Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- సంయు క్త రాష్ట్రప్రజలు 'Encyclopaedia Americana' అను పేర 80 సంపుటములు వ్యాపించిన ప్రశస్త మహా గ్రంథమును ఆంగ్లభాషలో నిర్మించిరి. ఈ విజ్ఞాన రాశితో పోల్చినప్పుడు మద్రాసు తెలుగుభాషాసమితివారును, హైదరాబాదు సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ సమితివారును సేకరింపగల జ్ఞానసంచయము - ఇసుకలో పిల్లలు కట్టు కొను పిచ్చిక గూడును మించదేమో యను వెరపు జనించును. ఇంక పునరుక్తి, చర్విత చర్వణము అను భయ మేల? విజ్ఞానసర్వస్వములు మొదటి దశయందు వ్యక్తి ప్రజ్ఞాధీనములుగనే యుండినట్లు తెలియుచున్నది. అవి సమష్టికృషి ఫలితములుగా లేవు. ఒక వైజ్ఞానికుడు వివిధ శాస్త్రములపై వ్రాసిన వేర్వేరు లఘు గ్రంథముల సంపుటి విజ్ఞానసర్వస్వనామమున పరగుచుండెను. అట్టివి ముఖ్యముగ అద్యయన గ్రంథములుగ ఉపయోగపడు చుండెనేకాని పరామర్శ (Reference) గ్రంథములుగ ఉద్దేశింపబడినట్లు కానిపించదు. ప్రపంచమునందు మొట్ట మొదటి విజ్ఞానసర్వస్వ గ్రంథము ప్రాచీన గ్రీకు దేశమున వెలువడే నని తలచుచున్నారు. అరిస్టాటిలు (క్రీ. పూ. 384-828) దీని కర్తయని కొందరును, స్ప్యూసిప్పకు అను నాతడు కర్తయని కొందరును భావించుచున్నారు. వీరిద్దరును మహాతత్త్వ వింతకుడైన ప్లేటోకు శిష్యులని తెలియుచున్నది. ప్రాచీన రోము దేశమున మార్కస్ టెరెన్షియస్ వారో (క్రీ. పూ. 168 27) అను నాతడొక విజ్ఞానసర్వస్వమును కూర్చెను. ఈతడు ప్రసిద్ధ విజేత యైన జూలియస్ సీజరునకు సమకాలికుడు. దీనియందు కావ్యశాస్త్రము, గణితము, జోతిశ్శాస్త్రము, వైద్యము సంగీతము, వాస్తుశాస్త్రము మున్నగునవి చర్చింపబడెను. వర్తమానకాలపు విజ్ఞానసర్వస్వములను పోలిన గ్రంథమును మొట్టమొదట కూర్చినవాడు 'ప్లినీ' యనువాడు. ఈతని 'నాచురల్ హిస్టరీ' అను గ్రంథము 87 సంపుటములుగా నున్నది. ఇప్పటి విజ్ఞానసర్వస్వముల వలెనే ఇది బహుకర్తృకమైన రచనా విశేషము. దీనిలో భూగోళశాస్త్రము, మానవజాతి శాస్త్రము, జంతుశాస్త్రము, వృక్షశాస్త్రము, వృక్షాయుర్వేదము, ఖనిజ శాస్త్రము వంటి వివిధ విషయములు సమకూగ్పిబడెను. ఇందు అసంఖ్యాక విషయములపై అసంఖ్యాకు అయిన రచయితలు కృతులు రచియించిరి. 5. Co గు నవి, 7 మధ్య యుగములందును యూరపు ఖండమున విజ్ఞానసర్వస్వ నిర్మాణము సాగెను. ఫ్రాన్సు దేశపు పాదిరీ బ్యూవే నగరమునకు చెందిన విన్సెంటు అనునాతడు (క్రీ శ. 1190 1284) 'స్పెక్యులమ్ మాజస్' అను గొప్ప గ్రంథమును సమకూర్చెను. మధ్యయుగ విజ్ఞానమున కిది అద్దమువంటి గ్రంథమని చాల కాలము ప్రశస్తి వహిం చెను. జర్మనీ దేశమునందు క్రీ. శ. 188 ప్రాంతమున ప్రకటింపబడిన లాటిను భాషాగ్రంథము విజ్ఞానసర్వస్వ నిర్మాణములో నూతన దశను ప్రారం పూర్వ గ్రంథములు, ఆయా శాస్త్రములు వర్గీకరింపబడి, వానిపై వ్రాయబడిన లఘు కృతుల సముచ్చ గ నుండెనని చెప్పనైనది. ఆల్బైడ్ అను ఈ జర్మను పండితుడు కూర్చిన గ్రంథమునకు మొట్టమొదటి 'ఎన్ సైక్లో పీడియా' అను పేరు వాడబడెనట. ఇది అకారాది క్రమమున కూర్పబడుట విశేషము. ఈ హలమున ఆంగ్లభాషలో కూడ అకారాది వర్ణక్రమమున విజ్ఞానసర్వస్వ రచన సాగ మొదలిడెను. జాన్ హారికను నాతడు (క్రీ. శ. 1667-1719) “An universal English Dic- tionary of Arts and Sciences" (s -ప్రకృతిశాస్త్రములను గూర్చిన ఆంగ్ల విశ్వకోశము) అను గ్రంథమును ప్రకటించెను. సమకాలికులైన పంతు రాములు పలువురు దీనిలో రచన సాగించుట విశేషము. సుప్రసిద్ధ వైజ్ఞానికుడు సర్ ఐజాక్ న్యూటను మహా డు 'ఆమ్లములు' అను సంశముపై దీనిలో వ్యాసము వ్రాసెనట. మరియు ఆధార గ్రంథముల పట్టిక ఇచ్చారు ఈ సంకలనమందలి విశిష్టత. జగద్విఖ్యాతమైన ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వమును గూర్చి ఇదివరకే కొంత ముచ్చటింపవైనది. విశ్వకోశ నిర్మాణ చరిత్రయందు ఇది యొక ఉజ్జ్వల ఘట్టమని భావింపబడుచున్నది. విప్లవాత్మక చింతకులైన ఆ కాలపు ఫ్రెంచి తాత్త్వికు అందరును దీనిలో రచన సాగించిరి. ఇది ప్రభుత్వాగ్రహమునకు గురియై, వెలుతురు చూచుట సందేహాస్పదమయ్యెను. 85 సంపుటములు ఈ మహాగ్రంథము 1751 లో ఆరంభింపబడి 1780 నాటికి సమాప్తి చెందెను. భారతీయులకు చిరపరిచితమైన ఆంగ్ల విజ్ఞాన సర్వస్వము 'Encyclopaedia Britannica' ఒక నాటిలో కాని, ఒక తరములో కాని నిర్మింపబడిన ఉద్గ్రంథము కాదు. దీనికిముందే ఆంగ్లమునందు విజ్ఞానసర్వస్వరచన