Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అసఫ్ జాహి పరిపాలనము తెలంగాణపు భాషా సంస్కృతులకు సుదీర్ఘ నిదాఘమైనది. ఆసన్న వర్షమైన కాలమున వేసగి మరింత చెల రేగును. ఈ శతాబ్దారంభమున ఆంధ్రభాషను, సంస్కృతిని రక్షించుకొనవలెనను మహత్తరా ళయముతో హైద రాబాదు నగరమునందు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ మను మట్టి విత్తనమును శ్రీయుతులు రాజా నాయని వేంకట రంగారావు, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి మున్నగు మహనీయులు నాటిరి. ఐదుగురుకూడి ఒక గింజను మొలవేయుటయా ? తొమ్మండుగురు వడ్రంగులు కలిసి డోలు చేయబోయి సోల చేసినట్లున్నదీ వృత్తాంత మందురేమో. కాని వారి సంకల్ప బలమెట్టిదో ఆసోలయే తవ్వ అయి, మాన అయి, అడ్డ అయి, కుంచ మయి పుట్టి అయి. గరిసె అయి, రోదసీ కుహరమంత కొలపాత్రయైనది. ఇంతలో ఏమూలనుండియో శ్రీ మాడపాటి హనుమంతరావను తోటమాలివచ్చి పూర్వోక్తులైన మహనీయులు వేసిన బీజమును చీమ ఓపికతో పెంచి, పెద్దది చేసెను. అది యొక పెద్ద కథ లెండు. ఈ చిన్న విత్తన మా ధారముగా ఎన్నియో రాజకీయ వృక్షములు, సారస్వత తరువులు తెలంగాణపు ఉద్యానము నలంకరించినవి. సమగ్ర విజ్ఞానసర్వస్వ ప్రచురణమునకు ఆంధ్రదేశము నోచుకొనక పోయెనే అను చింత తెలంగాణపు సారస్వత వ్యవసాయకులను పెక్కు దినములనుండి వెన్నంటు చుండెను. కీ.శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులు గారు ఆంధ్ర విజ్ఞానసర్వస్వమును ఆరంభింపగాచూచి, తమ భాషలో అట్టి యుద్యమము లేకపోయెనే యని మథన పడి మహారాష్ట్ర విద్వాంసు అయిన కేత్కరుగారు మహారాష్ట్ర జ్ఞానకోశము నారంభించి, 28 సంపుటములుగల యుద్ధంథమును ప్రకటించి పెట్టిరి. ఆంధ్రమునందు విజ్ఞాన సర్వస్వ ప్రచురణము నాటికిని నేటికిని సమగ్రతను చెంద కుండుట ఏ సాహిత్యకునకు మా రణముగ నుండదు? కుందేలు - తాబేలు కథ ఆవృత్తి యగు చున్నదా? విడి జమీందారు .త్య విరి సమః అని ఆధునిక విజ్ఞానమునకు సరియగు వద్దమగునా, కాదా, యను 'భూపాలు డొక్కడు తానుద్దేశించిన విజ్ఞానసర్వస్వ గ్రంథమును సమా ప్తికి కొని పెట్టుదన్నకు సూ/ ప్రశ్నలు ఓరకు పేద యం దంతి ఆంధ్రు లేల సృజింప మహా లెంత ప్రగల్బులో సమా = MAI ఎణిలో నుంచబడిన నిర్వృత్తవస్తువు. సమగ్రమైన విజ్ఞానసర్వస్వమును యూ 3గ సమాధానము చెప్పవలయు నన్న వ్యష్టికృషియందు ఆంధ్రు చెందిన విన్సె'. ప్రగల్బులని చెప్పదగియున్నది. తెలంగాణమునందు సాహిత్యజాగృతి యేర్పడినప్పటినుండియూ రా .. ధ్యయుగ వి సి. 1 శ్రీ శ్రీమును నిర్వర్తించి చూపవలె నను యోగ్యతృష్ణ సాహితీపరులను థ మండలి యొక్క ఆదర్శములను కొనసాగించుటకై ఆంధ్ర చంద్రికా గ్రంథమండలి కొంత కృను ప్రారం సారస్వత పరిషత్తు కృషి ఇప్పటికిని సాగుచునే యున్నది. ఉద్యమము లను, సంస్థలను, ఉపాయుల సముచ్చట, ఓర్పుతో నిర్వహించుట తెలంగాణీయులకు శ్రీ మాడపాటి హను మంతరావు పంతులు, రాజట్ట మొదటి వేంకటరామరెడ్డి మహాశయుల వంటి వారు నేర్పిన విద్య. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమును తెలంగాణము సిద్ధము చేయవలయునను ప్రయత్నములు క్రీ. శ. 1945 ప్రాంతమున త్వర పెట్టుచుండెను. విజ్ఞ శేషమ జరిగియుండెను. ప్రణాళిక పై 'న్ హాక చర్చింపబడుచుండెను. కాని కాల మింకను అనుకూలింపలేదు. es" (s "A . పోలీసుచర్య అనంత! పుప్పడిన గొప్ప సాహిత్య ప్రభాతమునందు దాశరథి, కాళోజీ ప్రభృతి కవి శకుంతారావముల నడుమ విష్ణు మస్వ నిర్మాణముపై కొందరికి తిరిగి అభిలాష తలయెత్తెను. ఈ సన్ని వేశ మును గూర్చి మేము ఇదివరలో ప్రకటించిన కొన్ని వాక్యములనే తిరిగి ఉద్ధరించుచున్నాము. “1958 వ సంవ త్సరమునందు, ఒక నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ గణితశాస్త్ర శాఖాచార్యుడయిన డాక్టరు బేతనభట్ల విశ్వ నాథముగారు తెలుగుశాఖకు చెందిన శ్రీ లక్ష్మీరంజనంగారి దగ్గరకు హఠాత్తుగా వచ్చి యిట్లు ప్రసంగించిరి:- విశ్వ : వెనుక మనము విడిచి పెట్టిన విజ్ఞానసర్వస్వ నిర్మాణ తంతువులను మరల చేపట్టవలెను. లక్ష్మీ: అమ్మయ్యో, అంతభారమును వహించుటకు మనకు శక్తిచాలదు. అదియునుగాక వారు విజ్ఞానసర్వస్వమును వ్రాయించుచున్నారని వినుచున్నాముగదా ! తెలుగు భాషాసమితి