్నవి. ఒక్క సంపుటమును ముద్రించుటకు 20 మాసములు దీర్ఘకా కాలమే. కాని ఈ నడుమ కార్యనిర్వా హకుల నెదుర్కొన్న ఆర్థిక సమస్యలు, గ్రంథనిర్మాణ సమస్యలు, జాగునకు కారణమయ్యెను. య అన్యభాషలలో ప్రకటింపబడిన విజ్ఞానసర్వస్వముల సంఖ్యను, వారు నిక్కముగ ముగ్ధులగుదురు. సాధారణ విజ్ఞానసర్వస్వములే కాక, ని విజ్ఞానకోశము, వయోభేదమును బట్టి ఆయా వర్గములవారికి, బాలకులకు, కోళములు – ఇట్లసంఖ్యాక ముగా ఈశాఖ వ్యాపించినది. ఆంగ్ల భాషయంపై (1) New Popular Encyclopaedia (2) New Century Encyclopaedia ofు ames (3) The New Encyclo- paedia of Sports (4) Pears Encyclopaedia (5) Children's Encyclopaedia (6) Neunes' Pictorial- Knowledge (7) Encyclopaedia Britannica (8) The New Encyclopaedia (9) Encyclopaedia of Religion and Ethics (10) The Encyclopaedia and Dictionary of Education (11) Cyclopaedia of Education (12) Children's Dictionary (13) Encyclopaedia of social sciences (14) The New Educator Encyclo- paedia (15) Harmsworth's universal Bacyclopaedia (16) The Modern Encyclopaedia. ఇట్లిం కెన్ని కలవో తెలియదు. పులగముమీద పప్పువలె ఆంగ్లములోనున్న విజ్ఞానసర్వస్వములు చాలవన్నట్లు అమెరికా -